Showing posts with label Lyricist::G.Krishnamoorti. Show all posts
Showing posts with label Lyricist::G.Krishnamoorti. Show all posts

Sunday, February 07, 2016

గురువును మించిన శిష్యుడు--1963




సంగీతం::S.P.కోదండపాణి
రచన::G.కృష్ణమూర్తి
గానం::S.జానకి
Film Directed By::vithalaachaarya
తారాగణం::కాంతారావు,రాజనాల,కైకాల సత్యనారాయణ,ముక్కామల,వల్లూరి బాలకృష్ణ,కృష్ణకుమారి,రాజశ్రీ,రమాదేవి.

పల్లవి::

పూవులు పూయును..పదివేలు..ఊ
భగవానుని..మెడలో ఎదిగారు

పూవులు పూయును..పదివేలు..ఊ
భగవానుని..మెడలో ఎదిగారు

ప్రాణములున్నవి అందరికీ..ఈ
ప్రణయము తెలిసే ఎందరికీ..ఈ

పూవులు పూయును..పదివేలు..ఊ
భగవానుని..మెడలో ఎదిగారు

చరణం::1

అరుదైన వరం..మన జీవితమూ
ఆనందానికి అది..అంకితమూ

అరుదైన వరం..మన జీవితమూ
ఆనందానికి అది..అంకితమూ

అరచేతిన ఉన్నది..స్వర్గమురా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
అరచేతిన ఉన్నది..స్వర్గమురా
అది ఎరుగని వారిదే..నరకమురా..ఆ

పూవులు పూయును..పదివేలు..ఊ
భగవానుని..మెడలో ఎదిగారు

చరణం::2

చేజారినదీ..నిన్నటిదినమూ
జనియించనిదే..రేపటి దినమూ

చేజారినదీ..నిన్నటిదినమూ
జనియించనిదే..రేపటి దినమూ

అవి అందనివీ..మనకెందుకురా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
అవి అందనివీ..మనకెందుకురా
ఈ దినమే..మనదనుకొందామురా..ఆ

పూవులు పూయును..పదివేలు..ఊ
భగవానుని..మెడలో ఎదిగారు

ప్రాణములున్నవి అందరికీ..ఈ
ప్రణయము తెలిసే ఎందరికీ..ఈ

పూవులు పూయును..పదివేలు..ఊ
భగవానుని..మెడలో ఎదిగారు..ఊ


Guruvunu Minchina Sishyudu--1963
Music::S.P.Kodandapaani
Lyrics::G.Krishnamoorti
Singer's::S.Jaanaki
Film Directed By::vithalaachaarya
Cast::KaantaRao,Raajanaala,Kaikala Satyanaaraayana,Baalakrishna,
Krishnakumaari,Raajesrii,Ramaadevi.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::

poovulu pooyunu..padivElu..uu
bhagavaanuni..meDalO edigaaru

poovulu pooyunu..padivElu..uu
bhagavaanuni..meDalO edigaaru

praaNamulunnavi andarikii..ii
praNayamu telisE endarikii..ii

poovulu pooyunu..padivElu..uu
bhagavaanuni..meDalO edigaaru

::::1

arudaina varam..mana jeevitamuu
Anandaaniki adi..ankitamuu

arudaina varam..mana jeevitamuu
Anandaaniki adi..ankitamuu

arachEtina unnadi..swargamuraa
aa..aa..aa..aa..aa..aa..aa..aa
arachEtina unnadi..swargamuraa
adi erugani vaaridE..narakamuraa..aa

poovulu pooyunu..padivElu..uu
bhagavaanuni..meDalO edigaaru

::2

chEjaarinadii..ninnaTidinamuu
janiyinchanidE..rEpaTi dinamuu

chEjaarinadii..ninnaTidinamuu
janiyinchanidE..rEpaTi dinamuu

avi andanivii..manakendukuraa
aa..aa..aa..aa..aa..aa..aa..aa
avi andanivii..manakendukuraa
ii dinamE..manadanukondaamuraa..aa

poovulu pooyunu..padivElu..uu
bhagavaanuni..meDalO edigaaru

praaNamulunnavi andarikii..ii
praNayamu telisE endarikii..ii

poovulu pooyunu..padivElu..uu
bhagavaanuni..meDalO edigaaru..uu  

Wednesday, January 06, 2016

నవగ్రహ పూజామహిమ--1964



సంగీతం::రాజన్-నాగేంద్ర
రచన::G.కృష్ణమూర్తి
గానం::ఘంటసాల,బృందం
Film Directed By::B.VithalaaCharya
తారాగణం::కాంతారావు, వాసంతి, నాగయ్య,రాజనాల,గీతాంజలి, లక్ష్మి, వాణిశ్రీ

పల్లవి::

శరణు శరణు గ్రహదేవులారా శరణు
మీ మహిమలను తెలుసుకున్నాను
దాసోహమన్నాను కనులు తెరిచాను
కనులు తెరిచాను

నా మొరను మీరాలకించి
అపరాధము మన్నించి
కావరా మీ దయజూపి 

నా మొరను మీరాలకించి
అపరాధము మన్నించి
కావరా మీ దయజూపి

చరణం::1 

చేతులారా నేనే..చేసినానపచారం 
చేతులారా నేనే..చేసినానపచారం 
దోషమంతా నాదే..దోషఫలమూ నాదే
కరుణతో నను..ఆదరించిన 
నిరపరాధులకా యీ దందన 

