Friday, October 30, 2009

తాసిల్దారు గారి అమ్మాయి--1971
























సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::P. సుశీల

పల్లవి::

పాడమన్నావు..పాడుతున్నాను
పాడమన్నావు..పాడుతున్నాను 
నా మనసుకు తెలిసిందొకటే పాట పాడుతున్నాను
పాడమన్నావు..పాడుతున్నాను

చరణం::1

మనసును మార్చి పాడలేక
నామాటలే పాటగ మార్చాను
మనసును మార్చి పాడలేక
నామాటలే పాటగ మార్చాను
మాటల తోటి కదలని..మనసు
మాటల తోటి కదలని..మనసు
పాటకు కదలి..పలికేనేమో..ఓఓ
ఏమో పాడమన్నావు పాడుతున్నాను 
నా మనసుకు తెలిసిందొకటే పాట పాడుతున్నాను

చరణం::2

చినుకులకు చిగురించును మోడు
పదునైతే మొలకెత్తును బీడు
చినుకులకు చిగురించును మోడు
పదునైతే మొలకెత్తును బీడు
నువ్వేమో పదును అదును తెలియదన్నావు 
నువ్వేమో పదును అదును తెలియదన్నావు
నేనేమొ పరుల సొమ్ము కాలేకున్నాను
పాడమన్నావు..పాడుతున్నాను
నా మనసుకు తెలిసిందొకటే పాట..పాడుతున్నాను

చరణం::3

పాతపాటే పాడుతున్నానా లేత వలపే నీదన్నా 
పాతపాటే పాడుతున్నానా లేత వలపే నీదన్నా
మూసిన తలుపు యికనైనా మూసిన తలుపు యికనైనా 
తీసిచూడు నేనున్నానేమో ఏమో..పాడమన్నావు పాడుతున్నాను
నా మనసుకు తెలిసిందొకటే పాట..పాడుతున్నాను

తాసిల్దారు గారి అమ్మాయి--1971




























సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::శోభన్‌బాబు, జమున, చంద్రకళ, రాజబాబు,నాగభూషణం, రావికొండలరావు 

పల్లవి::

నీకున్నది నేననీ..నాకున్నది నీవనీ 
మనమింక కోరేది..వేరేదీ లేదనీ
కలిసిపోయాము..యీనాడు  
కలసి వుంటాము..ఏనాడు

నీకున్నది నేననీ..నాకున్నది నీవనీ 
మనమింక కోరేది..వేరేదీ లేదనీ
కలిసిపోయాము..యీనాడు  
ఆ..కలసి వుంటాము..ఏనాడు 

చరణం::1

కొండల నంటి..కోనలు వున్నాయి
ఆ..ఆ..కోనల కండగ..కొండలు వున్నాయి
ఎండ వానలు..ఎన్నో చూచాయి 
అహహ..
ఇలాగే నిన్నూ నన్నూ..వుండమన్నాయి..ఆఆఆఅ  
కలిసిపోయాము యీనాడు..కలసి వుంటాము ఏనాడు 

చరణం::2

ఎన్నెన్ని వసంతాల..సొగసు తెచ్చినావో 
ఎన్నెన్ని సెలయేళ్ళ..చలువై వెలిసావో
ఎన్నిసార్లు నీ యెదలో..నన్ను దాచినావో 
ఎన్ని జన్మలను బంధం..మోసుకొచ్చినావో
కలిసిపోయాము యీనాడు..కలసి వుంటాము ఏనాడు

చరణం::3

మనసే మనకు తెలిసిన కోవెలగా..ఆఆఆ 
మమతే మనము కొలిచే దైవముగా..ఆఆఆ
జీవితమే ఒక దీపారాధనగా..ఆహాహాహ 
చెలిమే నువ్వూ నేనూ..కోరే వరముగా..ఆఆఆ  
కలిసిపోయాము యీనాడు..కలసి వుంటాము ఏనాడు 
నీకున్నది నేననీ..నాకున్నది నీవనీ 
మనమింక కోరేది..వేరేదీ లేదనీ
కలిసిపోయాము యీనాడు..కలసి వుంటాము ఏనాడు
ఆహాహాహా..ఆహాహాహా..ఆహాహాహా..ఆహాహాహా 

