సంగీతం::చక్రవర్తి
రచన::ఆత్రేయ
గానం::L.R.ఈశ్వరీ , P.సుశీల
తారాగణం::శోభన్ బాబు,వాణిశ్రీ, విజయలలిత,ప్రభాకర రెడ్డి, సూర్యకాంతం,రమణారెడ్డి,G.వరలక్ష్మి
పల్లవి::
నే నేమి ఎరుగని..దాననా పసిపాపనా
పో పోవె పిచ్చిదాన..నా కన్నీ తెలుసును
నీకన్నా నువ్వేమన్నా..పో పోవె పిచ్చిదాన
చరణం::1
అన్నది జరిపించాను..మనసన్నది మూసేశాను
అన్నది జరిపించాను..మనసన్నది మూసేశాను
మూసిన తలుపులు..తెరుచుకోవు
మూసిన తలుపులు..తెరుచుకోవు
ఆశలు నా కిక లేనేలేవు
ఆశలు నా కిక...లేనేలేవు
పో పోవె పిచ్చిదాన..నా కన్నీ తెలుసును
నీకన్నా నువ్వేమన్నా..పో పోవె పిచ్చిదాన
చరణం::2
దేవుడు నిద్దురపోయాడు..మన రాతలు మార్చిరాశాడు
దేవుడు నిద్దురపోయాడు..మన రాతలు మార్చిరాశాడు
మారిన రాతలు మార్చమని..మారిన రాతలు మార్చమని
నా మనసును నిద్దుర లేపాడు..నా మనసును నిద్దుర లేపాడు
పో పోవె పిచ్చిదాన..నా కన్నీ తెలుసును
నీకన్నా నువ్వేమన్నా..పో పోవె పిచ్చిదాన
చరణం::3
దీపం వెలుగువు నీ వైతే..నీ రూపం నీడగా నేనుంటా
దీపం వెలుగువు నీ వైతే..నీ రూపం నీడగా నేనుంటా
వెలుగు నీడ కలవవులే..వెలుగు నీడ కలవవులే
వెన్నెల చంద్రుని వీడదులే..వెన్నెల చంద్రుని వీడదులే
పో పోవె పిచ్చిదాన నే నేమి ఎరుగని..దాననా
పసిపాపనా..ఆ..పో పోవె..పిచ్చిదాన