నా మొరను..మీరాలకించి
అపరాధము..మన్నించి
కావరా మీ..దయజూపి

1::సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్  
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్  

సూర్యం ప్రణమామ్యహమ్

2::శ్వేతాశ్వ రథమారూఢం కేయూర మకుటోజ్వలమ్ 
జటాధర శిరోరత్నం తం చంద్రం ప్రణమామ్యహమ్ 

చంద్రం ప్రణమామ్యహమ్

3::ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభమ్ 
కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహమ్ 

మంగళం ప్రణమామ్యహమ్

4::ప్రియాంగుకలికా శ్యామం రూపేణా ప్రతిమం బుధమ్  
సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్  


బుధం ప్రణమామ్యహమ్

5::దేవనామ్ చ ఋషీనామ్ చ గురు కాంచన సన్నిభమ్ 
బుద్ధిభూతం త్రిలోకేశం తం గురుం ప్రణమామ్యహమ్ 


గురుం ప్రణమామ్యహమ్


6::హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుమ్ 
సర్వశాస్త్ర ప్రవక్తారం తం శుక్రం ప్రణమామ్యహమ్ 

శుక్రం ప్రణమామ్యహమ్

7::నీలాంజన సమాభాసం రవి పుత్రం యమాగ్రజమ్ 
ఛాయా మర్తాండ సంభూతం తం శనిం ప్రణమామ్యహమ్ 


శనిం ప్రణమామ్యహమ్

8::అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనమ్
సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ 

రాహుం ప్రణమామ్యహమ్

9::ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహ మస్తకమ్ 
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ 

కేతుం ప్రణమామ్యహమ్

ప్రణమామ్యహమ్, ప్రణమామ్యహమ్, ప్రణమామ్యహమ్

Saturday, February 07, 2015

గురువును మించిన శిష్యుడు--1963



 
సంగీతం::S.P.కోదండపాణి
రచన::G.కృష్ణమూర్తి
గానం::మాధవపెద్ది,స్వర్ణలత 
Film Directed By::vithalaachaarya
తారాగణం::కాంతారావు,రాజనాల,కైకాల సత్యనారాయణ,ముక్కామల,వల్లూరి బాలకృష్ణ,కృష్ణకుమారి,రాజశ్రీ,రమాదేవి.

పల్లవి::

బలె బలె బలె బలె..హిరణ్యకశపుడురా
నిన్ను ఇరచుక తింటానురా..హే..నరసింహ్మస్వామినిరా      
నిన్ను..నంచుక తింటనురా

హే..బలె బలె బలె బలె..హిరణ్యకశపుడురా
నిన్ను ఇరచుక తింటానురా..హే..నరసింహ్మస్వామినిరా      
నిన్ను..నంచుక తింటనురా..రా..రా

చరణం::1

రారా..మావా..రారా నా అందగాడ..రాతిరంత జాతరేరా
అహా..రాతిరంత జాతరేరా..ఆ

రారా నా అందగాడ..రాతిరంత జాతరేరా
అహా..రాతిరంత జాతరేరా..ఆ

మొగలిపూల పానుపేసి..నిప్పుసెగల ధుపమేసి
మొగలిపూల పానుపేసి..నిప్పుసెగల ధుపమేసి
చెట్ట పట్టలాడుకొందామ్రా..మావా

రారా నా అందగాడ..రాతిరంత జాతరేరా
అహా..రాతిరంత జాతరేరా..ఆ..రావూ..రావా

బలె బలె బలె బలె..హిరణ్యకశపుడురా
నిన్ను ఇరచుక తింటానురా..హే..నరసింహ్మస్వామినిరా      
నిన్ను..నంచుక తింటనురా..రా..రా

చరణం::2

చింత చెట్టు చిగురుచూడు..చిన్నదాన్ని సొగసుచూడు
చింత చెట్టు చిగురుచూడు..చిన్నదాన్ని సొగసుచూడు
మునగచెట్టు కొమ్మపట్టకురా..ఓ..రంగసార..
కొమ్మ ఇరిగితే..కూలబడతవురా..హ్హ..మావా
మునగచెట్టు కొమ్మపట్టకురా..ఓ..రంగసార..
కొమ్మ ఇరిగితే..కూలబడతవురా

హే..బలె బలె బలె బలె..హిరణ్యకశపుడురా
నిన్ను ఇరచుక తింటానురా..హే..నరసింహ్మస్వామినిరా      
నిన్ను..నంచుక తింటనురా..రా..రా

హే..బలె బలె బలె బలె..హిరణ్యకశపుడురా
నిన్ను ఇరచుక తింటానురా..హే..నరసింహ్మస్వామినిరా      
నిన్ను..నంచుక తింటనురా..రా..రా..బుర్ర్ర్ర్..హా


Guruvunu Minchina Sishyudu--1963
Music::S.P.Kodandapaani
Lyrics::G.Krishnamoorti
Singer's::Maadhavapeddi,Swarnalatha
Film Directed By::vithalaachaarya
Cast::KaantaRao,Raajanaala,Kaikala Satyanaaraayana,Baalakrishna,Krishnakumaari,Raajesrii,Ramaadevi.

