Wednesday, July 25, 2007

చదువూ - సంస్కారం--1970






సంగీతం::రమేష్ నాయుడు
రచన::రాజశ్రీ గానం::P.సుశీల SP.బాలు
వద్దూ వద్దు పెళ్ళోద్దు
నీతోనా... పెళ్ళోద్దు
వద్దు వద్దు వద్దు వద్దు పెళ్ళోద్దు
వద్దూ వద్దు అనోద్దు
ఆ మాట నీవూ అనోద్దు
వద్దు వద్దు వద్దు వద్దు అనోద్దు !!
ఆ..అంటే ...
ఉహూ....
ఊ...అంటే....
ఉహూ.....
ఆ..అంటే ఊ..అంటె ఆరా తీస్తావూ....
ఏదో ఎదో ఎదో సాకుచెప్పి సోదా చేస్తావూ
పట్టాలంటావు దొంగను పట్టాలంటావు 2
పడుకొన్నా ఆ...గొడవే కలవరిస్తూవుంటావు

వద్దూ వద్దు పెళ్ళోద్దు
నీతోనా పెళ్ళోద్దు
వద్దు వద్దు వద్దు వద్దు పెళ్ళోద్దు !!
సూటిగా గుండెల్లోదూరి సోదా చేస్తానూ....
వాడి వాడి చూపులతో నే డీలు వేస్తానూ...
కౌగిలిచెరసాలలో నేను...నిన్నే...ఖైదుచేస్తానూ ..
కనీ....వినీ.... కనివిని ఎరుగని కఠినశిక్షవేస్తాను
వద్దా....?
వద్దు :(
వద్దూ వద్దు అనోద్దు
ఆ మాట నీవూ అనోద్దు
వద్దు వద్దు వద్దు వద్దు అనోద్దు !!
మ్మ్మ్...హు ...హు.....హే...
లలలా....ఆ....హూ....
లలలల....హూ.....లలలలా.....
హే...హా...ఆ......
ప్రేమంటే విలువైన జాతిరత్నం..
ఉహూ......
పెళ్ళంటేదానికొదిగే పసిడి ఉంగరం ..
ఓహో....
ఉంగరానవుంటేనే రతనానికి అందం ...
ఇద్దరూ...ఒకటైతే...ఇద్దరూ...ఒకటైతేనే
హద్దులేని ఆనందం వద్దా..?
వద్దూ వద్దు అనోద్దు
ఆ మాట నీవూ అనోద్దు
వద్దు వద్దు వద్దు వద్దు అనోద్దు !!
ఇద్దరమన్నది మనలో ఎపుడో రద్దైపోయిందీ..
అల్లరిమనసుల అల్లికలోనే..పెళ్ళైపోయిందీ....
అందుకే...వద్దన్నానందుకే...
వద్దన్నగాని .....అసలొద్దాన్నానా :(
ఈ నిముషంలో పెళ్ళన్నా... నే.. కాదంటానా ....

!! వద్దూ... మనం అనొద్దు
పెళ్ళోద్దనీ అనొద్దూ
వద్దు వద్దు వద్దు అనొద్దూ.... !!

శ్రీ కౄష్ణ తులాభారం--1966:::రాగం::ఖామాస్



సంగీతం::చళ్ళపళ్ళి సత్యం
రచన::సముద్రల రాఘవాచార్య(సీనియర్)
గానం::ఘంటసాల

రాగం::ఖామాస్

ఓ చెలి కోపమా
అంతలో తాపమా
సఖీ...నీ వలిగితే..
నే తాళజాలా
ఓ చెలి కోపమా
అంతలో తాపమా

అందాలు చిదే మోము
కందేను ఆవేదనలో
పన్నీట తేలించదనే
మన్నించవే...

ఓ చెలి కోపమా
అంతలో తాపమా
సఖీ...నీ వలిగితే..
నే తాళజాలా
ఓ చెలి కోపమా
అంతలో తాపమా

ఏనాడు దాచని మేను
ఈనాడు దాచదవేలా..
దరిచేరి అలరించెదనే
దయజూపవే...