తాసిల్దారు గారి అమ్మాయి--1971



















సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::మోహనరాజు
తారాగణం::శోభన్‌బాబు, జమున, చంద్రకళ, రాజబాబు,నాగభూషణం, రావికొండలరావు 

పల్లవి::

కనబడని చెయ్యేదో..నడుపుతోంది నాటకం  
ఆ నాటకాన..నువ్వూ నేను 
ఆటబొమ్మలం..కీలుబొమ్మలం
కనబడని చెయ్యేదో..నడుపుతోంది నాటకం 
ఆ నాటకాన..నువ్వూ నేను 
ఆటబొమ్మలం..మ్మ్..కీలుబొమ్మలం

చరణం::1

నాదీ నావాళ్ళనే..తాళ్ళతో కడుతుంది 
నాదీ నావాళ్ళనే..తాళ్ళతో కడుతుంది
ఆ తాళ్ళు లాగి నీ చేత..తైతక్కలు ఆడిస్తుంది
కనబడని చెయ్యేదో..నడుపుతోంది నాటకం 
ఆ నాటకాన..నువ్వూ నేను 
ఆటబొమ్మలం..మ్మ్..కీలుబొమ్మలం

కనబడని చెయ్యేదో..నడుపుతోంది నాటకం  
ఆ నాటకాన..నువ్వూ నేను 
ఆటబొమ్మలం..మ్మ్..కీలుబొమ్మలం

కనబడని చెయ్యికాదు..నడిపేది నాటకం 
కనబడుతూ నువ్వూ నేనే..ఆడుతాము బూటకం
కనబడని చెయ్యికాదు..నడిపేది నాటకం 
కనబడుతూ నువ్వూ నేనే..ఆడుతాము బూటకం

చరణం::2

తలచింది జరిగిందంటే..నీ తెలివేనంటావు 
బెడిసిందా తలరాతంటూ..విధిపై నెడతావు
తలచింది జరిగిందంటే..నీ తెలివేనంటావు 
బెడిసిందా తలరాతంటూ..విధిపై నెడతావు
మనము మనవాళ్ళని..మాటల్లో అంటావు 
నేనూ నేనన్న అహంతో..తెంచుకోని పోతావు
కనబడని చెయ్యికాదు..నడిపేది నాటకం 
కనబడుతూ నువ్వూ నేనే..ఆడుతాము బూటకం

చరణం::3

కర్మను నమ్మినవాళ్ళెవరూ..కలిమిని 
స్థిరమనుకోరు..కళ్ళుమూసుకోరు
మనసు తెలిసిన..వాళ్ళెవరూ 
మమత చంపుకోరు..మనిషినొదులుకోరు
ఉన్నదాని..విలువెరుగనివాళ్ళు 
పోగొట్టుకొని....విలపిస్తారు
కనబడని చెయ్యికాదు..నడిపేది నాటకం 
కనబడుతూ నువ్వూ నేనే..ఆడుతాము బూటకం

చరణం::4

మనిషిలాగ జీవించేది..నీ చేతల్లోనే వుంది 
మంచీ చెడు ఏదయిన ..నీ చేతుల్లోనే వుంది
మనిషిలాగ జీవించేది..నీ చేతల్లోనే వుంది 
మంచీ చెడు ఏదయిన..నీ చేతుల్లోనే వుంది

కావాలని నిప్పు తాకితే..చేయి కాలక మానదు
కాలినందుకు కర్మ అంటే..గాయమేమో మానదు
కనబడని చెయ్యికాదు..నడిపేది నాటకం 
కనబడుతూ నువ్వూ నేనే..ఆడుతాము బూటకం

తాసిల్దారు గారి అమ్మాయి--1971

























సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల

పల్లవి::

జాజిరి జాజిరి జాజిరి బావా..గాజుల గలగల వింటావా
గలగలలాడే గాజుల మోజులు..ఈ రోజైనా తెలుసుకుంటావా 
జాజిరి జాజిరి జాజిరి బావా..గాజుల గలగల వింటావా
గలగలలాడే గాజుల మోజులు..ఈ రోజైనా తెలుసుకుంటావా 
హోయ్..జాజిరి జాజిరి జాజిరి బావా..గాజుల గలగల వింటావా