:::::::::::::::::::::::::::::::

bale bale bale bale..hiraNyakaSapuDuraa
ninnu irachuka tinTaanuraa..hE..narasiMhmaswaaminiraa      
ninnu..nanchuka tinTanuraa

hE..bale bale bale bale..hiraNyakaSapuDuraa
ninnu irachuka tinTaanuraa..hE..narasiMhmaswaaminiraa      
ninnu..nanchuka tinTanuraa..raa..raa

::::1

raaraa..maavaa..raaraa naa andagaaDa..raatiranta jaatarEraa
ahaa..raatiranta jaatarEraa..aa

raaraa naa andagaaDa..raatiranta jaatarEraa
ahaa..raatiranta jaatarEraa..aa

mogalipoola paanupEsi..nippusegala dhupamEsi
mogalipoola paanupEsi..nippusegala dhupamEsi
cheTTa paTTalaaDukondaamraa..maavaa

raaraa naa andagaaDa..raatiranta jaatarEraa
ahaa..raatiranta jaatarEraa..aa..raavuu..raavaa

bale bale bale bale..hiraNyakaSapuDuraa
ninnu irachuka tinTaanuraa..hE..narasiMhmaswaaminiraa      
ninnu..nanchuka tinTanuraa..raa..raa

::::2

chinta cheTTu chiguruchooDu..chinnadaanni sogasuchooDu
chinta cheTTu chiguruchooDu..chinnadaanni sogasuchooDu
munagacheTTu kommapaTTakuraa..O..rangasaara..
komma irigitE..koolabaDatavuraa..hha..maavaa
munagacheTTu kommapaTTakuraa..O..rangasaara..
komma irigitE..koolabaDatavuraa

hE..bale bale bale bale..hiraNyakaSapuDuraa
ninnu irachuka tinTaanuraa..hE..narasiMhmaswaaminiraa      
ninnu..nanchuka tinTanuraa..raa..raa

hE..bale bale bale bale..hiraNyakaSapuDuraa
ninnu irachuka tinTaanuraa..hE..narasiMhmaswaaminiraa      
ninnu..nanchuka tinTanuraa..raa..raa..burrrr..haa
   

గురువును మించిన శిష్యుడు--1963




సంగీతం::S.P.కోదండపాణి
రచన::G.కృష్ణమూర్తి
గానం::S.జానకి
Film Directed By::vithalaachaarya
తారాగణం::కాంతారావు,రాజనాల,కైకాల సత్యనారాయణ,ముక్కామల,వల్లూరి బాలకృష్ణ,కృష్ణకుమారి,రాజశ్రీ,రమాదేవి.

పల్లవి::

ఓఓఓఓఓఓ..ఆఆఆఆఆఆఆఆ..ఓ ఓ ఓ ఓ ఓ 
వెల్లెల్లో కనుగీటే..తారకా
వినవే కన్నెమనసు..కరిగించే కోరికా
ఎదలోబాధా..ఆ..ప్రేమే చేదా..ఆ
ఎదలోబాధా..ఆ..ప్రేమే చేదా..ఆ
ఇది తీరే దారే లేదా..ఆఆఆ ఓ ఓఓఓఓ ఓఓ

వెల్లెల్లో కనుగీటే..తారకా
వినవే కన్నెమనసు..కరిగించే కోరికా

చరణం::1

మొగ్గవంటి చిన్నదాన్ని..మనసిచ్చానే..ఏఏ  
మొగ్గవంటి చిన్నదాన్ని..మనసిచ్చానే..ఏఏ 
సిగ్గుతో నా నోరువిప్పి..చెప్పగలేనే..ఏఏఏఏ
సొగసరి మొనగాడే..గడుసరి వాడే
సొగసరి మొనగాడే..గడుసరి వాడే
గుబులు గుండెల్లో..నింపాడే..ఏఏఏఏఏ ఓఓఓఓఓ ఓయ్

వెల్లెల్లో కనుగీటే..తారకా
వినవే కన్నెమనసు..కరిగించే కోరికా

చరణం::2

ఒక్కసారి ఓరకంట..నను చూసాడే..ఏఏఏ
చక్కిలిగింతలు..రేపి మదిదోచాడే..ఏఏఏఏ
చుక్కలరేడేని..చక్కని వాడే
చుక్కలరేడేని..చక్కని వాడే
మక్కువతో చూడ రాడే..ఏఏ..ఓఓఓఓఓ ఓయ్ 

వెల్లెల్లో కనుగీటే..తారకా
వినవే కన్నెమనసు..కరిగించే కోరికా
ఎదలోబాధా..ప్రేమే చేదా
ఎదలోబాధా...ప్రేమే చేదా
ఇది తీరే దారే లేదా..ఆఆఆ ఓ ఓఓఓఓ ఓఓ

వెల్లెల్లో కనుగీటే..తారకా
వినవే కన్నెమనసు..కరిగించే కోరికా..ఆఆఆఆ 

Guruvunu Minchina Sishyudu--1963
Music::S.P.Kodandapaani
Lyrics::G.Krishnamoorti
Singer's::S.Jaanaki
Film Directed By::vithalaachaarya
Cast::KaantaRao,Raajanaala,Kaikala Satyanaaraayana,Baalakrishna,Krishnakumaari,Raajesrii,Ramaadevi.

