Tuesday, October 07, 2008

బంగారు బాబు--1973



సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::P.సుశీల

Film Director::V.B.Rajendra Prasad
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,S.V.రంగారావు,జగ్గయ్య,జయంతి,రాజబాబు,S.వరలక్ష్మీ,కృష్ణ,శోభన్‌బాబు,
నాగభూషణం,పద్మనాభం.

:::::::::

రాణీ..పడిపోయావా??పడిపోయావా అంటే??
దెబ్బ తగిలిందా??

తగిలిందయ్యో తగిలిందీ పైరగాలి
ఎగిరిందయ్యో ఎగిరిందీ పైటకోంగు
తగిలిందీ..ఎగిరిందీ..అయ్యయ్యాయ్యాయ్యో..
మనసే ఉరకలు వేసింది..నా మనసే ఉరకలు వేసింది

తగిలిందయ్యో తగిలిందీ పైరగాలి
ఎగిరిందయ్యో ఎగిరిందీ పైటకోంగు
తగిలిందీ..ఎగిరిందీ..అయ్యయ్యాయ్యాయ్యో

మనసే ఉరకలు వేసింది..నా మనసే ఉరకలు వేసింది

::::1


కొమ్మ కొమ్మనా జంటలు చూస్తే..పూవుపూవునా తుమ్మెదలుంటే
కొమ్మ కొమ్మనా జంటలు చూస్తే..పూవుపూవునా తుమ్మెదలుంటే
గువ్వల గుసగుస వింటుంటే..గుండెలు రెపరెపమంటుంటే
అమ్మమ్మమ్మమ్మమ్మో..వయసే బుసబుస పోంగింది
ఆ ఆ..నా మనసే వురకలు వేసింది

తగిలిందయ్యో తగిలిందీ పైరగాలి
ఎగిరిందయ్యో ఎగిరిందీ పైటకోంగు
తగిలిందీ..ఎగిరిందీ..అయ్యయ్యాయ్యాయ్యో..
మనసే ఉరకలు వేసింది..నా మనసే ఉరకలు వేసింది

::::2


మబ్బును మబ్బు ముద్దులాడితే..సిగ్గున నింగి ఎర్రబారితే
మబ్బును మబ్బు ముద్దులాడితే..సిగ్గున నింగి ఎర్రబారితే
ఎన్నడు చూడని అందాలూ..చూశానమ్మా ఈనాడూ
అమ్మమ్మమ్మమ్మమ్మమ్మో..వయసు మనసు ఒకటై
ఉసురు పోసుకొన్నాయి..ఆ ఆ..నా ఉసురు పోసుకొన్నాయీ

తగిలిందయ్యో తగిలిందీ పైరగాలి
ఎగిరిందయ్యో ఎగిరిందీ పైటకోంగు
తగిలిందీ..ఎగిరిందీ..అయ్యయ్యాయ్యాయ్యో..
మనసే ఉరకలు వేసింది..నా మనసే ఉరకలు వేసింది

బంగారు బాబు--1973



సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల

Film Director::V.B.Rajendra Prasad
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,S.V.రంగారావు,జగ్గయ్య,జయంతి,రాజబాబు,S.వరలక్ష్మీ,కృష్ణ,శోభన్‌బాబు,
నాగభూషణం,పద్మనాభం.
::::::::

హా హా హా హా హా హా హా హా
శ్రీ రామ చంద్ర నారాయణ...
ఎన్ని కష్ట్టలు వచ్చాయిరా..నాయినా

శ్రీ రామ చంద్ర నారాయణ
ఎన్ని కష్ట్టలు వచ్చాయిరా నాయినా

శ్రీ రామ చంద్ర నారాయణ
ఎన్ని కష్ట్టలు వచ్చాయిరా నాయినా

అయ్యో..శ్రీ రామ చంద్ర నారాయణ
ఎన్ని కష్ట్టలు వచ్చాయిరా నాయినా


::::1

పగలంతా ఇద్దరమూ ఆలు మగలము
పడుకునే వేళకే పక్కలే దూరము
పగలంతా ఇద్దరమూ ఆలు మగలము
పడుకునే వేళకే పక్కలే దూరము
ఊరి వారికందము ఉత్తుత్తి కాపుర౦
ఊరి వారికందము ఉత్తుత్తి కాపుర౦
నోరూరుతున్న మనకేమో ఓపలేని తాపము
శ్రీ రామ చంద్ర నారాయణ
ఎన్ని కష్ట్టలు వచ్చాయిరా నాయినా