చరణం::1

నిగనిగలాడే నీలికళ్ళలో..నీడెవ్వరిదో చూస్తావా
గుబగుబలాడే గుండెలోపల..గుబులెవ్వరిపై చెపుతావా
నిగనిగలాడే నీలికళ్ళలో..నీడెవ్వరిదో చూస్తావా
గుబగుబలాడే గుండెలోపల..గుబులెవ్వరిపై చెపుతావా
రేపని మాపని ఆశలు పెడతావా..రేపని మాపని ఆశలు పెడతావా 
నీదేనని ఒప్పుకుంటావా..నేనంతటి వాడిని కానంటావా 

జాజిరి జాజిరి జాజిరి బావా..గాజుల గలగల వింటావా
గలగలలాడే గాజుల మోజులు ఈ రోజైనా తెలుసుకుంటావా 
హోయ్..జాజిరి జాజిరి జాజిరి బావా గాజుల గలగల వింటావా..ఆ

చరణం::2

నిలవక ఎగిరే  పైటకొంగును..నీతో ముడేసుకుంటావా
పరుగులు తీసే పడుచును నీతో..అడుగులేడు నడిపిస్తావా
నిలవక ఎగిరే  పైటకొంగును నీతో..ముడేసుకుంటావా
పరుగులు తీసే పడుచును నీతో..అడుగులేడు నడిపిస్తావా
కంచము మంచము ఒక్కటి చేస్తావా..కంచము మంచము ఒక్కటి చేస్తావా
నా వాడిగ వుండిపోతావా..నీ కంతటి రాత లేదంటావా 

జాజిరి జాజిరి జాజిరి బావా..గాజుల గలగల వింటావా
గలగలలాడే గాజుల మోజులు..ఈ రోజైనా తెలుసుకుంటావా 
హోయ్..జాజిరి జాజిరి జాజిరి బావా..గాజుల గలగల వింటావా..ఆ

తాసిల్దారు గారి అమ్మాయి--1971

























సంగీతం::K.V .మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల

పల్లవి::

చకచకలాడే..నడుముచూడు
నడుమును వూపే..నడకచూడు
నడకను చూస్తూ వెనకబడే
యీ పడుచువానిలో పొగరూ చూడు
కోల కన్నుల..కుర్రదానా
నీ కోపంలోనే..కోరికవుంది
కోరిక దాచిన..కుర్రవాడా
నీ కొంటెదనంలో..గమ్మత్తు వుంది
కోల కన్నుల..కుర్రదానా
నీ కోపంలోనే..కోరికవుంది
కోరిక దాచిన..కుర్రవాడా
నీ కొంటెదనంలో..గమ్మత్తు వుంది

చరణం::1

కరినాగంటి..జడచూడు
అది కాటేస్తేనే..మగవాడు
సుడిగాలంటి..మగవాడు
నన్ను చుట్టెయ్యాలి..ఒకనాడు
కరినాగంటి..జడచూడు
అది కాటేస్తేనే..మగవాడు
సుడిగాలంటి..మగవాడు
నన్ను చుట్టెయ్యాలి..ఒకనాడు
అది నిజమవుతుందన్నాను 
నీ గడుసుతనాన్ని..మెచ్చాను 
కోలకన్నుల కుర్రదానా
నీ కోపంలోనే..కోరికవుంది..ఆహా
కోరికదాచిన..కుర్రవాడా
నీ కొంటెదనంలో..గమ్మత్తు వుంది

చరణం::2

చెప్పలేక ఎన్నాళ్ళో..దాచుకున్నాను
నువ్వొప్పుకోవని కొన్నాళ్ళు..ఊరుకున్నాను
చెప్పలేక ఎన్నాళ్ళో..దాచుకున్నాను
నువ్వొప్పుకోవని కొన్నాళ్ళు..ఊరుకున్నాను
చెప్పలేనివి చెప్పేటందుకె..కన్నులున్నాయి 
చెప్పలేనివి చెప్పేటందుకె..కన్నులున్నాయి
అవి ఒప్పుకుంటె మనసులు..రెండూ ఒకటవుతాయి 
అవి ఒప్పుకుంటె మనసులు..రెండూ ఒకటవుతాయి

