సంగీతం::K.Vమహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల
లాలా ఆ ఆ లలలలలాల లాలా ఆ ఆ లలలలలాల
హుహు ఒహొహొ లాలల అహహ ఒహొహొ
రాళల్లో ఇసకల్లో రాసాము ఇద్దరి పేర్లు
కళ్ళుమూసి తిన్నగా కలిపి చదువుకో
ఒక్కసారి కలలలోన తీయగా గురుతు తెచ్చుకో
రాళల్లో ఇసకల్లో రాసాము ఇద్దరి పేర్లు
కళ్ళుమూసి తిన్నగా కలిపి చదువుకో
ఒక్కసారి కలలలోన తీయగా గురుతు తెచ్చుకో
:::1
కలలన్ని పంటలై పండనేమో కలిపింది కన్నుల పండగేమో
చిననాటి స్నేహమే అందమేమో అది నేటి అనురాగ బంధమేమో
తొలకరి వలపులలో పులకించు హృదయాలలో
తొలకరి వలపులలో పులకించు హృదయాలలో
ఎన్నాళ్ళకి ఈనాడు విన్నాము సన్నాయిమేళాలు
ఆ మేళతాళాలు మన పెళ్ళిమంత్రాలై వినిపించు వేళలో ఓ ఓ
ఎన్నెన్ని భావాలో
రాళల్లో ఇసకల్లో రాసాము ఇద్దరి పేర్లు
కళ్ళుమూసి తిన్నగా కలిపి చదువుకో
ఒక్కసారి కలలలోన తీయగా గురుతు తెచ్చుకో
:::2
చూసాను ఎన్నడో పరికిణీలో వచ్చాయి కొత్తగా సొగసులేవో
హృదయాన దాచిన పొంగులేవో పరువాన పూచెను వన్నెలేవో
వన్నెల వానల్లో వనరైన జలకాలలో
వన్నెల వానల్లో వనరైన జలకాలలో
మునగాలి తేలాలి తడవాలి ఆరాలి మోహంలో
ఆ మోహదాహాలు మన కంటిపాపల్లో కనిపించు మోములో ఓ ఓ
ఎన్నెన్ని కౌగిళ్ళో
రాళల్లో ఇసకల్లో రాసాము ఇద్దరి పేర్లు
కళ్ళుమూసి తిన్నగా కలిపి చదువుకో
ఒక్కసారి కలలలోన తీయగా గురుతు తెచ్చుకో
లాలలాల లాలల లాలలాలల లాలలాల లాలల లాలలాలల