ఓ చెలి కోపమా
అంతలో తాపమా
సఖీ...నీ వలిగితే..
నే తాళజాలా
ఓ చెలి కోపమా
అంతలో తాపమా

ఈ మౌనమోపగ లేనే
విరహాలుసైపగ లేనే
తలవంచి నీ పదములకు...
మృఒక్కేనులే......

నను భవదీయ దాసుని
మనంబున నెయ్యపుక్కింతబూని తాకిన
అదినాకు మన్ననయ
చెల్వగు నీ పదపల్లవంబు
మత్తను పులకాగ్రత కంఠ
కవితానము తాకిన నొచ్చునంచు
నే ననెయదా అల్కమానవుగదా...
ఇకనైన అరాళ కుంతలా...ఆ...ఆ...

శ్రీకృష్ణ తులాభారం--1966::మోహన::రాగం







సంగీతం::ఘంటసాల
రచన::సముద్రాల
గానం::P.సుశీల

రాగం::మోహన

మీరజాలగలడా..
మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి

నటనసూత్రధారి మురారి ఎటుల దాటగలడో నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
నటనసూత్రధారి మురారి ఎటుల దాటగలడో నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి

మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి

సుధాప్రణయజలధిన్ వైదర్భికి ఈడ తావు గలదే నాతోనిక వాదులాడగలడా సత్యాపతి
సుధాప్రణయజలధిన్ వైదర్భికి ఈడ తావు గలదే నాతోనిక వాదులాడగలడా సత్యాపతి

మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి

మధుర మధుర మురళీగానరసాస్వాదనమున
ఆ ఆ ఆఆఆఆ ఆ ఆ
మధుర మధుర మురళీగానరసాస్వాదనమున
అధర సుధారస మదినే గ్రోలగ
అధర సుధారస మదినే గ్రోలగ

మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
మీరజాలగలడా

ఆణిముత్యాల్లో ఇదో పాట పి.సుశీల గారి పాటల్లో ఒక అత్యుత్తమమైన పాటఅనే చెప్పుకోవాలి
ఆవిడ గొంతులోనే సత్యభామ మనసులో భావాలన్నీ పలికించారు. ముఖ్యంగా సుధాప్రణయజలధిన్ వైదర్భికి ఈడ తావు గలదే నాతోనిక వాదులాడగలడా సత్యాపతి చరణంలో ఆ గర్వం , కృష్ణుడు ఇంక పూర్తిగా తనవాడే అన్న నమ్మకం గొంతులోనే పలికించారు. జమున గారి నటన కూడా ఒక హైలైట్ ఈ పాటకి.

ఇన్స్పెక్టర్ భార్య--1970




సంగీతం: KV.మహాదేవన్
గానం : P.సుశీల, K.B.K. మోహన్‍రాజ్

రాధను నేనయితే...నీ రాధను నేనయితే..
రాధను నేనయితే..నీ రాధను నేనయితే
నిన్ను మలచుకుంటాను నా మురళిగా
నిన్ను చేసుకుంటాను నా తరుణిగా
నిన్ను మలచుకుంటాను నా మురళిగా
నిన్ను చేసుకుంటాను నా తరుణిగా

1)తోటనిండా మల్లియలు తుంటరి పాటల తుమ్మెదలు
తోటనిండా మల్లియలు తుంటరి పాటల తుమ్మెదలు
అల్లరి తుమ్మెదల అలికిడి వినగానె
అల్లరి తుమ్మెదల అలికిడి వినగానె
మల్లెలు సవరించు పై ఎదలు
గడసరి చినవాడు తోడుగ వుంటే
కరగును నునుసిగ్గు పరదాలు..
గడసరి చినవాడు తోడుగ వుంటే
కరగును నునుసిగ్గు పరదాలు.......
చిలిపిగ నను నీవు చేరుకుంటే
జల జల పొంగును పరువాలు

రాధవు నీవైతే నా రాధవు నీవైతే
నిన్ను మలచుకుంటాను నా మురళిగా
నిన్ను చేసుకుంటాను నా తరుణిగా

