Wednesday, December 02, 2009

మంచిరోజులు వచ్చాయి--1972






సంగీత::T.చలపతిరావ్ 
రచన::దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం::ఘంటసాల
తారాగణం::అక్కినేని,కాంచన,గుమ్మడి,నాగభూషణం,రామకృష్ణ,అంజలీదేవి,గీతాంజలి,కృష్ణంరాజు,సత్యనారాయణ

పల్లవి::

నేలతో నీడ అన్నది..నను తాకరాదని
పగటితో రేయి అన్నది..నను తాకరాదని
నీరు తన్ను తాకరాదని..గడ్డిపరక అన్నది
నేడు భర్తనే తాకరాదని..ఒక భార్య అన్నది

చరణం::1

వేలి కొసలు తాకనిదే..వీణ పాట పాడేన
చల్లగాలి తాకనిదే..నల్ల మబ్బు కురిసేనా 
తల్లి తండ్రి ఒకరి నొకరు..తాకనిదే నీవు లేవు
నేను లేను నీవు లేవు నేను లేను..లోకమే లేదులే 
నేలతో నీడ అన్నది..నను తాకరాదని
పగటితో రేయి అన్నది..నను తాకరాదని

చరణం::2

రవి కిరణం తాకనిదే..నవకమలం విరిసేనా
మధుపం తను తాకనిదే..మందారం మురిసేనా
మేను మేను తాకనిదే..మనసు మనసు కలవనిదే 
మమతలేదు..మనిషిలేడు..ఆఆఆ 
మమతలేదు..మనిషిలేడు మనుగడయే లేదులే
నేలతో నీడ అన్నది..నను తాకరాదని
పగటితో రేయి అన్నది నను తాకరాదని

చరణం::3

అంటరాని తనము ఒంటరి తనము 
అనాదిగా మీ జాతికి అదే మూలధనము
అంటరాని తనము ఒంటరి తనము 
అనాదిగా మీ జాతికి అదే మూలధనము 
ఇక సమభావం సమధర్మం సహజీవన మనివార్యం 
తెలుసుకొనుట మీ ధర్మం..తెలియకుంటె మీ ఖర్మం 
నేలతో నీడ అన్నది నను తాకరాదని
పగటితో రేయి అన్నది నను తాకరాదని
నీరు తన్ను తాకరాదని గడ్డిపరక అన్నది
నేడు భర్తనే తాకరాదని ఒక భార్య అన్నది ఈ భార్య అన్నది

మంచిరోజులు వచ్చాయి--1972




సంగీత::T.చలపతిరావ్ 
రచన::కొసరాజు రాఘవయ్య
గానం::ఘంటసాల
తారాగణం::అక్కినేని,కాంచన,గుమ్మడి,నాగభూషణం,రామకృష్ణ,అంజలీదేవి,గీతాంజలి,కృష్ణంరాజు,సత్యనారాయణ

పల్లవి::

సిరిపల్లె చిన్నది చిందులు వేస్తున్నది 
చిన్నగాలి తాకిడికే చిర్రుబుర్రుమన్నది 
ఓయమ్మో..ఓ..భయమేస్తున్నదీ  
సిరిపల్లె చిన్నది చిందులు వేస్తున్నది 
చిన్నగాలి తాకిడికే చిర్రుబుర్రుమన్నది 
ఓయమ్మో..ఓ..భయమేస్తున్నదీ

చరణం::1

మొన్న మొన్న ఈ పల్లెటూరిలో పుట్టిన బుజ్జాయి
చొ..ఊ..ఊ..ఊ..ఊ..ఆయీ   
మొన్న మొన్న ఈ పల్లెటూరిలో పుట్టిన బుజ్జాయి
నిన్నటిదాకా పరికిణి కట్టి..తిరిగిన పాపాయి 
బస్తీ మకాము పెట్టి..బడాయి నేర్చుక వచ్చి 
బస్తీ మకాము పెట్టి..బడాయి నేర్చుక వచ్చి 
బుట్టబొమ్మలా గౌను వేసుకొని ఫోజులు కొడుతూ ఉన్నది 

