Monday, May 30, 2011

లేత మనసులు--1966


సంగీతం::M.S.విశ్వనాధన్
రచన::దాశరధి
గానం::P.B.శ్రీనివాస్,P.సుశీల
తారాగణం::హరినాథ్,జమున,సూర్యకాంతం,

పల్లవి::

ఈ పూవులలో..ఒక చల్లదనం
నీ నవ్వులలో..ఒక వెచ్చదనం
ఈ పూవులలో..ఒక చల్లదనం
నీ నవ్వులలో..ఒక వెచ్చదనం
నీ నవ్వు పువ్వులందు ఉన్న 
మత్తుమందు మైమరపించెనులె
నీ నవ్వు పువ్వులందు ఉన్న 
మత్తుమందు మైమరపించెనులె

చరణం::1

లాలలలల లాలలలల లరలరరరలా
ఆ ఆ ఆ హా..ఆ ఆ ఆహా..ఆ ఆ ఆ హా
హా..ఆహా..ఆ..హా..హా..హ..హా

ఆ దూరములో నీవున్నప్పుడు 
ఈ తీరములో నేనున్నప్పుడు
ఇద్దరి ప్రేమ నది అయి ప్రవహించినది 
ముద్దుల నావ మననే జత చేసినది
పెనవేసిన తీగలై ఇరువురము 
ఇక కలకాలం ఏకమై వెలిగెదము
ఈ పూవులలో ఒక చల్లదనం
నీ నవ్వులలో ఒక వెచ్చదనం
నీ నవ్వు పువ్వులందు ఉన్న 
మత్తుమందు మైమరపించెనులె

చరణం::2

లాలలలల లాలలలల లరలరరరలా
ఆ కొండలలో ఆ కోనలలో 
ఆ దారులలో సెలయెరులలొ
ఆ హా హా హా ఆ హా హా హా
లలలాలలలా
ఆ కొండలలో ఆ కోనలలో 
ఆ దారులలో సెలయెరులలొ
జగమునంత మరచి విహరించెదము
సుఖములన్ని మనమే ఒడి నింపేదము
ఆకాశము నేలపై వాలినది 
ఒక తీయని కోరిక కలిగినది
ఈ పూవులలో ఒక చల్లదనం
నీ నవ్వులలో ఒక వెచ్చదనం
నీ నవ్వు పువ్వులందు ఉన్న 
మత్తుమందు మైమరపించెనులె
లాలలలల లాలలలల లరలరరరలా