Saturday, May 21, 2011

శంకరాభరణం--1980




సంగీతం::K.V.మహాదేవన్
రచన::వేటూరి
గానం::S.P.బాలు
తారాగణం::J.V.సోమయాజులు,చంద్రమోహన్,అల్లు రామలింగయ్య,మంజు భార్గవి,రాజ్యలక్ష్మి

పల్లవి::

శంకరా..ఆ..ఆ..నాదశరీరా పరా
వేదవిహారా హరా..జీవేశ్వరా
శంకరా..ఆ..ఆ..నాదశరీరా పరా
వేదవిహారా హరా జీవేశ్వరా..శంకరా 

చరణం::1

ప్రాణము నీవని గానమె నీదని..ప్రాణమె గానమనీ
మౌన విచక్షణ..గాన విలక్షణ..రాగమె యోగమనీ
ప్రాణము నీవని గానమె నీదని..ప్రాణమె గానమనీ
మౌన విచక్షణ..గాన విలక్షణ..రాగమె యోగమనీ
నాదోపాసన చేసిన వాడను..నీ వాడను నేనైతే
నాదోపాసన చేసిన వాడను..నీ వాడను నేనైతే

ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసితకంధరా నీలకంధరా
క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది 
అవధించరా..విని తరించరా
శంకరా..నాదశరీరా పరా..ఆ
వేదవిహారా హరా జీవేశ్వరా..శంకరా

చరణం::2

మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు
మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు

పరవశాన శిరసూగంగా..ధరకు జారెనా శివగంగా
పరవశాన శిరసూగంగా..ధరకు జారెనా శివగంగా
నా గానలహరి నువు మునుగంగ
ఆనందవృష్టి నే తడవంగా..ఆ..ఆ..ఆ..ఆ

శంకరా..నాదశరీరా పరా..ఆ..ఆ
వేదవిహారా హరా జీవేశ్వరా
శంకరా..శంకరా..శంకరా