సిరిపల్లె చిన్నది...చిందులు వేస్తున్నది 
చిన్నగాలి తాకిడికే...చిర్రుబుర్రుమన్నది 
ఓయమ్మో..ఓ..భయమేస్తున్నదీ 

చరణం::2

ఇప్పుడిప్పుడే లండను నుండి దిగింది దొరసాని.."Shut up" 
వచ్చీ రానీ ఇంగిలీసులో..దంచుతోంది రాణి 
You Idiot...బాసపీసు రేగిందంటే
ఒళ్ళు పంబరేగేనండి..బాసపీసు రేగిందంటే
ఒళ్ళు..పంబరేగేనండి 
అబ్బ తాచుపాములా..పడగ విప్పుకొని తై తై మన్నది 
సిరిపల్లె చిన్నది...చిందులు వేస్తున్నది 
చిన్నగాలి తాకిడికే...చిర్రుబుర్రుమన్నది 
ఓయమ్మో..ఓ..భయమేస్తున్నదీ  

చరణం::3

సిగ్గే తెలియని చిలిపి కళ్ళకు నల్లని అద్దాలెందుకు 
తేనెలు చిలికే తెలుగు ఉండగా ఇంగిలీసు మోజెందుకు
ఓయబ్బో ఇంగిలీసు దొరసాని..నోరు మంచిదైనప్పుడు
ఊరు...మంచిదే ఎప్పుడు 
నోరు మంచిదైనప్పుడు..ఊరు మంచిదే ఎప్పుడు 
తెలుసుకోలేని బుల్లెమ్మలకు..తప్పవులే తిప్పలు 
హేయ్..సిరిపల్లె చిన్నది...చిందులు వేస్తున్నది 
చిన్నగాలి తాకిడికే...చిర్రుబుర్రుమన్నది 
ఓయమ్మో..ఓ..భయమేస్తున్నదీ  

మంచిరోజులు వచ్చాయి--1972




సంగీత::T.చలపతిరావ్ 
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::అక్కినేని,కాంచన,గుమ్మడి,నాగభూషణం,రామకృష్ణ,అంజలీదేవి,గీతాంజలి,కృష్ణంరాజు,సత్యనారాయణ

పల్లవి::

చం చం చచచం చం చం చచచం లలల్లా
ఎగిరే గువ్వ ఏమంది..విసిరే గాలి ఏమంది
ప్రకృతిలోన స్వేచ్చకన్న..మిన్నలేనే లేదంది
ఎగిరే గువ్వ ఏమంది..ఏమంది..ఈఈఈ ఓహో హో

చరణం::1

పూలకెందుకు కలిగెనే..ఈ ఘుమఘుమలు 
ఈ మధురిమలు..డ డ డ డ ర డ డ డ డ ర
తీగ లెన్నడు నేర్చెనే..ఈ అల్లికలు ఈ అమరికలు 
స్వేచ్చకోరే మనసువుంటే..పొందలేనిది యేముంది 
ర ర ర ర ర ర ర ర ర రి..ర ర ర ర ర ర ర ర   
ఎగిరే గువ్వ ఏమంది..ఏమంది..ఓహోహో

చరణం::2

కోకిలెన్నడు నేర్చెనే..ఈ సరిగమలు 
సరాగములు..డ డ డ డ ర డ డ డ డ ర 
నెమలి కెవ్వరు నేర్పిరే ఈ లయగతులు ఈ స్వరజతులు 
స్వేచ్చకోరే మనసువుంటే..నేర్వలేనిది యేముంది 
ఎగిరే గువ్వ ఏమంది..ఏమంది..ఓహోహో ఓ

చరణం::3

శిరసు వంచక నిలువనా..గుడి గోపురమై 
గిరి శిఖరమునై..డ డ డ డ ర డ డ డ డ ర
అవధులన్నీ దాటనా..ప్రభంజనమై జలపాతమునై 
స్వేచ్చకోరే మనసునాది..ఇంక నా కెదురేముంది
ర ర ర ర ర ర ర ర ర రి..ర ర ర ర ర ర ర ర
ఎగిరే గువ్వ ఏమంది..విసిరే గాలి ఏమంది
ప్రకృతిలోన స్వేచ్చకన్న..మిన్నలేనే లేదంది
తా ర ర రా ర..రా ర..తా ర ర రా ర రా ర

