Wednesday, March 31, 2010

జేబు దొంగ--1975




















సంగీతం::చక్రవర్తి
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::శోభన్‌బాబు,మంజుల,రాజబాబు,రోజారమణి,సత్యనారాయణ,రమాప్రభ 

పల్లవి::

గోవిందో గోవిందా గుట్టుకాస్తా గోవిందా
లడ్డులాంటి పడుచుపిల్ల అహ..
లడ్డులాంటి పడుచుపిల్ల అర్ధరాత్రి దొరికిందంటే
అంతకన్నా షోకుందా ఇంతకన్నా ఛాన్సుందా 
అంతకన్నా షోకుందా ఇంతకన్నా ఛాన్సుందా 
అంతకన్నా షోకుందా ఇంతకన్నా ఛాన్సుందా 

గోవిందో గోవిందా కుర్రవాడూ గోవిందా కుర్రవాడూ గోవిందా
పిల్లగాలికి గుబులురేగి పిల్లగాలికి గుబులురేగి
పిచ్చిపిచ్చి వేషాలేస్తే
గూబ గుయ్యిమంటుందోయ్జ లుబు వదిలిపోతుందోయ్
గూబ గుయ్యిమంటుందోయ్జ లుబు వదిలిపోతుందోయ్ 
గూబ గుయ్యిమంటుందోయ్జ లుబు వదిలిపోతుందోయ్

చరణం::1

దాచేస్తే దాగేదికాదు అందం 
మార్చేస్తే మారేదికాదు రూపం 
దోచుకోను దొరికేదికాదు అందం 
మెచ్చుకుంటే లొంగేదికాదు రూపం 
ఆడపిల్లలింతేలే అడుగుతుంటే బెట్టులే 
మెల్లంగ మెత్తబడి పోతారులే 
కొంటె కుర్రాళ్లింతేలే వెంటబడి వస్తార్లే
సై అంటే వెర్రిముఖం వేస్తారులే
ఆయ్ ఒక్కసారి సయ్యని చూదు గోవిందా
ఆహ వచ్చాడయ్యా మొనగాడు గోవిందా

గోవింగో గోవిందా అహా గుట్టుకాస్తా గోవిందా 
కుర్రవాడు గోవిందా

చరణం::2

ఇమ్మంటే ఇచ్చేదికాదు మనసు
రమ్మంటే వచ్చేదికాదు వయసు
వద్దంటే ఉరికింది నాలో వయసు
వదలొద్దు అంటుంది నిన్నే మనసు 

చల్లగాలి వేస్తుంది చలి ముంచుకొస్తుంది
వేడెక్కి పోతుంది లోలోన
లోపలున్న చలిచలికి పైనవున్న వేడికి
జత కుదిరిపోతుంది మనలోన
ఇంతకన్నా ఏం చెప్పేది గోవిందా
అహ ఎందుకింక నేనాగేది గోవిందా  

గోవిందో గోవిందా గుట్టుకాస్తా గోవిందా
లడ్డులాంటి పడుచుపిల్ల అహ..
లడ్డులాంటి పడుచుపిల్ల అర్ధరాత్రి దొరికిందంటే
అంతకన్నా షోకుందా ఇంతకన్నా ఛాన్సుందా 
అంతకన్నా షోకుందా ఇంతకన్నా ఛాన్సుందా 
అంతకన్నా షోకుందా ఇంతకన్నా ఛాన్సుందా 
గోవిందో గోవిందా

జేబు దొంగ--1975



















సంగీతం::చక్రవర్తి
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::శోభన్‌బాబు,మంజుల,రాజబాబు,రోజారమణి,సత్యనారాయణ,రమాప్రభ 

పల్లవి::

నీలాల..నింగిలో 
మేఘాల..తేరులో
ఆ..పాల..పుంతలో 
నీ..కౌగిలింతలో
నిలువెల్లా..కరిగిపోనా 
నీలోనా..కలిసిపోనా

నీలాల..నింగిలో 
మేఘాల..తేరులో
ఆ..పాల..పుంతలో 
నీ..కౌగిలింతలో..లో
నిలువెల్లా..కరిగిపోనా 
నీలోనా..కలిసిపోనా
నీలాల..నింగిలో 
మేఘాల..తేరులో..ఓ..ఓ

చరణం::1

ఆ నింగికి నీలం..నీవై 
ఈ నేలకు పచ్చను..నేనై
రెండూ కలిసిన..అంచులలో 
రేపూ మాపుల..సంధ్యలలో

ఎర్రని పెదవుల..ముద్దులుగా 
నల్లని కన్నుల..సుద్దులుగా
ఎర్రని పెదవుల..ముద్దులుగా 
నల్లని కన్నుల..సుద్దులుగా

మెల్లగ..చల్లగ మెత్తగ
మత్తుగ.హత్తుకుపోయీ
నిలువెల్లా..కరిగిపోనా..ఆ 
నీలోనా..కలిసిపోనా

నీలాల..నింగిలో 
మేఘాల..తేరులో..ఓ..ఓ

చరణం::2

ఆ హిమగిరి శిఖరం..నీవై 
ఈ మమతల మంచును..నేనై
ఆశలు కాచే..వేసవిలో
తీరని కోర్కెల..తాపంలో

శివపార్వతుల..సంబరమై 
గంగా యమునల..సంగమమై
శివపార్వతుల..సంబరమై 
గంగా యమునల..సంగమమై

ఉరకల..పరుగులా 
పరువములోనా
ప్రణయములోనా
నిలువెల్లా..కరిగిపోనా 
నీలోనా..కలిసిపోనా

నీలాల..నింగిలో 
మేఘాల..తేరులో
ఆ..పాల..పుంతలో 
నీ..కౌగిలింతలో..లో
నిలువెల్లా..కరిగిపోనా 
నీలోనా..కలిసిపోనా
నీలాల..నింగిలో 
మేఘాల..తేరులో 
ఆహాహా హా హహా..