:::::::::::::::::::::::::::::::

OOOOOO..AAAAAAAA..O O O O O 
vellellO kanugeeTE..taarakaa
vinavE kannemanasu..kariginchE kOrikaa
edalObaadhaa..aa..prEmE chEdaa..aa
idi teerE daarE lEdaa..aaaaaaaaa O OOOO OO

vellellO kanugeeTE..taarakaa
vinavE kannemanasu..kariginchE kOrikaa

::::1

moggavanTi chinnadaanni..manasichchaanE..EE  
moggavanTi chinnadaanni..manasichchaanE..EE 
siggutO naa nOruvippi..cheppagalEnE..EEEE
sogasari monagaaDE..gaDusari vaaDE
sogasari monagaaDE..gaDusari vaaDE
gubulu gunDellO..nimpaaDE..EEEEE OOOOO Oy

vellellO kanugeeTE..taarakaa
vinavE kannemanasu..kariginchE kOrikaa

::::2

okkasaari OrakanTa..nanu choosaaDE..EEE
chakkiligintalu..rEpi madidOchaaDE..EEEE
chukkalarEDEni..chakkani vaaDE
chukkalarEDEni..chakkani vaaDE
makkuvatO chuuDa raaDE..EE..OOOOO Oy 

vellellO kanugeeTE..taarakaa
vinavE kannemanasu..kariginchE kOrikaa
edalObaadhaa..prEmE chEdaa
edalObaadhaa...prEmE chEdaa
idi teerE daarE lEdaa..aaaaaaaaa O OOOO OO

vellellO kanugeeTE..taarakaa
vinavE kannemanasu..kariginchE kOrikaa..aaaaaaaaaaaa   

గురువును మించిన శిష్యుడు--1963




సంగీతం::S.P.కోదండపాణి
రచన::G.కృష్ణమూర్తి
గానం::P.B.శ్రీనివాస్,P.సుశీల
Film Directed By::Vithalaachaarya
తారాగణం::కాంతారావు,రాజనాల,కైకాల సత్యనారాయణ,బాలకృష్ణ,కృష్ణకుమారి,
రాజశ్రీ,రమాదేవి.

::::

ఏడేడు జన్మలనుండి పడివుంది బ్రహ్మముడి 
ఏడేడు జన్మలనుండి పడివుంది బ్రహ్మముడి
మళ్ళిపడబోతుందీ..మళ్ళిపడబోతుంది
మనలనొకటిగా..చేస్తుంది
ఏడేడు జన్మలనుండి పడివుంది బ్రహ్మముడి 
ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ

::::1

ఎగిరే నను బంధించావూ..పగడాల పంజరమందు
నా గుండెల గుడిలో నిలిపీ..దేవునిగా పూజిస్తున్నా
నోరార పిలిచేవేళా..దూరాన నిలిచేవేల
గారాల చేరువకాగా..మారాము చేయుటమేలా
మాటలతోనే మరిపిస్తావె..మాటలుకావు మనసే ఇచ్చా
మాటలతోనే మరిపిస్తావె..మాటలుకావు మనసే ఇచ్చా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఏడేడు జన్మలనుండి పడివుంది బ్రహ్మముడి 
మళ్ళిపడబోతుందీ..మళ్ళిపడబోతుంది
మనలనొకటిగా..చేస్తుంది
ఏడేడు జన్మలనుండి పడివుంది బ్రహ్మముడి  
ఆ ఆ ఆ ఆ ఆ

::::2

ఏ దేవుని దీవన బలమో..ఈడేరెను మనలో వలపు 
నీ అడుగు జాడలలోనే..నా ఆశల దివ్వెల వెలుగు
నీ సిగలో మల్లెగ మారీ..ఊసులతో ఊరిస్తానూ
నీ కన్నుల కాంతిని చేరీ..మనసార అలరిస్తానూ
తీయని మనకల నిజమౌతుంది..
తప్పదు వలపే ఫలియిస్తుందీ..
తీయని మనకల నిజమౌతుంది..
తప్పదు వలపే ఫలియిస్తుందీ..
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఏడేడు జన్మలనుండి పడివుంది బ్రహ్మముడి 
ఏడేడు జన్మలనుండి పడివుంది బ్రహ్మముడి
మళ్ళిపడబోతుందీ..మళ్ళిపడబోతుంది
మనలనొకటిగా..చేస్తుంది
ఏడేడు జన్మలనుండి పడివుంది బ్రహ్మముడి 
ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ

Guruvunu Minchina Sishyudu--1963
Music::S.P.Kodandapaani
Lyrics::G.Krishnamoorti
Singer's::P.B.Sreenivaas,P.Suseela
Film Directed By::vithalaachaarya
Cast::KaantaRao,Raajanaala,Kaikala Satyanaaraayana,Baalakrishna,Krishnakumaari,Raajesrii,Ramaadevi.


