Friday, June 12, 2009

మజ్ఞు ~~రాగం::శివరంజని ~~1989



సంగీతం::లక్ష్మికాంత్ ప్యారేలాల్
రచన::దాసరి నారాయణ రావ్
గానం:::SP.బాలసుబ్రమణ్యం

రాగం::శివరంజని :::(హిందుస్తానీ కర్నాటక)


ఇది తొలిరాత్రీ..కదలని రాత్రీ
ఇది తొలిరాత్రి..కదలని రాత్రి
నీవు నాకు..నేను నీకు..చెప్పుకున్న..కధలరాత్రీ
ప్రేయసి రావే..ఊర్వశి రావే
ప్రేయసి రావే..ఊర్వశి రావే

ఇది తొలిరాత్రి..కదలని రాత్రి
నీవు నాకు..నేను నీకు..చెప్పుకున్న..కధలరాత్రీ
ప్రేయసి రావే..ఊర్వశి రావే
ప్రేయసి రావే..ఊర్వశి రావే

వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ
మల్లెలమ్మ పరదాలూ మూయమన్నదీ
వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ
మల్లెలమ్మ పరదాలూ మూయమన్నదీ

ధూపమేమో మత్తుగా తిరుగుతున్నదీ
దీపమేమో విరబడి నవ్వుతున్నదీ
నీ రాక కొరకు తలుపు..నీ పిలుపు కొరకు పానుపు
పిలిచీ పిలిచి వేచి వేచి ఎదురురు చూస్తున్నవీ

ప్రేయసి రావే..ఊర్వశి రావే
ప్రేయసి రావే..ఊర్వశి రావే

వెన్నెలంతా అడవిపాలు కానున్నదీ
మల్లెమనసు నీరుకారి వాడుతున్నదీ
ఆ..ఆ..ఆ..వెన్నెలంతా అడవిపాలు కానున్నదీ
మల్లెమనసు నీరుకారి వాడుతున్నదీ

అనురాగం గాలిలో దీపమైనదీ
మమకారం మనసునే కాల్చుతున్నదీ
నీ చివరి పిలుపు కొరకు..ఈ చావు రాని బ్రతుకూ
చూసి చూసి వేచి వేచి వేగిపోతున్నదీ

ప్రేయసి రావే..ఊర్వశి రావే
ప్రేయసి రావే..ఊర్వశి రావే

ఇది తొలిరాత్రి ..కదలని రాత్రి
నీవు నాకు..నేను నీకు..చెప్పుకున్న..కధలరాత్రీ
ప్రేయసి రావే..ఊర్వశి రావే
ప్రేయసి రావే..ఊర్వశి రావే

మాయా మశ్చేంద్ర--1975:: శ్రీరంజని ::రాగం






సంగీతం::సత్యం
రచన::C.నారాయణ రెడ్డి
గానం::SP.బాలు,P.సుశీల

రాగం::శ్రీరంజని

ప్రణయ రాగవాహిని
చెలీ..వసంతమోహిని
ప్రణయ రాగవాహిని
చెలీ..వసంతమోహిని

మదిలో ఏవో సుధలే కురిసే
మధుర మధుర యామినీ
ప్రణయ రాగజీవనా
ప్రియా..వసంతమోహినా

మలయ పవన మాలికలూ చెలియా పలికే ఏమని?
మలయ పవన మాలికలూ చెలియా పలికే ఏమని?
పొదరింట లేడు..పూవింటి వాడు
పొదరింట లేడు..పూవింటి వాడు
ఎదురుగా..వున్నాడనీ
ప్రణయ రాగవాహిని
చెలీ..వసంతమోహిని

లలిత శారద చంద్రికలు..అలలైపాడే ఏమనీ?
లలిత శారద చంద్రికలు..అలలైపాడే ఏమనీ?
పదునారు కళలా..పరువాల సిరులా
పదునారు కళలా..పరువాల సిరులా
పసిడి బొమ్మవు నీవనీ

ప్రణయ రాగవాహిని
చెలీ..వసంతమోహిని

మదిలో ఏవో సుధలే కురిసే
మధుర మధుర యామినీ

ప్రణయ రాగజీవనా
ప్రియా..వసంతమోహినా

నువ్వు నా శ్రీమతి--1979


సంగీతం::ఇళయరాజ
రచన::రాజశ్రీ
గానం::S.P.బాలు


తొలి వయసు ఈ వేళా ఊగినది ఉయ్యాల
పాడినది సందేళ--సుఖం సుఖం చిలికే నిరంతరం
తొలి వయసు ఈ వేళా ఊగినది ఉయ్యాల
పాడినది సందేళ--సుఖం సుఖం చిలికే నిరంతరం
ఇదే రాగం...ఇదేయోగం...

తరాగాలు..విలాశాలు..స్వరం పలికే ఈడూ..
వరం అదియే నేడూ..ఉరకలేసే..సొగసు..చిందులేసే మనసు
పలకరించే...ప్రేమబంధం... !! తొలివయసు ఈ వేళా !!

కనులు కలిసే..కలలు విరిసే..మనోరధమే..తెలిసే..
మరో జగమే..వెలిసే..తలుపులేవో..సురిసే..తపనలేవో..ఎగిసే
చిలిపివలపే..చిగురులేసే.. !! తొలివయసు ఈ వేళా !!

ప్రతీదినమూ..ప్రతీక్షణము..ఇలా నీవూ..నేనూ..
కలిసివుంటే చాలు..కలలు పండాలంట..కరిగిపోవాలంట
నేను నీలో..నీవు నాలో..ఓ..

తొలి వయసు ఈ వేళా ఊగినది ఉయ్యాల
పాడినది సందేళ--సుఖం సుఖం చిలికే నిరంతరం
ఇదే రాగం...ఇదేయోగం...