Thursday, February 04, 2010

మాయదారి మల్లిగాడు--1973





















సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::P.సుశీల

Film Directed By::Adoorti SubbaRao

తారాగణం::కృష్ణ,మంజుళ,జయంతి,పద్మనాభం,నాగభుషణం,అంజలిదేవి,ప్రసన్నరాణి.  

పల్లవి::

మల్లెపందిరి నీడలోన జాబిల్లీ
మంచమేసి ఉంచినాను జాబిల్లీ
మల్లెపందిరి నీడలోన జాబిల్లీ
మంచమేసి ఉంచినాను జాబిల్లీ
మా అన్నకు మా చంద్రికి ఇది తొలొరేయీ
నాకిది వరమోయీ
కళ్ళుకుట్టి వెళ్ళకోయీ జాబిల్లీ
తెల్లవారనీయకోయీ ఈ రేయీ

చరణం::1


గడుసుపిల్లకు వయసునేడే గురుతుకొచ్చిందీ

మొరటువాణ్ణి మనసుదానికి పులకరించిందీ..
గడుసుపిల్లకు వయసునేడే గురుతుకొచ్చిందీ
మొరటువాణ్ణి మనసుదానికి పులకరించిందీ
ఇద్దరికి ఈ నాడు నీవే ముద్దు నేర్పాలీ
ఆ ముద్దుచూసీ చుక్కలే నిను వెక్కిరించాలి
కళ్ళుకుట్టి వెళ్ళకోయీ జాబిల్లీ
తెల్లవారనీయకోయీ ఈ రేయీ

చరణం::2


పెళ్ళి సంబరమెన్నడెరుగని ఇల్లునాదీ
పసుపుతాడే నోచుకోని బ్రతుకు నాదీ..
పెళ్ళి సంబరమెన్నడెరుగని ఇల్లునాదీ
పసుపుతాడే నోచుకోని బ్రతుకు నాదీ
ఈ పెళ్ళి చేసి నేనుకూడ ముత్తైదు వైనాను
ఈ పుణ్యమే పై జన్మలో నను ఇల్లాలిని చేయాలి


మల్లెపందిరి నీడలోన జాబిల్లీ
మంచమేసి ఉంచినాను జాబిల్లీ
మా అన్నకు మా చంద్రికి ఇది తొలొరేయీ
నాకిది వరమోయీ
కళ్ళుకుట్టి వెళ్ళకోయీ జాబిల్లీ
తెల్లవారనీయకోయీ ఈ రేయీ


Mayadari Malligadu--1973
Music::K.V.Mahadevan
Lyricist::Acharya-Atreya
Singer's:P.Suseela
Film Directed By::Adoorti SubbaRao
Cast::Krishna,Manjula,Jayanti,Padmanabham,Naagabhushanam,Anjalidevi,Prasannaraani.

:::::::::::::::::::

Mallepandiri needalona jabilli
manchamesi vunchinanu jabilli
Mallepandiri needalona jabilli
manchamesi vunchinanu jabilli
Ma annaku..ma chandriki 
idi tolireyi..naakidi varamoyi
Kallukutti..vellakoyi jabilli 
Tellavaraneeyakoyi..ee reyi..ii

::::1

Gadusu pillaku vayasu nede guruthukochindi 
Moratuvaani manasu daaniki pulakarinchindi 
Gadusu pillaku vayasu nede guruthukochindi 
Moratuvaani manasu daaniki pulakarinchindi 
Iddariki eenadu nuvve muddu nerpaali 
Aa muddu chusi..chukkale ninu vekkirinchaali 
Kallukutti vellakoyi..jabilli
Tellavaraneeyakoyi..ee reyi..ii

::::2

Pelli sambaramennaderugani illu naadi 
Pasuputhaade nochukoni bratuku naadi 
Pelli sambaramennaderugani illu naadi 
Pasuputhaade nochukoni bratuku naadi 
Ee pelli chesi nenu kuda muttaiduvainanu 
Ee punyame pai janmalo nanu illaalini cheyaali 

Mallepandiri needalona jabilli
manchamesi vunchinanu jabilli
Ma annaku..ma chandriki
idi tolireyi..naakidi varamoyi
Kallukutti vellakoyi..jabilli

Tellavaraneeyakoyi..ee reyi..ii

మంచిమనుషులు--1974



సంగీతం::KV. మహాదేవన్
రచన::ఆత్రేయ,ఆచార్య
గానం:: SP. బాలు , p. సుశీల


నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను
నేను నువ్వు నువ్వు నేను లేనిచో
ఈ జగమే లేదు
నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను
నేను నువ్వు నువ్వు నేను లేనిచో
ఈ జగమే లేదు

అందరిలా నాకూ..ఒక అమ్మ వుందనుకొన్నానూ
ఏదినాన్నా..అమ్మఏదనీ..ఎన్నోసార్లడిగానూ
అందరిలా నాకూ..ఒక అమ్మ వుందనుకొన్నానూ
ఏదినాన్నా..అమ్మఏదనీ..ఎన్నోసార్లడిగానూ
నిన్నసరె చూపలేదూ..రూపైనా చూడలేదూ
నువ్వుంటే రాకుంటావా..నన్ను చూడకుంటావా
నన్ను చూడకుంటావా....

