Saturday, January 12, 2008

మనసు-మాంగల్యం--1971
సంగీతం::పెండ్యలనాగేశ్వరరావు 
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు,S.జానకి
తారాగణం::అక్కినేని,జమున,జగ్గయ్య,అంజలీదేవి,పద్మనాభం,రమణారెడ్డి,చంద్రమోహన్,రామకృష్ణ,గీతాంజలి.

పల్లవి::

పో పో పో..ఎంతదూరంపోతావో  
పో పో పో..ఎంతదూరంపోతావో
పోయి పోయి..చూడు నువ్వెక్కడ వుంటావో  
నా...పక్కనె వుంటావు
రా రా రా..ఎంత దూరం వస్తావో 
రా రా రా..ఎంత దూరం వస్తావో  
వచ్చి వచ్చి..చూడు నన్నందుకుంటావో  
నా..సొంతమవుతావో..రా రా రా 

చరణం::1

మరునీ విల్లునుండి అమ్ములాగ..బెదరీ తుళ్ళిపడే లేడిలాగ
మరునీ విల్లునుండి అమ్ములాగ..బెదరీ తుళ్ళిపడే లేడిలాగ
పరుగుతీసేవు పారిపొయ్యేవు..పరువమే నీదని గర్వమా  
నిన్ను...పట్టుకోలేననీ...పందేమా  
మరుపేరాని తీపి తలపులాగ..అలుపే లేని కోడె వలపులాగ
మరుపేరాని తీపి తలపులాగ అలుపే లేని కోడె వలపులాగ
ఉరకలు వేసేవు తరముకు వచ్చేవు..మగసిరే నీదని  
గర్వమా...నన్ను గెలిచుకోవలేననీ పంతమా
రా రా రా..ఎంత దూరం వస్తావో  
వచ్చివచ్చి..చూడునన్నందుకుంటావో  
నా..సొంతమవుతావో..రా రా రా 

చరణం::2

వయసూ వెంటబడే సొగసునీవు..మనసు కోరుకునే మమతనీవు 
వయసూ వెంటబడే సొగసునీవు..మనసు కోరుకునే మమతనీవు
రెండూ కలవాలి రెండూ గెలవాలి..మనసులో సొగసులే తెలియాలి  
తీపి మమతలో...వయసునే మరవాలి..ఆహాహా  
రా రా రా..ఎంత దూరం వస్తావో 
పో పో పో..ఎంతదూరంపోతావో..హాహాహా