Thursday, June 07, 2012

బావా మరదళ్ళు--1961::ఆభేరి::రాగం



సంగీతం::పెండ్యాల నాగేశ్వర రావు
రచన::ఆరుద్ర
గానం::S. జానకి

అభేరి :: రాగం 

( భీం పలాశ్రీ )


ఆ ఆ ఆ


నీలి మేఘాలలో గాలి కెరటాలలో
నీవు పాడే పాట వినిపించునీ వేళ

నీలి మేఘాలలో

ఏ పూర్వపుణ్యమో నీ పొందుగామారి
ఏ పూర్వపుణ్యమో నీ పొందుగామారి
అపురూపమై నిలిచే నా అంతరంగాన

నీలి మేఘాలలో

నీ చెలిమిలో నున్న నెత్తావి మాధురులు
నీ చెలిమిలో నున్న నెత్తావి మాధురులు
నా హృదయ భారమునే మరిపింపజేయూ

నీలి

అందుకోజాలని ఆనందమే నీవు
అందుకోజాలని ఆనందమే నీవు
ఎందుకో చేరువై దూరమౌతావు

నీలి మేఘాలలో

ఇరుగు పొరుగు--1963




సంగీతం::మాష్టర్‌వేణు
రచన::కోసరాజు
గానం::P.B.శ్రీనివాస్,S.జానకి

పొరుగింటి పుల్లయ్యకోసం..మ్మ్
ఈ రోజున వేసితి వేషం..
వారెవా జోరుహై..వారెవా జోరుహై..

పొగింటి అమ్మలు ఇంతేలే..మ్మ్
పంతాలకు కవ్వింతురులే..మ్మ్హూ
అనగూడదే మనకెందుకు..
మాటంటే చిటపట మందురులే
వారెవా జోరుహై..వారెవా జోరుహై..
వారెవా జోరుహై...

మగవారి ప్రతాపము తెలుసు..ఆఆ
నా ఆడవారనా అలుసు..ఓహో
తమ బడాయి చూపింతురులే..
వారెవా జోరుహై..వారెవా జోరుహై..
వారెవా జోరుహై...

ఎంతైనా మేము మగాళ్ళం..మ్మ్..మ్మ్
మా మూతిన ఉన్నది మీసం..అబ్బో
జగమిటులై..యుగమటులై అహా
చెల్లునులే..మా అధికారం..
వారెవా జోరుహై..వారెవా జోరుహై..
వారెవా జోరుహై...

అబ్బో ఉన్నది హైటు..అబ్బబ్బో..మించిన వైటు
అ.హహహా..అహా పరసనాలిటి ఫేసులో బ్యూటి
పొగుడుకొండి ఇక టి టి టీ..
వారెవా జోరుహై..వారెవా జోరుహై..
వారెవా పుల్లయ్యో..ఓహో..వారెవా గల్లమ్మా..