:::2


అన్నిఉన్న అందగత్తె అందుబాటులో ఉన్నా
అన్నమాటకోసమే ఆశలన్ని అణుచుకొన్నా
చ్చో..చ్చో..చ్చో..చ్చో..
అన్నిఉన్న అందగత్తె అందుబాటులో ఉన్నా
అన్నమాటకోసమే ఆశలన్ని అణుచుకొన్నా

ఉన్నవన్ని ఉన్నట్లే ఊడ్చివ్వాలనుకొన్నా
ఉన్నవన్ని ఉన్నట్లే ఊడ్చివ్వాలనుకొన్నా
కన్నెకున్న హద్దులకు కట్టుబడి ఊరుకొన్నా
శ్రీ రామ చంద్ర నారాయణ
ఎన్ని కష్ట్టలు వచ్చాయిరా నాయినా
అయ్యయ్యో..శ్రీ రామ చంద్ర నారాయణ
ఎన్ని కష్ట్టలు వచ్చాయిరా నాయినా

::::3


కళ్ళలోకి చూడకు..కాళ్ళు కలిపి నడవకు
మూడు ముళ్ళు పడేవరకు మోమాటం పెట్టకు
కళ్ళలోకి చూడకు..కాళ్ళు కలిపి నడవకు
మూడు ముళ్ళు పడేవరకు మోమాటం పెట్టకు

ఆ మంచి రోజు వచ్చును..హడ్డులేగిరిపోవును
ఆ మంచి రోజు వచ్చును..హడ్డులేగిరిపోవును
కాచుకొన్న వయసు కసి..అప్పుడే తీరును

శ్రీ రామ చంద్ర నారాయణ
ఎన్ని కష్ట్టలు వచ్చాయిరా నాయినా
ఓహో..శ్రీ రామ చంద్ర నారాయణ
ఎన్ని కష్ట్టలు వచ్చాయిరా నాయినా

బంగారు బాబు--1973




సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల

Film Director::V.B.Rajendra Prasad
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,S.V.రంగారావు,జగ్గయ్య,జయంతి,రాజబాబు,S.వరలక్ష్మీ,కృష్ణ,శోభన్‌బాబు,
నాగభూషణం,పద్మనాభం.

:::::

ఛీ..ఛిఛి..ఛిఛి..ఛీ..
ఛా..ఛా..ఛా..ఛా..ఛా..
చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది
దాని జిమ్మదియ్య..దాని జిమ్మదియ్య
అందమంతా చీరలోనే వున్నది

చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది
దాని జిమ్మదియ్య..దాని జిమ్మదియ్య
కొంగుకొంగు కలిపిచూడమన్నది

చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది
దాని జిమ్మదియ్య అందమంతా చీరలోనే వున్నది


:::1


మెరుపల్లె వచ్చింది నా యింటికి
నన్ను మెల్లంగా దించింది ముగ్గులోనికి
మెరుపల్లె వచ్చింది నా యింటికి
నన్ను మెల్లంగా దించింది ముగ్గులోనికి

తలదాచుకొమ్మని తావిస్తివి
తలదాచుకొమ్మని తావిస్తివి
పిల్లదొరికింది చాలనీ ఇల్లాల్ని చేస్తివి

చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది
దాని జిమ్మదియ్య అందమంతా చీరలోనే వున్నది


:::2


ప్రేమంటే నేర్పింది పిల్లవాడికి
దాంతో వెర్రెత్తిపోయింది కుర్రవాడికి
ఓయ్..వహు..వహు..హోయ్..వహు..వహూ
ప్రేమంటే నేర్పింది పిల్లవాడికి
దాంతో వెర్రెత్తిపోయింది కుర్రవాడికి

పిచ్చివాడనే పేరుచాటున మాటువేసినావూ
పిచ్చివాడనే పేరుచాటున మాటువేసినావూ
పిల్లదాని పెదవిమీదా కాటువేసినావు

హేయ్..సరి..సరి..సరి..సరి..సరి..సరి
చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది

హాయ్..దాని జిమ్మదియ్య
కొంగుకొంగు కలిపిచూడమన్నది


:::3


సరసంలో పడ్డాడు ఇన్నాళ్ళకి
హబ్బో సంగీతం వచ్చింది బుచ్చిబాబుకీ
సరసంలో పడ్డాడు ఇన్నాళ్ళకి
హబ్బో సంగీతం వచ్చింది బుచ్చిబాబుకీ

తెరచాటు తొలగింది పరువానికి
తెరచాటు తొలగింది పరువానికి
అది పరవళ్ళు తొక్కుతూ పాడింది నేటికి
సరి..సరి..సరి..సరి..సరి..సరి
చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది
దాని జిమ్మదియ్య..కొంగుకొంగు కలిపిచూడమన్నది

చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది
దాని జిమ్మదియ్య అందమంతా చీరలోనే వున్నది

సరి..స్సస్సా..సగస..స్సస్సా..
సమస..స్సస్సా..సనిసనిసనిదా
సరి..స్సస్సా..సగస..స్సస్సా..
సమస..స్సస్సా..సనిసనిసనిదా
సనిసనిసనిసా..సరిసరిసరిసా
సరిసరిసరిసరిసా....

Monday, October 06, 2008

దసరాబుల్లోడు--1971




Dasara_Bullodu_Nallavaade by anil4frds





సంగీతం::KV.మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల,S.జానకి


నల్లవాడే అమ్మమ్మా అల్లరి పిల్లవాడే
నల్లవాడే అమ్మమ్మా అల్లరి పిల్లవాడే

చిన్నవాడే ఓయమ్మ రాధకే చిక్కినాడే
లేదమ్మా లేదు రుక్మిణికే దక్కినాడె
నల్లవాడే అమ్మమ్మా అల్లరి పిల్లవాడే
చిన్నవాడే ఓయమ్మ రాధకే చిక్కినాడే
లేదమ్మా లేదు రుక్మిణికే దక్కినాడె
నల్లవాడే అమ్మమ్మా అల్లరి పిల్లవాడే

వెన్నెవంటి మనసున్న చిన్నవాడే
చిన్న నాటినుండి నువ్వు కోరుకొన్నవాడే
వెన్నెవంటి మనసున్న చిన్నవాడే
చిన్న నాటినుండి నువ్వు కోరుకొన్నవాడే
ప్రేమకే బానిసైపోతాడే
కాదమ్మ భక్తికే దాసుడై వుంటాడే
ప్రేమకే బానిసైపోతాడే
కాదమ్మ భక్తికే దాసుడై వుంటాడే
నల్లవాడే అమ్మమ్మా అల్లరి పిల్లవాడే
చిన్నవాడే ఓయమ్మ రాధకే చిక్కినాడే
లేదమ్మా లేదు రుక్మిణికే దక్కినాడె
నల్లవాడే అమ్మమ్మా అల్లరి పిల్లవాడే

నువ్వు వాని వరస వున్నదానివీ
నువ్వు వలపుదోచుకొన్నదానివీ
నువ్వు వాని వరస వున్నదానివీ
నువ్వు వలపుదోచుకొన్నదానివీ
మనసిచ్చి మాట పుచ్చుకొంటివీ
నీ మనసిచ్చి మాట పుచ్చుకొంటివీ
మంచితనముతో నువ్వు గెలుచుకొంటివీ
నల్లవాడే అమ్మమ్మా అల్లరి పిల్లవాడే


రాధా కౄష్ణులు కథలేనమ్మా
వారు ఎన్నడూ ఆలుమగలు కాలేదమ్మా
రాధా కౄష్ణులు కథలేనమ్మా
వారు ఎన్నడూ ఆలుమగలు కాలేదమ్మా
రాధా కౄష్ణుల ప్రేమే పవిత్రమూ
లోకానికే అది ఆదర్శమూ
రాధా కౄష్ణుల ప్రేమే పవిత్రమూ
లోకానికే అది ఆదర్శమూ


గోపాల బాలుడూ...నీ ప్రేమలోలుడూ
గోపాల కృష్ణుడూ...నీ పాలి దేవుడు
గోపాల బాలుడూ...నీ ప్రేమలోలుడూ
గోపాల కృష్ణుడూ...నీ పాలి దేవుడు
వాడు నీ వాడే...కాదు నీ వాడే
వాడు నీ వాడే...కాదు కాదు కానేకాడు
నల్లవాడే అమ్మమ్మా అల్లరి పిల్లవాడే...