ఈ ప్రపంచమే అంతే బాబూ..
ఎవరైన నవ్వితే..ఏడుస్తుందీ..
ఏడుస్తే..నవ్వుతుందీ

నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను
నేను నువ్వు నువ్వు నేను లేనిచో
ఈ జగమే లేదు

కొమ్మలేక ఎక్కడైనా..పింద పెరుగుతుందా
కాడలేక ఏనాడైనా..పూవు నిలిచి ఉంటుందా
సౄష్టిలోన జరగని వింతా..మనిషి చేతనవుతుందా
బిడ్డలెరగని తల్లికైనా..పేగు కదలకుంటుందా
ప్రేమ తెలియకుంటుందా..

నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను
నేను నువ్వు నువ్వు నేను లేనిచో
ఈ జగమే లేదు

కొండల్లే నేనున్నానూ..గుండె పగలకా
మంచల్లే నువ్వెళ్ళావూ..మనసు తెలియకా..2
ఎన్నిజన్మలో అనుకొన్నామూ..ఈ కలయికా
నిన్నా..నేడే..మాసిపోతే..రేపులేదికా..రేపులేదికా

నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను
నేను నువ్వు నువ్వు నేను లేనిచో
ఈ జగమే లేదు

మంచిమనుషులు--1974






సంగీతం::KV . మహాదేవన్
రచన::ఆత్రేయ ,ఆచార్య
గానం::SP .బాలు , P. సుశీల


పెళ్ళైయిందీ..ప్రేమవిందుకు..వేళైయిందీ
పెళ్ళైయిందీ..ప్రేమవిందుకు..వేళైయిందీ
వయసూ ఉరికిందీ..సొగసూ..రగిలిందీ
పెదవీ కదిలిందీ..పంటనొక్కింది

పెళ్ళైయిందీ..ప్రేమవిందుకు..వేళైయిందీ
పెళ్ళైయిందీ..ప్రేమవిందుకు..వేళైయిందీ
వయసూ ఉరికిందీ..సొగసూ..బెదిరిందీ
పెదవీ అదిరిందీ..పంటనొక్కింది
పెళ్ళైయిందీ..ప్రేమవిందుకు..వేళైయిందీ

కమ్మని కలవచ్చిందీ..ఆ కలకొక రూపొచ్చిందీ
కమ్మని కలవచ్చిందీ..ఆ కలకొక రూపొచ్చిందీ
జరిగినదీ గురుతొచ్చిందీ..ఇక జరిగేది ఎదురొచ్చిందీ
జరిగినదీ గురుతొచ్చిందీ..ఇక జరిగేది ఎదురొచ్చిందీ
కళ్ళకు జతకుదిరిందీ..కథలెన్నో చెపుతుందీ
పెదవిమీద రాసుందీ..చదివి చెప్పమన్నదీ
పెళ్ళైయిందీ..ప్రేమవిందుకు..వేళైయింద్

కుర్రతనం కొత్తరుచులు కోరిందీ..
రుచితెలిసిన కొంటెతనం..గారంగా కొసరిందీ
కుర్రతనం కొత్తరుచులు కోరిందీ..
రుచితెలిసిన కొంటెతనం..గారంగా కొసరిందీ
గడుసుతనం కొసరీ..ఆ అసలు ఇవ్వనన్నదీ
ప్రతిరోజు కొసరిస్తే..అసలుమించిపోతుందీ
పెళ్ళైయిందీ..ప్రేమవిందుకు..వేళైయింద్

ఎప్పుడో నన్నిచ్చాను..ఇంకిప్పుడేమి ఇస్తాను
ఇన్నాళ్ళు ఇవ్వనిదీ..మిగిలెన్నెన్నో ఉన్నవీ
ఎప్పుడో నన్నిచ్చాను..ఇంకిప్పుడేమి ఇస్తాను
ఇన్నాళ్ళు ఇవ్వనిదీ..మిగిలెన్నెన్నో ఉన్నవీ
ఇపుడే తెలిసిందీ..ఎప్పుడెప్పుడని ఉందీ
మూడుముళ్ళు వేసిందీ..ఏడడుగులు నడిచిందీ
అందుకే..ఆ విందుకే..అహహా..ఆ ఆ ఆ ఆ ఆ

పెళ్ళైయిందీ..ప్రేమవిందుకు..వేళైయిందీ
పెళ్ళైయిందీ..ప్రేమవిందుకు..వేళైయిందీ
వయసూ ఉరికిందీ..సొగసూ..బెదిరిందీ
పెదవీ అదిరిందీ..పంటనొక్కింది
పెళ్ళైయిందీ..ప్రేమవిందుకు..వేళైయిం
దీ