Monday, April 05, 2010

విప్రనారాయణ--1954:::సింధుబైరవి:::రాగం







సంగీతం::S.రాజేశ్వరరావు 
రచన::సముద్రాల 
గానం::భానుమతి 
నిర్మాతలు:భానుమతి,రామకృష్ణరావు
దర్శకత్వం::రామకృష్ణారావు
తారాగణం::భానుమతి,నాగేశ్వరరావు

సింధుబైరవి:::రాగం 

పల్లవి::

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా
ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా
ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా

చరణం::1

వన్నెవన్నె చిన్నెలీను ఈ విలాసం
వన్నెవన్నె చిన్నెలీను ఈ విలాసం
చందమామ చిన్నబోవు ఈ ప్రకాశం
నిన్నేలువాని లీలలేరా
నిన్నేలువాని లీలలేరా
కన్నార కనరా ఏలుకోరా
కన్నార కనరా ఏలుకోరా

ఓ ఓ ఓ ఓ ఓ
ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా
ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా

చరణం::2

అందరాని విందుపైన ఆశలేలా
అందరాని విందుపైన ఆశలేలా
పొందుదుకోరు చిన్నదాని పొందనేలా
అందాలరాయా అందరారా
అందాలరాయా అందరారా
అనందమిదియే అందుకోరా
అనందమిదియే అందుకోరా

ఓ ఓ ఓ ఓ ఓ
ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా
ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా