Tuesday, December 14, 2010

నీతి నిజాయితి--1972సంగీతం::S.రాజేశ్వరరావ్ 
రచన::D.C.నారాయణరెడ్డి  
గానం::S.జానకి 
తారాగణం::సతీష్ అరోరా,కాంచన,గుమ్మడి,నాగభూషణం,కృష్ణంరాజు

పల్లవి::

నీ మదిలో దాగిన పాట..నా పెదవిని పలికిందీ
నీ మదిలో దాగిన పాట..నా పెదవిని పలికిందీ
నీలో..నాలో..నీలో..నాలో..నిండిన వలపే
నేడే..ఏఏఏ..నేడే..వెల్లువ దూకిందీ
ఔనా..ఓ..ఔనౌనా..ఓ ఓ
నీ మదిలో దాగిన పాట..నా పెదవిని పలికిందీ

చరణం::1

మనసారగా నను చేరగా..నీ తనువేమో పులకించిందీ..ఓఓ 
మనసారగా నను చేరగా..నీ తనువేమో పులకించిందీ 
అది నీ చూపే చెప్పిందీ..తనివి తీరగా నువు తాకగా
తనివి తీరగా...నువు తాకగా 
నా అణువణువూ విరబూసిందీ..ఈఈఈ 
అది జిలుగు...పైటే చెప్పిందీ   
నీ మదిలో దాగిన పాట..నా పెదవిని పలికిందీ

చరణం::2

చిరునవ్వులే నువు చిందగా..నాపరువం రేకులు విరిసిందీ..ఓఓ 
చిరునవ్వులే నువు చిందగా..నాపరువం రేకులు విరిసిందీ 
అది విరి పానుపే చెప్పిందీ..అనురాగమే అనుబంధమై
అనురాగమే...అనుబంధమై
మన ఇరువురి మనసులు కలిసిందీ..ఈఈఈ
అది వీడని...కౌగిలి చెప్పిందీ   

నీతి నిజాయితి--1972


సంగీతం::S.రాజేశ్వరరావ్ 
రచన::కోసరాజురాఘవయ్య 
గానం::L.R.ఈశ్వరీ 
తారాగణం::సతీష్ అరోరా,కాంచన,గుమ్మడి,నాగభూషణం,కృష్ణంరాజు

పల్లవి::

డుబు డుబు..డుక్..డుక్
డుబు డుబు..డుక్..డుక్
అల్లరి చిల్లరి అబ్బయిల్లారా
గబ గబ..గప్..చిప్..గబ గబ..గప్..చిప్ 
నవ్వుల పువ్వుల అమ్మాయిల్లారా
ఆడండీ పాడండీ..అడిగిందానికి చెప్పండీ
అడిగిందానికి చెప్పండీ..ఓ చెపుతాం

చరణం::1

ఒక్క చోటనే...కదలకుండునది
టక్కు టక్కుమని ఆడుతుందది..ఏమిటదీ ?  
బొమ్మా...కాదు...గడియారం 
రెక్కల తోటీ...ఎగురుతుందదీ
చూడడానికీ చూపేలేనిది..ఏమిటది ?
కబోది పక్షి..ఆ..విమానం          
డుబు డుబు..డుక్..డుక్
అల్లరి చిల్లరి అబ్బయిల్లారా
గబ గబ..గప్..చిప్
నవ్వుల పువ్వుల అమ్మాయిల్లారా
ఆడండీ పాడండీ..అడిగిందానికి చెప్పండీ 

చరణం::2

అక్కడ ఇక్కడ వుంటుందీ..కబుర్లు అందిస్తుంటుందీ
చెప్పారంటే చక్లెట్ డబ్బా..చెప్పక పోతే బెత్తం దెబ్బా  
అదా..పనిమనిషి కాదు..టెలిఫోన్న్  
గిరగిర తిరుగుతు వుంటుందీ..తియ్యగ పాడుతు వుంటుందీ
గిరగిర తిరుగుతు వుంటుందీ..తియ్యగ పాడుతు వుంటుందీ
నేను చెప్తా..ఊ..చెప్పు 
జ్యోతిలక్ష్మి..ష్..గ్రామఫొన్  
డుబు డుబు..డుక్ డుక్
అల్లరి చిల్లరి అబ్బయిల్లారా
గబ గబ..గప్..చిప్న
వ్వుల పువ్వుల అమ్మాయిల్లారా
ఆడండీ..పాడండీ..అడిగిందానికి చెప్పండీ 