::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

EDEDu janmalanunDi paDivundi brahmamuDi 
EDEDu janmalanunDi paDivundi brahmamuDi
maLLipaDabOtundii..maLLipaDabOtundi
manalanokaTigaa..chEstundi
EDEDu janmalanunDi paDivundi brahmamuDi 
AA AA AA AA AA AA AA

::::1

egirE nanu bandhinchaavuu..pagaDaala panjaramandu
naa gunDela guDilO nilipii..dEvunigaa poojistunnaa
nOraara pilichEvELaa..dooraana nilichEvEla
gaaraala chEruvakaagaa..maaraamu chEyuTamElaa
maaTalatOnE maripistaave..maaTalukaavu manasE ichchaa
maaTalatOnE maripistaave..maaTalukaavu manasE ichchaa
aa aa aa aa aa aa

EDEDu janmalanunDi paDivundi brahmamuDi 
maLLipaDabOtundii..maLLipaDabOtundi
manalanokaTigaa..chEstundi
EDEDu janmalanunDi paDivundi brahmamuDi  
aa aa aa aa aa

::::2

E dEvuni deevana balamO..iiDErenu manalO valapu 
nee aDugu jaaDalalOnE..naa ASala divvela velugu
nee sigalO mallega maarii..UsulatO Uristaanuu
nee kannula kaantini chErii..manasaara alaristaanuu
teeyani manakala nijamoutundi..
tappadu valapE phaliyistundii..
teeyani manakala nijamoutundi..
tappadu valapE phaliyistundii..
aa aa aa aa aa aa aa

EDEDu janmalanunDi paDivundi brahmamuDi 
EDEDu janmalanunDi paDivundi brahmamuDi
maLLipaDabOtundii..maLLipaDabOtundi
manalanokaTigaa..chEstundi
EDEDu janmalanunDi paDivundi brahmamuDi 
AA AA AA AA AA AA AA  

Friday, August 15, 2014

వరలక్ష్మీవ్రతం--1961


సంగీతం::రాజన్-నాగేద్ర
రచన::G.కృష్ణమూర్తి
విఠల్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం::విఠల ఆచార్య
గానం::S.జానకి.P.లీల,P.B.శ్రీనివాస్ బృందం
తారాగణం::కాంతారావు,కృష్ణకుమారి,రాజనాల,బాలకృష్ణ,సత్యనారాయణ,మీనాకుమారి

పల్లవి::

వరమహాలక్ష్మీ..కరుణించవమ్మా
వరమహాలక్ష్మీ..కరుణించవమ్మా
చరణాలే..శరనంటినమ్మా
పతిదేవు బాసితి వెతలంది రోసితి
నుతియింతు..పతి నీయవమ్మా
వరమహాలక్ష్మీ..వరమీయవమ్మా
మాం పాహి మాతా..మాం పాహి మాతా
మాం పాహి మాం పాహి మాం పాహి మాతా

చరణం::1

పాలకడలిన పుట్టి..శ్రీహరిని చేపట్టి
వైకుంఠలోకాన..లక్ష్మివైనావే
మాం పాహి మాతా..మాం పాహి మాతా
సత్య గుణ మూర్తివే..ఆ..సంపత్స్య రూపివే..ఆ
సత్వగుణమూర్తివే..ఆ..సంపత్స్య రూపివే..ఆ   
సర్వ సిద్ధివి నీవే సుమా..ఆ
నా వేదనను బాప..నీ దేవుతో గూడి
నైవేద్య మందుకోమ్మా..ఆ

మాం పాహి మాతా..మాం పాహి మాతా
మాం పాహి మాం పాహి మాం పాహి మాతా

చరణం::2 

వాగీశు రాణివై..వరవీణపాణివై
బ్రహ్మలోకమ్మున..వాణివై నావే
మాం పాహి మాతా..మాం పాహి మాతా
కల్యాణదాయిని..కళల స్వరూపిణి
ఇల సకల విద్యలకు..తల్లివీవమ్మా
వేదనను బాప..నీ దేవుతో గూడి
నైవేద్య మందుకోమ్మా..ఆ

మాం పాహి మాతా..మాం పాహి మాతా
మాం పాహి మాం పాహి మాం పాహి మాతా

చరణం::3

గిరిరాజ తనయవై..పరమేశు తరుణివై
కైలాసలోకాన..గౌరివైనావే
మాం పాహి మాతా..మాంపాహి మాతా
శక్తిస్వరూపిణి..మాం పాహి మాతా
భక్తజనపాలిని..మాం పాహి మాతా
శక్తిస్వరూపిణి..మాం పాహి మాతా
భక్తజనపాలిని..మాం పాహి మాతా
సుఖసౌఖ్య..సౌభాగ్యదాయివీవమ్మా
వేదనను బాప..నీ దేవుతో గూడి
నైవేద్య మందుకోమ్మా..ఆ

మాం పాహి మాతా..మాం పాహి మాతా
మాం పాహి మాం పాహి మాం పాహి మాత
పతినీయవమ్మా..పతినీయవమ్మా..పతినీయవమ్మా

VaralakshmiiVratam--1961 
Music::::Raajan-Naagedra
Lyrics::G.Krishnamoorti
Vithal :: Production vaari
Director::B Vitala Charya 
Singer's::S.Jaanaki.P.Leela,P.B.Sreenivaas Brundam
Cast::Kantaraavu.Krishnakumari,Rajanaala,Baalakrishna,Satyanarayana,Meenaakumaari.