అహహా..అహహా..ఓహో ఓఓఓ..ఓహో ఓఓఓ 
అహహా..అహహా..ఓహో ఓఓఓ..ఓహో ఓఓఓ 

కోలకన్నుల..కుర్రదానా 
నీ కోపంలోనే..కోరికవుంది
కోరిక దాచిన..కుర్రవాడా 
నీ కొంటెదనంలో..గమ్మత్తు వుంది

చరణం::3

పిల్లను చూచిన..అబ్బాయి
నీ పెళ్ళికి నేనూ..వస్తాను 
పెళ్ళికి వచ్చే..అమ్మాయి
నా పక్కన పీటే..యిస్తాను
పిల్లను చూచిన..అబ్బాయి
నీ పెళ్ళికి నేనూ..వస్తాను
పెళ్ళికి వచ్చే..అమ్మాయి
నా పక్కన పీటే..యిస్తాను 
నా మనసున..పీటను వేశాను 
నీ మమతకు..తాళికట్టాను

కోలకన్నుల..కుర్రదానా
నీ కోపంలోనే..కోరికవుంది
చకచకలాడే..నడుముచూడు
నడుమును వూపే..నడకచూడు
నడకను చూస్తూ..వెనకబడే
యీ పడుచువానిలో..పొగరూ చూడు
కోల కన్నుల..కుర్రదానా
నీ కోపంలోనే..కోరికవుంది
కోరిక దాచిన..కుర్రవాడా
నీ కొంటెదనంలో..గమ్మత్తు వుంది

Thursday, October 29, 2009

తాసిల్దారు గారి అమ్మాయి--1971
























సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::J.V.రాఘవులు,P.సుశీల
తారాగణం::శోభన్‌బాబు, జమున, చంద్రకళ, రాజబాబు,నాగభూషణం, రావికొండలరావు 

పల్లవి::

అల్లరి చేసే..వయసుండాలి
ఆశలు రేపే..మనసుండాలి 
అల్లరి చేసే..వయసుండాలి
ఆశలు రేపే..మనసుండాలి
ఏదీ లేని బావా నీతో..ఏం చెయ్యాలి
నేనేం చెయ్యాలి..నేనేం చెయ్యాలి 
అల్లరి చేసే..వయసుండాలి
ఆశలు రేపే..మనసుండాలి
ఏదీ లేని బావా నీతో..ఏం చెయ్యాలి
నేనేం చెయ్యాలి? 

చరణం::1

పిల్లగాలి వీస్తుంటె పైట యెగిరి పడుతుంటె 
పచ్చికొబ్బరంటిపిల్ల పైన పైన పడుతుంటె
పిల్లగాలి వీస్తుంటె పైట యెగిరి పడుతుంటె 
పచ్చికొబ్బరంటిపిల్ల పైనపైన పడుతుంటె
పలక్కుంటె ఉలక్కుంటె..ఏం చెయ్యాలి
పనికిరాడని ఒదిలెయ్యాలీ..పనికొచ్చే దెప్పుడనో..ఆ!
అల్లరి చేసే..వయసుండాలి
ఆశలు రేపే..మనసుండాలి
ఏదీ లేని బావా నీతో..ఏం చెయ్యాలి
నేనేం చెయ్యాలి? 

చరణం::2

పట్టెమంచం వేసుకున్నాపట్టుపరుపు పరుచుకున్న
కనులకింత కునుకురాక మనసుకసలుకుదురులేక
పట్టెమంచం వేసుకున్నాపట్టుపరుపు పరుచుకున్న
కనులకింత కునుకురాక మనసుకసలుకుదురులేక
రాతిరంత గడుస్తుంటె..ఏం చెయ్యాలి
పగలంతా పనిచెయ్యాలి..అదేమిటో నువ్వే చెప్పాలి..ఆ ఆ 
ఆఆఆ..అల్లరి చేసే వయసుండాలి
ఆశలు రేపే..మనసుండాలి 
ఏదీ లేని బావా నీతో..ఏం చెయ్యాలి 
నేనేం చెయ్యాలి? 

