Sunday, September 18, 2011

మూగనోము--1969





సంగీతం::R.గోవర్ధన్
రచన::దాశరధి
గానం::ఘంటసాల,P.సుశీల

రాగం~~ఆభోగి

Jamuna::
ఈ వేళ నాలొ ఎందుకో ఆశలు
లో లోన ఏవో విరిసెలే వలపులు
ఈ వేళ నాలొ ఎందుకో ఆశలు
లో లోన ఏవో విరిసెలే వలపులు


Anr::నీ లోని ఆశలన్నీ నా కోసమే
నాపిలుపే నీ లో వలపులై విరిసెలే
నీ లోని ఆశలన్నీ నా కోసమే
నాపిలుపే నీ లో వలపులై విరిసెలే

Jamuna::నీ చూపులో స్వర్గమే తొంగి చూసే
నీ మాటలో మధువులే పొంగి పోయే
నీ చూపులో స్వర్గమే తొంగి చూసే
నీ మాటలో మధువులే పొంగి పోయే
నా లోని ఆణువణువు నీదాయెలే
బ్రతుకంతా నీకే అంకితం చేయనా

Anr::నీ లోని ఆశలన్నీ నా కోసమే
నాపిలుపే నీ లో వలపులై విరిసెలే

Jamuna::లా...లా...లా...లా...

Anr::నీ రూపమే గుండెలో నిండిపోయే
నా స్వప్నమే నేటితో పండిపోయే
నీ రూపమే గుండెలో నిండిపోయే
నా స్వప్నమే నేటితో పండిపోయే

ఉయ్యాల జంపాల ఊగేనులే
కలకాలం మనకు ప్రేమయే ప్రాణము

Jamuna::ఈ వేళ నాలో ఎందుకో ఆశలు
లో లోన ఏవో విరిసెలే వలపులు
లా...లా ...లా ... ఊ హూ హు