:::::

varamahaalakshmii..karuNinchavammaa
varamahaalakshmii..karuNinchavammaa
charaNaalE..SarananTinammaa
patidEvu baasiti vetalandi rOsiti
nutiyintu..pati neeyavammaa
varamahaalakshmii..varameeyavammaa
maam paahi maataa..maam paahi maataa
maam paahi maam paahi maam paahi maataa

::::1

paalakaDalina puTTi..Sriiharini chEpaTTi
vaikunThalOkaana..lakshmivainaavE
maam paahi maataa..maam paahi maataa
satya guNa moortivE..aa..sampatsya roopivE..aa
satwaguNamoortivE..aa..sampatsya roopivE..aa   
sarva siddhivi neevE sumaa..aa
naa vEdananu baapa..nee dEvutO gooDi
naivEdya mandukOmmaa..aa

maam paahi maataa..maam paahi maataa
maam paahi maam paahi maam paahi maataa

::::2 

vaageeSu raaNivai..varaveeNapaaNivai
brahmalOkammuna..vaaNivai naavE
maam paahi maataa..maam paahi maataa
kalyaaNadaayini..kaLala swaroopiNi
ila sakala vidyalaku..talliviivammaa
vEdananu baapa..nee dEvutO gooDi
naivEdya mandukOmmaa..aa

maam paahi maataa..maam paahi maataa
maam paahi maam paahi maam paahi maataa

::::3

giriraaja tanayavai..paramESu taruNivai
kailaasalOkaana..gourivainaavE
maam paahi maataa..maampaahi maataa
SaktiswaroopiNi..maam paahi maataa
bhaktajanapaalini..maam paahi maataa
SaktiswaroopiNi..maam paahi maataa
bhaktajanapaalini..maam paahi maataa
sukhasoukhya..soubhaagyadaayiveevammaa
vEdananu baapa..nee dEvutO gooDi
naivEdya mandukOmmaa..aa

maam paahi maataa..maam paahi maataa
maam paahi maam paahi maam paahi maata
patineeyavammaa..patineeyavammaa..patineeyavammaa

Saturday, February 15, 2014

అగ్గిదొర--1967



సంగీతం::విజయా కృష్ణమూర్తి
రచన::G..కృష్ణమూర్తి
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::కాంతారావు,భారతి, విజయలలిత,ధూళిపాళ,సత్యనారాయణ బాలకృష్ణ

పల్లవి::

ఓ..తిరుమలేశా చాలు చాలీ సోధన
భరించలేనయ్యా మొరవిన వేమి..ఓ తిరుమలేశా

పిలిచిన పలికేవు స్వామీ
పిలిచిన పలికేవు స్వామీ..శిలగా నిలచేవేమీ..ఈ
పిలిచిన పలికేవు స్వామీ..శిలగా నిలచేవేమీ..ఈ
పిలిచిన పలికేవు స్వామీ..ఈ

చరణం::1

కాంతిని చూసే కన్నులలోనే..కన్నీరే..ఏ..నింపేవా
ఆ.....ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కాంతిని చూసే కన్నులలోనే..కన్నీరే..ఏ..నింపేవా
ఏడువ చేసి..వేడుక చూసి..వేడుక చూసేవేమీ..ఈ
ఏడువ చేసి..వేడుక చూసి..వేడుక చేసేవేమీ..ఈ

పిలిచిన పలికేవు స్వామీ..ఈ..శిలగా నిలచేవేమీ
పిలిచిన పలికేవు స్వామీ..ఈ..శిలగా నిలచేవేమీ
పిలిచిన పలికేవు స్వామీ..ఈ

చరణం::2

మనిషిని చేసి..మనసును కోసి..మలినమునే..ఏ..నింపేవా
ఆ...ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మనిషిని చేసి..మనసును కోసి..మలినమునే..ఏ..నింపేవా
పువ్వులలోనా..వాసన తోనే..పురుగుల నింపేవేమీ..ఈ
పువ్వులలోనా..వాసన తోనే..పురుగులనింపేవేమీ..ఈ

పిలిచిన పలికేవు స్వామీ..ఈ..శిలగా నిలచేవేమీ
పిలిచిన పలికేవు స్వామీ..ఈ

Sunday, December 15, 2013

కనక దుర్గ పూజా మహిమ--1960



సంగీతం::రాజన్-నాగేంద్ర
రచన::G.కృష్ణమూర్తి
గానం::P.B.శ్రీనివాస్, జిక్కి
తారాగణం::కాంతారావు, కృష్ణకుమారి, ఆదోని లక్ష్మి, మిక్కిలినేని 

పల్లవి::

అనురాగ సీమ..మనమేలుదామా
ఆనందాల..చవిచూదమా
మేఘాల తేలాడి ఓలాడుదామా
మెరిసే ధరణీ..మనదే సుమా

అనురాగ సీమ..మనమేలుదామా
ఆనందాల..చవిచూదమా
ఓ హొహొహో..అహహ..అహహ..అహహా

చరణం::1

ఎగిరేటి ఎలసేటి గీతాలు మ్రోగే
చిగురాకు పూబాలలూగే
ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఎగవోలె చిరుగాలి పారాడి సాగే
కెరటాలు కోనేట తూగే