చరణం::3

మంచి చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని 
అద్దంలో చూచుకుంటె ఇంత అందమెందుకని
మంచి చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని 
అద్దంలో చూచుకుంటె ఇంత అందమెందుకని
గుండెనిండా గుబులైతె..ఏంచెయ్యాలి
పెద్దవాళ్ళతో చెప్పి..పెళ్ళిచెయ్యాలి
అయ్యో..ఈమొద్దు స్వరూపానికి ఎలాచెప్పాలి 
అల్లరి చేసే..వయసుండాలి
ఆశలు రేపే..మనసుండాలి 
ఏదీ లేని బావా నీతో..ఏం చెయ్యాలి
నేనేం చెయ్యాలి..నేనేం చెయ్యాలి?  

రాముడు కాదు కృష్ణుడు--1983


















సంగీతం::చక్రవర్తి
రచన::దాసరి నారాయణ రావ్
గానం::P.సుశీల, S.P.బాలు

పల్లవి::

ఒక లైలా కోసం..తిరిగాను దేశం
ఒక లైలా కోసం..తిరిగాను దేశం
ప్రతి రోజూ ప్రతి రాత్రీ..ప్రతి పాటా ఆమె కోసం
లైలా..ఆ..లైలా..ఆ..లైలా..ఆ

ఒక మజ్ఞూ కోసం..వెతికాను లోకం
ఒక మజ్ఞూ కోసం..వెతికాను లోకం
ప్రతి పగలూ ప్రతి రాత్రీ..ప్రతి తలపూ అతని కోసం
మజ్ఞూ..ఊ..మజ్ఞూ..ఊ..మజ్ఞూ..ఊ
ఒక లైలా కోసం తిరిగాను దేశం

చరణం::1

ఆకాశానికి నిచ్చెన..వేసీ
చుక్కల..పట్టుకొనడిగానూ
లైలా ఏదనీ..నా లైలా ఏదనీ
స్వర్గానికి నే దారులు..వెతికీ
ఇంద్రుని..పట్టుకొనడిగానూ
లైలా ఏదనీ..నా లైలా ఏదనీ

దిక్కుల నడుమా..నేనుంటే 
చుక్కల..పట్టుకొనడిగావూ
కన్నుల ముందూ..నేనుంటే 
కన్నులు మూసుకు..వెదికావూ
ప్రతి చూపూ..ప్రతి పిలుపూ
ప్రతి చోటా..నీకోసం

ఒక మజ్ఞూ కోసం..వెతికాను లోకం
ప్రతి పగలూ ప్రతి రాత్రీ..ప్రతి తలపూ అతని కోసం

లైలా..ఆ..లైలా..ఆ..లైలా..ఆ
ఒక లైలా కోసం..తిరిగాను దేశం

చరణం::2

పగలూ రేయీ..పందెం వేసీ
సృష్టిని పట్టుకు..బ్రతిమాలాయి
మజ్ఞూ ఏడనీ..నా మజ్ఞూ ఏడనీ
రంభా ఊర్వశి..ధైర్యం చేసీ
స్వర్గం విడిచీ..వచ్చారూ
లైలా నేననీ హహహ..ఆ లైలా నేననీ

ఇల్లూ వాకిలి..వదిలొస్తే
రంభా ఊర్వశి..అంటావూ
నీకోసం..నే పుట్టొస్తే 
ఎవ్వరి వెంటో..పడతావూ
ప్రతి రాత్రీ ప్రతి పగలూ ..ప్రతి తలపూ నీ కోసం
ఒక మజ్ఞూ కోసం..వెతికాను లోకం
ప్రతి పగలూ ప్రతి రాత్రీ..ప్రతి తలపూ అతని కోసం
మజ్ఞూ..ఊ..మజ్ఞూ..ఊ..మజ్ఞూ..ఊఊ

ఒక లైలా కోసం..తిరిగాను దేశం
ప్రతి రోజూ ప్రతి రాత్రీ..ప్రతి పాటా ఆమె కోసం
లైలా..ఆ..లైలా..ఆ..లైలా..ఆ

Monday, October 05, 2009

సంసారం--1975







సంగీతం::T.చలపతి
రచన::డా.సినారె
గానం::S.జానకి,M.రమేష్


ఒంటరిగా ఉన్నామూ..మనమిద్దరమే..వున్నామూ
ఉలకవెందుకు..పలకవెందుకు..
బిడియమెందుకు వలపు విందుకు..
కలసి పోదాము రారా..

