సంగీతం::చక్రవర్తి
రచన::అప్పలాచార్య
గానం::L.R.అంజలి,పద్మనభం,చక్రవర్తి,కౌసల్య
తారాగణం::కృష్ణం రాజు,జగ్గయ్య,రాజబాబు,పద్మనాభం,శారద,భారతి,రమాప్రభ,నిర్మల, హలం
పల్లవి::
అన్నమో రామచంద్రా యటంచు..అలమటించు నాకు
అదృష్టమున్ చాల కల్గించినావు..నీవే..ఏఏఏఏ..నీవే
నాపాలి..భాగ్య..ఆఆఅ..రాశివి
కప్పా..ఆ..కప్పా అందరికన్నా నువ్వే గొప్పా
కప్పా..ఆ..అందరికన్నా నువ్వే గొప్పా కప్పా
జంతుజాలముల కన్న..జాతి పక్షులకన్న
జంతుజాలముల కన్న..జాతి పక్షులకన్న
గొప్పలు చెప్పే తప్పుడు మనుషులకన్నా..ఆఆఆ
కప్పా అందరికన్నా నువ్వే గొప్పా కప్పా
ఓ కప్పా నా కప్పా..కప్ప కప్ప కప్ప కప్ప
కప్పహరే మహా గొప్పహరే చెప్పు హరే కథ చెప్పు హరే
కప్పహరే మహా గొప్పహరే చెప్పు హరే కథ చెప్పు హరే
చరణం::1
కరువు కాటకం..వచ్చినప్పుడు
వేపమండ నీ కాలికి..కట్టీ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ.ఓ ఓ ఓ ఓ
కరువు కాటకం వచ్చినప్పుడు
వేపమండ నీ కాలికి కట్టీ
పల్లకిలో నిను..ఊరేగింతురు
ఒహో ఒహో ఒహో ఒహో ఒహో ఒహో
పల్లకిలో నిను ఊరేగింతురు
వేడుకలెన్నో చేసేరూ..వానలకోసం ఏడ్చేరు
కప్పా అందరికన్నా నువ్వే గొప్పా కప్పా
ఓ కప్పా నా కప్పా..కప్ప కప్ప కప్ప కప్ప
కప్పహరే మహా గొప్పహరే చెప్పు హరే కథ చెప్పు హరే
కప్పహరే మహా గొప్పహరే చెప్పు హరే కథ చెప్పు హరే
చరణం::2
మత్స్య కూర్మ నరసింహ వరాహ
అవతారములను దాల్చిన దేవుడు
దదరిననా దదరిననా
నా దా నా దా నా దా
మత్స్య కూర్మ నరసింహ వరాహ
అవతారములను దాల్చిన దేవుడు
నీ అవతారం ఎత్తుట మరచీ
నీ అవతారం ఎత్తుట మరచీ
ఎంతో ద్రోహం చేశాడు నీకు
కప్పా అందరికన్నా నువ్వే గొప్పా
కప్పా ఓ కప్పా నా కప్పా
కప్ప కప్ప కప్ప కప్ప
కప్పహరే మహా గొప్పహరే
చెప్పు హరే కథ చెప్పు హరే
కప్పహరే మహా గొప్పహరే
చెప్పు హరే కథ చెప్పు హరే
చరణం::3
నెమలిని ఎక్కెను కుమారస్వామి కుమారస్వామి
ఎద్దును ఎక్కెను నీలకంఠుడు..నీలకంఠుడు
కుక్కను కుక్కను కుక్కను ఎక్కెను వీరభద్రుడు
ఎవరూ నిన్ను ఎక్కకపోవుట..చాలే..
ఎవరూ నిన్ను...ఎక్కకపోవుట
చాలా తప్పు నిజమో..కాదో నీవే చెప్పు
కుక్కా ఛీ ఐ యాం సారీ..కప్పా అందరికన్నా నువ్వే గొప్పా
కప్పా ఓ కప్పా నా కప్పా..కప్ప కప్ప కప్ప కప్ప
కప్పహరే మహా గొప్పహరే చెప్పు హరే కథ చెప్పు హరే
కప్పహరే మహా గొప్పహరే చెప్పు హరే కథ చెప్పు హరే