ఓ..మధురానుభవమే ఈ జగానా
మధుమాసమై నేడు శోభించెనా
ఇలనిండె వలపు ఈ దినానా
కలలన్ని కనులార కాంతుమా

అనురాగ సీమ..మనమేలుదామా
ఆనందాల చవి చూదమా

చరణం::2

నెలరాజు నేడేల కనరాక మానే
నీ మోము తిలకించి తలదించెనే
ఓ..ఆ..ఆ..ఆ..ఆ
పలికేటి చిలుకేల తన పాట మానే
కలకంఠి నీ కంఠమాలించెనే

కులికింది కళలా ఈ లోకమెల్లా
పులకించె నిలువెల్ల గిలిగింతలా
మనలోని ప్రేమా..ఎనలేని ప్రేమా
మనసార తనిదీర సేవింతుమా

అనురాగ సీమ..మనమేలుదామా
ఆనందాల..చవి చూదమా
మేఘాల తేలాడి ఓలాడుదామా
మెరిసే ధరణీ మనదే సుమా

అనురాగ సీమ మనమేలుదామా
ఆనందాల చవి చూదమా
అహా హా హా..ఆ ఆ ఆఅహా..
ఓహో ఓ హో హో హొ హో..మ్మ్ మ్మ్ మ్మ్..

Kanaka Durga Poojaa Mahima--1960
Music::Raajan Naagendra
Lyrics::G.KrshnaMoorti
Singer's::P.B.Sreenivaas, Jikki
Cast::Kantarao,Krishnakumari,Adoni Lakshmi,Mikkilineni.
:::::

anuraaga seema..manameludaamaa
aanandaala..chavichoodamaa
meghaala telaaDi OlaaDudaamaa
merise dharaNee..manade sumaa

anuraaga seema..manameludaamaa
aanandaala..chavichoodamaa
O hohohO..ahaha..ahaha..ahahaa

::::1

egireti elaseti geetaalu mroge
chiguraaku poobaalalooge
aa..aa..aa..aa..aa
egavole chirugaali paaraadi saage
keraTaalu koneta toogae

O..madhuraanubhavame ee jagaanaa
madhumaasamai nedu Sobhinchenaa
ilaninde valapu ee dinaanaa
kalalanni kanulaara kaantumaa

anuraaga seema..manameludaamaa
aanandaala chavi choodamaa

::::2

nelaraaju neDela kanaraaka maane
nee mOmu tilakinchi taladinchene
O..aa..aa..aa..aa
paliketi chilukela tana paaTa maane
kalakanthi nee kanThamaalinchene

kulikindi kalalaa ee lokamellaa
pulakinche niluvella giligintalaa
manaloni premaa..enaleni premaa
manasaara tanideera sevintumaa

anuraaga seema..manameludaamaa
aanandaala..chavichoodamaa
meghaala telaaDi OlaaDudaamaa
merise dharaNee..manade sumaa

anuraaga seema..manameludaamaa
aanandaala..chavichoodamaa
ahaa haa haa..aa aa aaahaa..

OhO O hO hO ho hO..mm mm mm..

Monday, July 29, 2013

అందం కోసం పందెం--1971















Naaloni Swapanaala - Andam Kosam Pandem by Cinecurry

సంగీతం::S.P.కోదండపాణి 
రచన::G.కృష్ణమూర్తి
గానం::P..సుశీల,ఘంటసాల
తారాగణం::కాంతారావు, కాంచన, భారతి, విజయలలిత, రాజనాల, రాజబాబు 

పల్లవి::

నాలో నీ స్వప్నాల..అందాలే నీవు 
నాకోసమేనా..దిగివచ్చినావు

నాలో నీ స్వప్నాల..అందాలే నీవు 
నాకోసమేనా..దిగివచ్చినావు

చరణం::1

తెల్లని జాబిల్లి..తలపే నీవు 
చల్లని గాలిలోని..చలువే నీవు
మాటావు నీవైన..భావమే నేను 
మాటావు నీవైన..భావమే నేను 
పాటవు నీవైన..రాగమే నేను 
పాటవు నీవైన..రాగమే నేను..ఊ.. 
మనలో వలపే..వరమై వెలసే 

నాలో నీ స్వప్నాల..అందాలే నీవు 
నాకోసమేనా..దిగివచ్చినావు

చరణం::2

రెప్పలు రెండైనా..కన్నొకటేగా 
కన్నులు రెండైనా..చూపొకటేగా 
పెదవులు రెండైనా..పదమొకటేగా 
పెదవులు రెండైనా..పదమొకటేగా 
మేనులు రెండైనా..మనసొకటేగా 
మేనులు రెండైనా..మనసొకటేగా..ఆ 
మనలో వలపే..వరమై వెలసే 

నాలో నీ స్వప్నాల..అందాలే నీవు 
నాకోసమేనా..దిగివచ్చినావు

Andam Kosam Pandem--1971
Music::S.P.Kodandapani
Lyrics::G.Krishnamurthy
Singer's::Ghantasala,P.Suseela
Cast::KantaRao,Kanchana,Bharati,Vijayalalita,Rajanala,RajaBAbu

:::

