Wednesday, June 01, 2011

గోకులంలో సీత--1997



సంగీతం::కోటి
రచన::వేటూరి
గానం::మను,K.S.చిత్ర
తారాగణం::పవన్ కళ్యాణ్, రాశి

పల్లవి::

అందాల సీమలోని..పారిజాత పుష్పమా 
ప్రాణాలు పోసుకున్న..పాలరాతి శిల్పమా 
వరించి నన్ను చేరుమా..సుఖాన ముంచి తేల్చుమా
ప్రియాతి ప్రియతమా..ఇదేమి సరిగమా 
శృంగార వీణ మీటి..గోల చేస్తే న్యాయమా 

అందాల సీమలోని..పారిజాత పుష్పమా 
ప్రాణాలు పోసుకున్న..పాలరాతి శిల్పమా 

చరణం::1 

రా రమ్మంది..లేత చెక్కిలి 
రేపెట్టింది కొత్త..ఆకలి 
సిగ్గు మొగ్గ..మేలుకుంది తియ్యగా 
తేనె ముద్దలారగించు..హాయిగా 
అంత భాగ్యమా..పంచ ప్రాణమా 
ఒడిలో చేరనీయుమా..హో 

అందాల సీమలోని..పారిజాత పుష్పమా 
ప్రాణాలు పోసుకున్న..పాలరాతి శిల్పమా 

చరణం::2 

లాగించేస్తే..ప్రేమ జిలేబి 
ఏమౌతుందో..కన్నే గులాబి 
పాలపొంగులాంటిదమ్మ..కోరిక 
పైటచాటు..దాచుకోకే ప్రేమికా 
కొంగుజారితే..కొంపమునగదా 
వాటే రిస్కు..మన్మథా 

అందాల సీమలోని..పారిజాత పుష్పమా 
ప్రాణాలు పోసుకున్న..పాలరాతి శిల్పమా 
వరించి నన్ను చేరుమా..సుఖాన ముంచి తేల్చుమా 
ప్రియాతి ప్రియతమా..ఇదేమి సరిగమా 
శృంగార వీణ మీటి..గోల చేస్తే న్యాయమా 
మ్మ్..మ్మ్..మ్మ్