Wednesday, February 11, 2009

~*~*~అమర గాయకుడు "ఘంటసాల" వర్ధంతి ~*~*~



అమర గాయకుడు "ఘంటసాల" వర్ధంతి సందర్భంగా, ఆయనకు
సమర్పిస్తున్న ఈ చిరు కానుక
ఇది నా సొంతంగా రాసినది కాదు
నా కు తెలిసిన వారు యాహూ చుమ్మ గ్రుప్ వారిలో
ఒకరైన మోహన్ దేవ రాజు గారి రాసిన
ఈ పాట
నాకు చాలా నచ్చినది మీరూ చదివి ఆనందిస్తారని కోరికతో....
మీ శక్తి

భళిరా ఓ గాయకా ఘంటసాల నాయకా
భళిరా ఓ గాయకా ఘంటసాల నాయకా
స్థిరమైనది మా మది లో మధురమైన నీ గానం
భళిరా ఓ గాయకా ఘంటసాల నాయకా

పదము లోని భావములు పదిలముగా మేళవించి
లాహిరి లో మమ్ములనూ కలవరింప చేసితివీ
సాధన లేనిదీ మరువగ రానిదీ
సాధన లేనిదీ మరువగ రానిదీ
పాడిన నీ పాటలూ వినినంతనె తెలియునురా
వినినంతనె తెలియునురా
భళిరా ఓ గాయకా ఘంటసాల నాయకా
భళిరా ఓ గాయకా ఘంటసాల నాయకా

ప్రేమ గీతి పలికితే మేను పులక రించెను
ముద్దు మాట పలికితే హద్దు నీకు లేదనెను
సాహిత్యమె నీ ధ్వనిలో ఓలలాడెనూ
సాహిత్యమె నీ ధ్వనిలో ఓలలాడెనూ
హృదయం లో ఆనందము ఘుభాళించెనూ
ఘుభాళించెనూ
భళిరా ఓ గాయకా ఘంటసాల నాయకా
భళిరా ఓ గాయకా ఘంటసాల నాయకా