2) రాధ అంటే ఎవ్వరదీ ?
మాధవ పాదాల పువ్వు అది
రాధ అంటే ఎవ్వరదీ ?
మాధవ పాదాల పువ్వు అది
అంతటి స్వామి చెంతగ వుంటేనే
అంతటి స్వామి చెంతగ వుంటేనే
ఆమె మనసు పూచేది

తీయగ సోకే పిల్లగాలికి
పూయని పువ్వే వుంటుందా
తీయగ సోకే పిల్లగాలికి
పూయని పువ్వే వుంటుందా
కన్నుగీటే వన్నెకానికి
కరగని జవ్వని వుంటుందా

రాధను నేనయితేనీరాధను నేనయితే
నిన్ను మలచుకుంటాను నా మురళిగా
నిన్ను చేసుకుంటాను నా తరుణిగా.... !!

శ్రీకృష్ణ తులాభారం--1966


సంగీతం::పెండ్యాల
రచన::దాశరథి
గానం::P.సుశీల,S.జానకి


పల్లవి::

కరుణించవే తులసిమాతా..దీవించవే దేవి మనసారా
కరుణించవే తులసిమాతా..దీవించవే దేవి మనసారా

చరణం::1

నిన్నే కోరి పూజించిన సతికీ..కలుగు గాదె సౌభాగ్యములన్నీ
నిన్నే కోరి పూజించిన సతికీ..కలుగు గాదె సౌభాగ్యములన్నీ
కరుణించవే తులసిమాతా..కరుణించవే తులసిమాతా
దీవించవే దేవి మనసారా..కరుణించవే..దీవించవే..పాలించవే..తులసిమాతా

చరణం::2

వేలుపురాణి వాడని వయసూ వైభవమంతా నీ మహిమేగా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
వేలుపురాణి వాడని వయసూ వైభవమంతా నీ మహిమేగా
అతివలలో అతిశయమొందే భోగమందీయవే
కరుణించవే కల్పవల్లి..కరుణించవే కల్పవల్లి
దీవించవే తల్లి..మనసారా..కరుణించవే..దీవించవే..పాలించవే..కల్పవల్లి

చరణం::3

నిదురనైన నా నాధుని సేవ..చెదరనీక కాపాడగదే
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
నిదురనైన నా నాధుని సేవ..చెదరనీక కాపాడగదే
కలలనైనా గోపాలుడు నన్నే..వలచురీతి దీవించగదే
కలలనైనా గోపాలుడు నన్నే..వలచురీతి దీవించగదే
కరుణించవే కల్పవల్లి..దీవించవే తులసిమాతా
దీవించవే తల్లి..మనసారా..కరుణించవే..దీవించవే..పాలించవే..తులసిమాతా

శ్రీకృష్ణ తులాభారం--1966






సంగీతం::పెండ్యాల
రచన::దాశరథి
గానం::ఘంటసాల


పల్లవి::

భలే మంచి చౌక బేరము
ఇది సమయము మించినన్ దొరుకదు
త్వరన్ గొనుడు సుజనులార
భలే మంచి చౌక బేరము

విలువ ఇంతయని చెప్పుట కలవిగాని బేరము
విలువ ఇంతయని చెప్పుట కలవిగాని బేరము
సలిలజ గర్భాదులౌ ఘనులకందని బేరము
కలుముల చేడియకు సతతము నిలయమైన బేరము
ఫలాపేక్ష రహిత భక్త సులభమైన బేరము

భలే మంచి చౌక బేరము
ఇది సమయము మించినన్ దొరుకదు
త్వరన్ గొనుడు సుజనులార
భలే మంచి చౌక బేరము

మునివరా... తుదకిట్లు ననున్
మోసగింతువా... మునివరా...
ఘనులు స్వాదృశులే ఇటులన్
కరుణమాలిన ఇంకేమున్నది మునివరా...
తుదకిట్లు ననున్
మోసగింతువా... మునివరా...

