సంగీతం::T.V. రాజు,
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల
ఆడవే ఆడవే ఆడవే జలకమ్ములాడవే
కలహంస లాగ జలకన్య లాగ
ఆడవే ఆడవే
1) ఆది కవి నన్నయ అవతరించిన నేల ఆ....
తెలుగు భారతి అందియలు పల్కె ఈ నేల
ఆంధ్ర సంస్కృతికి తీయని క్షీరధారలై
జీవకళలొల్కు గోదావరి తరంగాల
ఆడవే.. ఆడవే
2) నాగార్జునుని బోధనలు ఫలించినచోట ఆ..
బౌద్దమత వృక్షమ్ము పల్లవించిన చోట
బుద్ధం శరణం గఛ్ఛామి , ధర్మం శరణం గఛ్ఛామి , సంఘం శరణం గఛ్ఛామి ,
కృష్ణ వేణి తరంగిణి జాలి గుండెయైసాగరంబై రూపు సవరించుకొను నీట
ఆడవే ఆడవే
3) కత్తులును ఘంటములు కదను జొచ్చినవిచట
అంగళ్ళ రతనాలు అమ్మినారట ఇచట
నాటి రాయల పేరు నేటికిని తలపోయు తుంగభద్రా నదీ
తోయ మాలికలందు
ఆడవే ఆడవేఆడవే జలకమ్ములాడవే