Wednesday, February 24, 2010

రాముడు కాదు కృష్ణుడు--1983




సంగీతం::చక్రవర్తి
రచన::
గానం::S.P.బాలు 

పల్లవి::

మంచు ముత్యానివో..హంపి రాతననివో..ఓ..ఓ 
తెలుగు వాకిట వేసిన ముగ్గువో
ముగ్గు నడుమన విరిసిన ముద్దబంతి పువ్వువో..ఓ.. 
మంచు ముత్యానివో..
మంచు ముత్యానివో..హంపి రాతననివో.
తెలుగు వాకిట వేసిన ముగ్గువో
ముగ్గు నడుమన విరిసిన ముద్దబంతి పువ్వువో
మంచు ముత్యానివో..

చరణం::1

తెలుగు బడిలో తొలుత చుట్టిన శ్రీకారానివో
జానపదమున తీపి కలిపిన నుడికారనివో
గాలి వాటుకు..ఎండ పోటుకు..తాళలేని ఆకు చాటు పిందెవో  
కూచిపూడి కొమ్మవో..కొండపల్లి బొమ్మవో...
ప్రణయ మూర్తుల రాగ ప్రమిదకు..ప్రమిద ప్రమిదలో వెలుగు ప్రేమకు
ప్రతిగా కృతిగా ఆకృతిగా.. నిలిచే సుందరివో

మంచు ముత్యానివో..హంపి రాతననివో
తెలుగు వాకిట వేసిన ముగ్గువో
ముగ్గు నడుమన విరిసిన ముద్దబంతి పువ్వువో
మంచు ముత్యానివో..

చరణం::2

కాళిదాసుని కావ్యకవితకు ఆకారానివో
దేవరయుని శిల్ప చరితకు ప్రాకారానివో 
రెప్ప పాటుకు..లిప్త చూపుకు..అందరాని అందమైన మెరుపువో
మెరుపులోని పిలుపువో..పిలుపులోని తలపువో..
విరగబూసిన నిండు పున్నమికి..తిరగబోసిన పండు వెన్నెలకు
ప్రతిగా కృతిగా ఆకృతిగా..నిలిచే సుందరివో

మంచు ముత్యానివో..హంపి రాతననివో
తెలుగు వాకిట వేసిన ముగ్గువో
ముగ్గు నడుమన విరిసిన ముద్దబంతి పువ్వువో
మంచు ముత్యానివో.. 

జ్వాల--1985



















సంగీతం::ఇళయరాజ 
రచన::మైలవరపు గోపి 
గానం::S.జానకి 

పల్లవి::

అహా అ హాహా..అహాహా..ఆ ఆ 
ఏవేవో కలలు కన్నాను..మదిలో
ఏవేవో కలలు కన్నాను..మదిలో
మౌన మురళినై..విరహ వీణనై
స్వామి గుడికి చేరువైన వేళలో
ఏవేవో కలలు కన్నాను..మదిలో

చరణం::1

సుడిగాలులలో..మిణికే దీపం
ఈ కోవెలలో..లో..ఎటు చేరినదో
ఏ జన్మలోని బంధమో..ఇదే ఋణానుబంధమో
ఏ జన్మలోని బంధమో..ఇదే ఋణానుబంధమో
నీకు నేను బానిసై..నాకు నువ్వు బాసటై
సాగిపోవు వరమె చాలు 
ఏవేవో కలలు కన్నాను..మదిలో

చరణం::2

నా కన్నులలో..వెలుగై నిలిచీ
చిరు వెన్నెలగా..బ్రతుకే మలిచీ
నిట్టూర్పుగున్న గుండెకీ..ఓదార్పు చూపినావురా 
ట్టూర్పుగున్న గుండెకీ..ఓదార్పు చూపినావురా 

నాది పేద మనసురా..కాంచలీయలేనురా
కనుల నీరె కాంచరా