Monday, December 08, 2008

దేవుడు చేసిన పెళ్ళి--1975



సంగీతం::T.చలపతిరావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల,V.రామకృష్ణ
తారాగణం::శోభన్‌బాబు,శారద,లక్ష్మి,నాగభూషణం,చంద్రమోహన్,గిరిబాబు,రావుగోపాలరావు 

పల్లవి::

పాఠాలు నేర్పేటి పంతులమ్మా
ప్రేమ పాఠాలు చెబుతావా చిలకమ్మా        
పాఠాలు నేర్పేటి పంతులమ్మా
ప్రేమ పాఠాలు చెబుతావా చిలకమ్మా        
ఓ లేఖలు అందించే చినవాడా
ప్రేమ లేఖలు రాశావా ఎపుడైనా
ఓ లేఖలు అందించే చినవాడా
ప్రేమ లేఖలు రాశావా ఎపుడైనా

చరణం::1

రోజూ ఒక లేఖ రాస్తున్నాను
అందించాలని అనుకున్నాను
రోజూ ఒక లేఖ రాస్తున్నాను
అందించాలని అనుకున్నాను
తీరా నిను చూసీ తీయని గుబులేసీ
తీరా నిను చూసీ తీయని గుబులేసీ
తెచ్చిన లేఖల మాటే మరిచాను
ఆ మాటే..ఏఏఏ..మరిచాను
పాఠాలు నేర్పేటి పంతులమ్మా
ప్రేమ పాఠాలు చెబుతావా చిలకమ్మా        

చరణం::2

ఇన్నాళ్ళు నేర్పాను పిల్లల పాఠాలు
ఇక నేర్చుకోవాలి ప్రేమ గీతాలు
ఇన్నాళ్ళు నేర్పాను పిల్లల పాఠాలు
ఇక నేర్చుకోవాలి ప్రేమ గీతాలు
నీలో పలికే గీతాలన్నీ
నీలో పలికే గీతాలన్నీ 
నను మరపించే నాగస్వరాలు
అవే ఈ జన్మకు వరాలు
పాఠాలు నేర్పేటి పంతులమ్మా
ప్రేమ పాఠాలు చెబుతావా చిలకమ్మా        
ఓ లేఖలు అందించే చినవాడా
ప్రేమ లేఖలు రాశావా ఎపుడైనా

చరణం::3

వలచిన మనసే పాఠాలు చెబితే
పిలచిన కనులే లేఖలు రాస్తే
వలపే పులకించి - కలలే ఫలియి౦చి
వలపే పులకించి - కలలే ఫలియి౦చి
మన బ్రతుకే ఒక ఉయ్యాల కాదా
బంగారు ఉయ్యాల కాదా
పాఠాలు నేర్పేటి పంతులమ్మా
ప్రేమ పాఠాలు చెబుతావా చిలకమ్మా        
ఓ లేఖలు అందించే చినవాడా
ప్రేమ లేఖలు రాశావా ఎపుడైనా
పాఠాలు నేర్పేటి పంతులమ్మా
ప్రేమ పాఠాలు చెబుతావా చిలకమ్మా

దేవుడు చేసిన పెళ్ళి--1975



సంగీతం::T.చలపతిరావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::శోభన్‌బాబు,శారద,లక్ష్మి,నాగభూషణం,చంద్రమోహన్,గిరిబాబు,రావుగోపాలరావు 

పల్లవి::

ఈ వేళలో నాలో..ఎన్నెన్ని రాగాలో
ఈ వేళలో నాలో..ఎన్నెన్ని రాగాలో 
ఆ రాగాల...ఉయ్యాల జంపాలలో
ఎన్నెన్ని...కనరాని భావాలో
ఈ వేళలో నాలో..ఎన్నెన్ని రాగాలో

చరణం::1

చిరుగాలి ఈల వేసే..ఏ..చిగురాకు తొంగి చూసే
చిరుగాలి ఈల వేసే..ఏ..చిగురాకు తొంగి చూసే
కిరాణాల జడివానలోన..ఆ..కిరాణాల జడివానలోన
వరిచెలు స్నానాలు చేసే..ఏ..
ఈ వేళలో నాలో..ఎన్నెన్ని రాగాలో
ఈ వేళలో నాలో..ఎన్నెన్ని రాగాలో 

చరణం::2

పరువాల కొమ్మ ఫైనా..ఆ..పాడింది ఒక కోకిలమ్మ
ఆ పాట నా...గొంతులోన
ఆ పాట నా గొంతులోన..పలికించె నవరాగమాల..ఆ
ఈ వేళలో నాలో..ఎన్నెన్ని రాగాలో
ఈ వేళలో నాలో..ఎన్నెన్ని రాగాలో 

చరణం::3

మేఘాల పరదాలలోనా..ఆఆ 
మేఘాల పరదాలలోన..మెరుపల్లె ఒకరోజు తోచె
ఆ రాజు చిరునవ్వులోనా..ఆ..నా మేను నాట్యాలు చేసే 
ఈ వేళలో నాలో..ఓ..ఎన్నెన్ని రాగాలో
ఈ వేళలో నాలో..ఓ..ఎన్నెన్ని రాగాలో 

దేవుడు చేసిన పెళ్ళి--1975


















సంగీతం::T.చలపతిరావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::శరావతి
తారాగణం::శోభన్‌బాబు,శారద,లక్ష్మి,నాగభూషణం,చంద్రమోహన్,గిరిబాబు,రావుగోపాలరావు

పల్లవి::

అమ్మ పాడలేదు..నేను చూడలేను
నా గొంతుతో..అమ్మ పాట పాడనా 
అమ్మ కళ్ళతో..నిన్ను నేను చూడనా
అమ్మ పాడ..లేదు నేను చూడలేను

చరణం::1

నీ కళ్ళలో మెరిసే..కన్నీళ్ళనే
అమ్మ...చూడలేదురా 
నీ కళ్ళలో మెరిసే..కన్నీళ్ళనే
అమ్మ...చూడలేదురా 
బోసినవ్వుల..ఒలక బోసి
ఇంటినిండా..వెలుగు నింపీ
ఆడాలిరా..నాతో..పాడాలిరా
అమ్మ పాడ లేదు..నేను చూడలేను

చరణం::2

ప్రతి అమ్మనోట పలికే..ప్రతిమాట ఒక జోల పాటరా
ప్రతి అమ్మనోట పలికే..ప్రతిమాట ఒక జోల పాటరా
మీ అమ్మ లోని..మూగభావన అన్నివేళల నీకు
దీవెన కావాలిరా..బాబూ కావాలిరా
అమ్మ పాడ లేదు..నేను చూడలేను

చరణం::3

అమ్మా అని నీవు..నోరారగా అమ్మను పిలవాలిరా
అమ్మా అని నీవు..నోరారగా అమ్మను పిలవాలిరా
అమ్మ మనసే పొంగిపోయి..యెత్తుకొని నిను ముద్దులాడీ
మురిసేనురా..మేను మరచేనురా    
అమ్మ పాడలేదు...నేను చూడలేను
నా గొంతుతో...అమ్మ పాట పాడనా 
అమ్మ కళ్ళతో...నిన్ను నేను చూడనా
అమ్మ పాడ...లేదు నేను చూడలేను