మంచిరోజులు వచ్చాయి--1972





సంగీత::T.చలపతిరావ్ 
రచన::కొసరాజు రాఘవయ్య
గానం::ఘంటసాల
తారాగణం::అక్కినేని,కాంచన,గుమ్మడి,నాగభూషణం,రామకృష్ణ,అంజలీదేవి,గీతాంజలి,కృష్ణంరాజు,సత్యనారాయణ

పల్లవి::

ఏటేటా వస్తుంది సంక్రాంతి పండగ..ఆఆఅ
బీదసాదల కెల్ల ప్రియమైన పండగ..ఆఆఆ 
ఈనాటి సంక్రాంతి అసలైన పండగ సిసలైన పండగ
కష్టజీవులకు అది ఎంతో కన్నుల పండగ అది కన్నుల పండగ
ఈనాటి సంక్రాంతి అసలైన పండగ సిసలైన పండగ 
కష్టజీవులకు అది ఎంతో కన్నుల పండగ అది కన్నుల పండగ
ఎవ్వరేమి అనుకున్నా..ఎంతమంది కాదన్నా  
ఎవ్వరేమి అనుకున్నా..ఆ..ఎంతమంది కాదన్నా
ఉన్నవాళ్ళ పెత్తనం ఊడుతుందిలే..ఏఏఏ
సోషలిజం వచ్చే రోజు..దగ్గరుందిలే..ఏ
ఈనాటి సంక్రాంతి అసలైన పండగ సిసలైన పండగ 
కష్టజీవులకు అది ఎంతో కన్నుల పండగ  అది కన్నుల పండగ

చరణం::1

గుడిసె కాపురాలు మాకు ఉండబోవులే..ఆ..ఆ..ఆ..ఆ 
ఈ కారులు మేడలు కొద్దిమందికే స్థిరము కావులే..ఆ..ఆ..ఆ..ఆ
గుడిసె కాపురాలు మాకు ఉండబోవులే
ఈ కారులు మేడలు కొద్దిమందికే స్థిరము కావులే
ఓడలు బండ్లై..ఓఓఓ ఓహోయ్..బండ్లు ఓడలై..ఆ..ఆ..ఆ 
ఓడలు బండ్లై...బండ్లు ఓడలై 
తారుమారు ఎప్పుడైనా తప్పదులే తప్పదులే
ఈనాటి సంక్రాంతి అసలైన పండగ సిసలైన పండగ 
కష్టజీవులకు అది ఎంతో కన్నుల పండగ  అది కన్నుల పండగ

చరణం::2

ఎగిరిపడే పులిబిడ్డలు పాపం ఏమైపోతారు ఏమైపోతారు..ఆహా హా హా 
పిల్లుల్లాగా తొక ముడుచుకొని...మ్యావ్ మ్యావ్ మంటారు
కిక్కురుమనక..ఆ..ఆ..ఆ..ఆ..కుక్కిన పేనై..ఆ..ఆ..ఆ..ఆ
కిక్కురుమనక కుక్కిన పేనై చాటుగా నక్కుతారు చల్లగా జారుకుంటారు
ఈనాటి సంక్రాంతి అసలైన పండగ సిసలైన పండగ 
కష్టజీవులకు అది ఎంతో కన్నుల పండగ అది కన్నుల పండగ
ఎవ్వరేమి అనుకున్నా...ఎంతమంది కాదన్న
ఎవ్వరేమి అనుకున్నా...ఎంతమంది కాదన్న
ఉన్నవాళ్ళ పెత్తనం ఊడుతుందిలే సోషలిజం వచ్చే రోజు దగ్గరుందిలే
ఈనాటి సంక్రాంతి అసలైన పండగ సిసలైన పండగ 
కష్టజీవులకు అది ఎంతో కన్నుల పండగ  అది కన్నుల పండగ