Tuesday, August 14, 2007

గౌరవం--1970

పాటను ఇక్కడ వినండి


గానం ::SP.బాలు P.సుశీలసంగీతం: :M.S.విశ్వనాథన్
రచన::రాజశ్రీ 

యమునా తీరాన రాధ మదిలోన
కృష్ణుని ప్రేమ కథా....
కొసరి పాడేటి కోరి వలచేటి
మనసు నీది కదా..


హృదయం తెలుపు ఊహలలో..
రాగం నిలుపు ఆశలలో..
తేనెల తేటల తీయని భావన
ఊరెను నా మనసులో..


!! యమునా తీరాన రాధ మదిలోన
కృష్ణుని ప్రేమ కథా....
కొసరి పాడేటి కోరి వలచేటి
మనసు నాది కదా.. !!


ఎదలో తలపే వణికెనులే
అధరం మధురం చిలికెనులే
రాధా హృదయం మాధవ నిలయం
మాయని ఈ చరితమే


మనసే నేడు వెనుకాడే
హృదయం విరిసి కదలాడే
లోలో భయము తొణికేనే
ఎదలో సుఖము విరిసేనే
పందిరిలో నిను పొందెద ఆ దినం..
ఆ దినమే పండుగ


!! యమునా తీరాన రాధ మదిలోన
కృష్ణుని ప్రేమ కథా....
కొసరి పాడేటి కోరి వలచేటి
మనసు నాది కదా..
లా..లాలలాలలలా.. !!