చరణం::3

రోజు రోజుకు చిన్నదౌతదీ..
రూపులేకనే కరిగి పోతది..ఏమిటదీ  
చందమామ..సబ్బుబిళ్ళా  
ఒక్కరిద్దరూ పోతుంటారు..ఉండలేక తిరిగొస్తుంటారు
ఎక్కడికీ..ఎక్కడికీ..దొంగతనానికీ 
కాదు....చంద్రమండలానికి..హా హా   
డుబు డుబు..డుక్..డుక్
అల్లరి చిల్లరి అబ్బయిల్లారా
గబ గబ..గప్..చిప్
నవ్వుల పువ్వుల అమ్మాయిల్లారా
డుబు డుబు..డుక్..డుక్..గబ గబ..గప్..చిప్
డుబు డుబు..డుక్..డుక్..గబ గబ..గప్..చిప్
డుబు డుబు..డుక్..డుక్..గబ గబ..గప్..చిప్

నీతి నిజాయితి--1972సంగీతం::S.రాజేశ్వరరావ్ 
రచన::పింగళి నాగేంద్రరావు 
గానం::ఘంటసాల,S.P.బాలు
తారాగణం::సతీష్ అరోరా,కాంచన,గుమ్మడి,నాగభూషణం,కృష్ణంరాజు

పల్లవి::

భలే మజాలే..భలే కుషీలే 
టైమ్ రోజాలే..మనం రాజాలే 

భలే మజాలే..భలే కుషీలే 
టైమ్ రోజాలే..మనం రాజాలేలే 

మంచికాలం వచ్చినపుడే..దంచికొట్టరా
సంచులు నించు ప్లానులేవో..ఎంచివేయరా
అహా..ఓహూ..అహా..ఓహూ..హేయ్  
            
భలే మజాలే..భలే కుషీలే 
టైమ్ రోజాలే..మనం రాజాలేలే

చరణం::1

రేసు హార్పు కొంటా..దర్భీ గెల్చుకుంటా
ఖర్చు అయిన డబ్బునెల్ల..డబుల్ లాగుకుంటా
హే భాయ్...ఓహోయ్   
పల్లెటూర్కి తిరిగె పోతా..స్టయిలుగాను హోటల్ పెడతా
ఆరునెలల కాకముందే..ఊరునిండా మేడలు కడతా..ఆ
అహా..ఓహూ..అహా..ఓహూ..హేయ్             
భలే మజాలే..భలే కుషీలే 
టైమ్ రోజాలే..మనం రాజాలే

చరణం::2

నైటు క్లబ్బు పెట్టేస్తా..న్యుడు కళను పోషిస్తా 
బ్లాకు మనీ పోగు చేస్తా..సిటీలన్నీ యేలేస్తా 
బోస్..యస్
అన్ని ఓట్లు కొనివేస్తా..ఎన్నికల్లో గెలిచేస్తా
పార్లమెంటు మెంబరునై..పర్మిట్లన్నీ కొట్టేస్తా..ఆ  
అహా..ఓహూ..అహా..ఓహూ..హేయ్             
భలే మజాలే..భలే కుషీలే 
టైమ్ రోజాలే..మనం రాజాలే

చరణం::3

స్టంటు పిక్చరు తీస్తా..డిస్యుం..డిస్యుం..ధనము దోచుకుంటా
స్టంటు పిక్చరు తీస్తా..ధనము దోచుకుంటా
అమెరికాకు పోతా..అనుభవాలు రాస్తా
హే..భాయ్..ఒహోయ్ 
రష్యాకు ట్రిప్పువేసి..రాకెట్టును కొట్టుకొచ్చి 
రష్యాకు ట్రిప్పువేసి..రాకెట్టును కొట్టుకొచ్చి 
పల్లెనుండి మూనుదాకా..రాచబాట వేసేస్తా..ఆ
అహా..ఓహూ..అహా..ఓహూ..హేయ్                 
భలే మజాలే..భలే కుషీలే 
టైమ్ రోజాలే..మనం రాజాలే
మనం రాజాలే..మనం..రాజాలే..మనం రాజాలే