ఒంటరిగా ..హ్హా..హ్హా..ఉన్నామూ
మనమిద్దరమే..హ్హే..హ్హే..వున్నామూ..

ఎవరికంటపడినా..ఏమనుకొంటారూ..
పడుచువాళ్ళ సరదా..పోనీ అంటారూ..2
ఏదో గుబులు..ఎందుకు దిగులు..2
ఎగిరిపోదాము రారా..

ఒంటరిగా ..హ్హా..హ్హా..ఉన్నామూ
మనమిద్దరమే..హ్హే..హ్హే..వున్నామూ..

గువ్వజంట ఏదో..గుసగుసలాడిందీ
వలపు ఓ న మాలూ..దిద్దుకోమన్నదీ..2
ఇపుడేవద్దు..ఒకటేముద్దు..2
రేపుచూద్దాము రా..రా..

ఒంటరిగా ..హ్హా..హ్హా..ఉన్నామూ
మనమిద్దరమే..హ్హే..హ్హే..వున్నామూ..

ఇంతమంచి సమయం..ఎపుడు దొరుకుతుందీ
మూడుముళ్ళుపడనీ..ప్రతిరోజు దొరుకుతుందీ..2
అప్పటి వరకు అల్లరివయసు..2
ఆగనంటుంది రా..రా..

ఒంటరిగా ..హ్హా..హ్హా..ఉన్నామూ
మనమిద్దరమే..హ్హే..హ్హే..వున్నామూ..
ఉలకవెందుకు..పలకవెందుకు..
బిడియమెందుకు వలపు విందుకు..
కలసి పోదాము రారా..

ఒంటరిగా ..హ్హా..హ్హా..ఉన్నామూ
మనమిద్దరమే..హ్హే..హ్హే..వున్నామూ..

సింధూర పువ్వు--1988::శివరంజని::రాగం

పాట ఇక్కడ వినండి


సంగీతం::మనోజ్ గాయన్
రచన:: ?
గానం::SP.బాలు,KS.చిత్ర


శివరంజని::రాగం 


సింధూరపువ్వ తేనె చింధించరావా
చిన్నారి గాలి సిరులే అందించరావా
కలలే విరిసేనే కథలే పాడెనే
ఒక నదివోలే ఆనదం ఎద పొంగెనే...

ఓ..సింధూరపువ్వ తేనె చింధించరావా
చిన్నారి గాలి సిరులే అందించరావా

ఓ..ఓ..ఓ.ఓ..మ్మ్..మ్మ్..ఓ..
కమ్మని ఊహలు కలలకు అందం..
వీడని బంధం కాదా..
గారాల వెన్నెలకాచే..సరాగాల తేలీ..2
అందాలు సందడి చేసే..రాగాలనేలీ..

సింధూరపువ్వ తేనె చింధించరావా
చిన్నారి గాలి సిరులే అందించరావా

మాటలచాటున నాదం నువ్వే..తియ్యని పాట నేనే
మధుమాస ఉల్లాసాలే పలికించేనే
మురిపాలు చిందే హౄదయం..కోరేను నిన్నే

సింధూరపువ్వ తేనె చింధించరావా
చిన్నారి గాలి సిరులే అందించరావా

అలలైపొంగే ఆశలుకోటి ఊయలఊగే వేళా
నా చెంత తోడై నీడై వెలిసావు నీవే2
రాగాలు ఆలపించీ..పిలిచావు నన్నే

సింధూరపువ్వ తేనె చింధించరావా
చిన్నారి గాలి సిరులే అందించరావా