Tuesday, August 02, 2011

మాంగల్య బలం--1959




సంగీతం::మాస్టర్ వేణు
రచన::శ్రీశ్రీ
గానం::ఘంటసాల, P.సుశీల
Film Directed By::Adoorti SubbaaRao
తారాగణం::అక్కినేని,సావిత్రి,ఎస్.వి.రంగారావు,రేలంగి,కన్నాంబ,రాజసులోచన,
సూర్యకాంతం,రమణమూర్తి

పల్లవి::

ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ
ఆకాశవీధిలో..అందాల జాబిలీ
వయ్యారి తారను చేరి
ఉయ్యలలూగెనే..సయ్యాటలాడెనే

ఆకాశవీధిలో..అందాల జాబిలీ
వయ్యారి తారను చేరి
ఉయ్యలలూగెనే..సయ్యాటలాడెనే

ఆకాశవీధిలో..అందాల జాబిలీ
వయ్యారి తారను చేరి
ఉయ్యలలూగెనే..సయ్యాటలాడెనే

చరణం::1

జలతారు మేలిమబ్బు పరదాలు నేసి..తెరచాటు చేసి
పలుమారు దాగి దాగి పంతాలుపోయి..పందాలు వేసి
అందాల చందమామ దొంగాటలాడెనే..దోబూచులాడెనే

ఆకాశవీధిలో అందాల జాబిలీ
వయ్యారి తారను చేరి
ఉయ్యలలూగెనే సయ్యాటలాడెనే
ఆఆఆఆ..ఓఓఓఓఓఓ..ఆఆఆఆ..ఓఓఓఓఓఓ

చరణం::2

జడివాన హోరు గాలి సుడి రేగి రానీ..జడిపించబోనీ
కలకాలం నీవే నేననీ పలు బాసలాడి..చెలి చెంత చేరి
అందాల చందమామ అనురాగం చాటెనే..నయగారం చేసెనే

ఆకాశవీధిలో అందాల జాబిలీ
వయ్యారి తారను చేరి
ఉయ్యలలూగెనే సయ్యాటలాడెనే
ఆఆఆఆ..ఓఓఓఓఓఓ..ఆఆఆఆ..ఓఓఓఓఓఓ