చరణం::1

ధన ధనేతరముల చేతగాని
సాధన శమదమ నియమములకు గాని
లభియింపబోదు సుండీ
ధన ధనేతరముల చేతగాని
సాధన శమదమ నియమములకు గాని
లభియింపబోదు సుండీ
కాదనుకొను డౌననుకొనుడొక మనసు నిష్కళంకముగా
నొనరించి తృణంబొసగిన వెను వెంటనే నడచుచుండు

భలే మంచి చౌక బేరము
ఇది సమయము మించినన్ దొరుకదు
త్వరన్ గొనుడు సుజనులార
భలే మంచి చౌక బేరము

ఏమి సేతు ఎటుబోవుదు ఏ మార్గం అగుపడదే
ఏమి సేతు ఎటుబోవుదు ఏ మార్గం అగుపడదే
నా మనో విభుని దరిచేరగనీడాయెగా మునివరా...
తుదకిట్లు ననున్
మోసగింతువా... మునివరా...

ఓ యాదవులార కనుచు ఊరక నిలుచున్నారు
మీ యజమానిని గొనుడు సుమీ తరిచెడుగా
ఓ యాదవులార కనుచు ఊరక నిలుచున్నారు
మీ యజమానిని గొనుడు సుమీ తరిచెడుగా
పిదప నా ఈ పలుకులు మీ మానసములందు నిడి
దూరంబరయుడు సరుగున తడయగా

భలే మంచి చౌక బేరము
ఇది సమయము మించినన్ దొరుకదు
త్వరన్ గొనుడు సుజనులార
భలే మంచి చౌక బేరము

చరణం::2

ఏ విధి సవతులనిక వీక్షింపగలను
ప్రతి వచనంబేవిధాన బలుకగలను
ఎంత జేసితివి ముని
నీవు సత్యవంతుడవని ఎంచి
ఇట్లు పొరబడితిని మునివరా...

ఇదియే తుది సమయము త్వరపడుడు
ఇకెన్నటికినిన్ దొరుకబోదు సరి
ఇదియే తుది సమయము
సదమలాత్ములని ఇటు మరిమరి
నిశ్చయము దప్పకను తెల్పితిగా
సదమలాత్ములని ఇటు మరిమరి
నిశ్చయము దప్పకను తెల్పితిగా
అదృష్టమింతకెవరిదియో విధిగా
అచటికే కనునుగా ముదంబిపుడు

భలే మంచి చౌక బేరము
ఇది సమయము మించినన్ దొరుకదు
త్వరన్ గొనుడు సుజనులార
భలే మంచి భలే మంచి
భలే మంచి చౌక బేరము

చరణం::3

కొట్టు కొట్టండి కొట్టండి బుర్ర పగల
జుట్టూడ లాగండి చెవులు మెలేయండి
కొట్టు కొట్టండి కొట్టండి బుర్ర పగల
జుట్టూడ లాగండి చెవులు మెలేయండి

నారదుండంట సన్నాసి గండడంట
దొరగారినమ్మునంట తన బాబు సొమ్మంట
యహ నారదుండంట సన్నాసి గండడంట
దొరగారినమ్మునంట తన బాబు సొమ్మంట
అహ కొట్టు కొట్టండి కొట్టండి బుర్ర పగల
జుట్టూడ లాగండి చెవులు మెలేయండి
కొట్టు కొట్టండి కొట్టండి బుర్ర పగల
జుట్టూడ లాగండి చెవులు మెలేయండి

గడియ గడియకొచ్చి అమ్మగార్ని మోసపుచ్చి
గడియ గడియకొచ్చి అమ్మగార్ని మోసపుచ్చి
మెడకు తాడు గట్టి సొంత మేకపిల్లలాగ తెచ్చి
నడి బజారులోన కిట్ట సామినమ్మునంట
నీ తాత సొమ్మంట ఈడ కాసుకొన్నడంట
పుడికి తంగములాగ తంబుర మెడనేసుకుని
కడుపు లేక వాగుతారు నడుము విరిగి చచ్చేటట్టు

కొట్టు కొట్టండి కొట్టండి బుర్ర పగల
జుట్టూడ లాగండి చెవులు మెలేయండి
కొట్టు కొట్టండి కొట్టండి బుర్ర పగల
నడుములిరగ బుర్ర పగల చచ్చేటట్టు కొట్టండహే

దీక్ష--1951


సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::M.S.రామారావు
తారాగణం::G.వరలక్ష్మి,రాంగోపాల్,శివరాం,రమణారెడ్డి,లీల,కమల,రాజ్యం,రాజేశ్వరి 

పల్లవి::

పోరా బాబూ పో
పోరా బాబూ పో
పోయి చూడు ఈ లోకం పోకడ
పోరా బాబూ పో
ఆవేశాలను ఆశయాలను
వదిన కోసమే వదులుకొంటివా
ఆమెకు నీకు ఋణం తీరెగా
తెగించి చూడు తేలేదేమిటో
బాబూ పో..పోరా బాబూ పో

చరణం::1

ఉన్నవారు కాదన్నావో
ఊరు విడిచి పోతున్నావో
ఏ ఘనకార్యం సాధిస్తావో
ఏ ఘనకార్యం సాధిస్తావో
ఏమౌతావో ఎవరికెరుకరా
బాబూ పో..పోరా బాబూ పో

చరణం::2

దూరపు కొండలు నునుపేనేమో
దోషం నీలో లేదో ఏమో
నీవు నమ్మిన నీతి న్యాయం 
నీవు నమ్మిన నీతి న్యాయం 
నిజమౌనేమో తెలుసుకుందువో
బాబూ పో..పోరా బాబూ పో

చరణం::3

దేశసేవకై దీక్ష పూనమని
ధీరమాత దీవించెను నాన్న
కాకిని కోకిల చేస్తావో 
కాకిని కోకిల చేస్తావో  
లోకంలో ఒకడైపోతావో
పోరా బాబూ పో
పోరా బాబూ పో
పోయి చూడు ఈ లోకం పోకడ
పోరా బాబూ పో

చదువూ - సంస్కారం--1970



సంగీతం::రమేష్ నాయుడు
రచన::C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్..ఆ ఆ ఆ ఆ
దీపానికి కిరణం ఆభరణ
రూపానికి హృదయం ఆభరణం
హృదయానికీ ఏనాటికీ
తరగని సుగుణం ఆభరణం
తరగని సుగుణం ఆభరణం
దీపానికి కిరణం ఆభరణ
రూపానికి హృదయం ఆభరణం

నిండుగపారే ఏరు తన నీటిని తానే తాగదు
జగతిని చూపే కన్ను తన ఉనికిని తానె చూడదు
పరులకోసం బ్రతికే మనిషి
పరులకోసం బ్రతికే మనిషి
తనుబాగుతానే కోరడు
తనబాగు తానే కోరడు
దీపానికి కిరణం ఆభరణం
రూపానికి హృదయం ఆభరణం

తాజ్ మహలులో కురిసే వెన్నెల
పూరి గుడిసపై కురియదా
బృందావనిలో విరిసే మల్లియ
పేదముంగిట విరియదా
మంచితనము పంచెవారికీ
మంచితనము పంచెవారికీ
అంతరాలతో పనివుందా
అంతరాలతో పనివుందా
దీపానికి కిరణం ఆభరణం
రూపానికి హృదయం ఆభరణం

వెలుగున ఉంన్నంతవరకే
నీ నీడ తోడుగా ఉంటుంది
చీకటిలో నీవు సాగితే
అది నీకు దూరమౌతుందీ
ఈ పరమార్థం తెలిసిన నాడే
ఈ పరమార్థం తెలిసిన నాడే
బ్రతుకు సార్థకమౌతుందీ
బ్రతుకు సార్థకమౌతుందీ

దీపానికి కిరణం ఆభరణ
రూపానికి హృదయం ఆభరణం
హృదయానికీ ఏనాటికీ
తరగని సుగుణం ఆభరణం
తరగని సుగుణం ఆభరణం