Naalo nee swapnaala..andaale neevu 
naakosamenaa..digivachchinaavu

Naalo nee swapnaala..andaale neevu 
naakosamenaa..digivachchinaavu

:::1

Thellani jaabilli..thalape neevu 
challani gaaliloni..chaluve neevu
Maatavu neevaina..bhaavame nenu 
Maatavu neevaina..bhaavame nenu 
Paatavu neevaina..raagame nenu 
Paatavu neevaina..raagame nenu 
Manalo valape..varamai velase 

Naalo nee swapnaala..andaale neevu 
naakosamenaa..digivachchinaavuu

:::2

Reppalu rendainaa..kannokategaa 
kannulu rendainaa..choopokategaa
Pedavulu rendainaa..padamokategaa 
Pedavulu rendainaa..padamokategaa
Menulu rendainaa..manasokategaa 
menulu rendainaa..manasokategaa
Manalo valape..varamai velase 

Naalo nee swapnaala..andaale neevu 
naakosamenaa..digivachchinaavu

Friday, June 07, 2013

కోటలో పాగ--1976



సంగీతం::J.V.రాఘవులు
రచన::G.K.కృష్ణమూర్తి  
గానం::P.సుశీల
తారాగణం::రామకృష్ణ,రాజబాబు,రాజనాల,జయసుధ,కల్పన,శాంతకుమారి,ముక్కామల

పల్లవి::
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీవు రావు నిదుర రాదు..నిలవలేనురా
నీవు లేని రేయిలోన..హాయి లేదురా..ఆ
నీవు రావు నిదుర రాదు..నిలవలేనురా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ..నీవు రావు 

చరణం::1

ఝం తఢాకా..లబ్జలకడి జంజనకడి నకడి నకడి జణకుజణ
ఝం తఢాకా చూడు మల్లా..జంభాలే వేడి ఝల్లా 
ఓరోరి మావయ్యా వగలమారి మావయ్యో..వదిలివెళ్ళ లేవు రేయల్లా
ఝం తఢాకా చూడు మల్లా..జంభాలే వేడి ఝల్లా
ఓరోరి మావయ్యా వగలమారి..మావయ్య వదిలివెళ్ళ లేవు రేయల్లా

చరణం::2

చంగావి కోకా కట్టి చంకలోన బుట్టా పెట్టి
సంతకు వెళతావుంటే చింతతోపు గుంటకాడా
డొంకలోనా నక్కి చూసినావయ్యో..ఓఓఓ
నా చంకలోన బుట్టా..గుంజినావయ్యో
ఝం తఢాకా చూడు మల్లా..జంభాలే వేడి ఝల్లా
ఓరోరి మావయ్యా వగలమారి మావయ్య..వదిలివెళ్ళ లేవు రేయల్లా
లబ్జలకడి జంజనకడి నకడి నకడి జణకుజణ

Monday, September 17, 2012

మదన కామరాజు కథ--1962::యదుకుల కాంభోజి::రాగం



సంగీతం::రాజన్ నాగేంద్ర
రచన::G.కృష్ణమూర్తి
గానం::P.B.శ్రీనివాస్,P.సుశీల

యదుకుల కాంభోజి::రాగం

పల్లవి::


నీలి మేఘమాలవో నీలాలతారవో
నీ సోయగాలతో మదినీ దోచిపోదువో
నీలి మేఘమాలవో..

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్

నీలి మేఘమాలనో నీలాల తారనో
నా సోయగాలతో మదినీ దోచిపోడునో
నీలి మేఘమాలనో..

చరణం::1

నీ రాక కోసమే చెలీ..నే వేచి యుంటినే
ఆరాటమేలనో ప్రియా..నే చెంతనుంటినే
ఆనంద మధుర గీతములా..ఆలపింతుమా
నీలి మేఘమాలనో..

చరణం::2

చివురించు వలపు తీవెలా..విరిపూలు పూయగా
చిరునవ్వు విరుపు లోపలా..హరివిల్లు విరియగా
నెలవంక నావలోన మనమూ..కలసి పోదమా
నీలి మేఘమాలవో..

చరణం::3

మనలోని కలత మాయమై..మన ఆశ తీరెగా
అనురాగ రాగమే ఇక..మన రాగమాయేగా
మనసార ప్రేమ మాధురులా..సాగిపోదమా

నీలి మేఘమాలనో నీలాల తారనో
నీ సోయగాలతో మదినీ దోచిపోదువో

Tuesday, May 24, 2011

పెళ్ళిమీద పెళ్ళి--1959



సంగీతం::రాజన్ - నాగేద్ర 
రచన::G.కృష్ణమూర్తి 
గానం::P.B.శ్రీనివాస్,P.సుశీల 
Film Directed By::B.Vithalaachaari
 తారాగణం::J.V.రమణమూర్తి,
కృష్ణ కుమారి,జయశ్రీ,మీనాకుమారి,చలం,మిక్కిలినేని,పెరుమాళ్ళు.

పల్లవి::

చిరునవ్వుల నవవాసంతం..విరజల్లెను నవనీతం
తరుచాయల గిరిలోయల..వినిపించెను మధుగీతం
చెలరేగెను ప్రేమపతాకం..కలిగించెను అతి తాపం
ఓ ప్రేయసి ఏల కసి..కనలేనా నీ రూపం
చిరునవ్వుల నవవాసంతం..
అహహా..ఒహొహో..అహహా..ఒహొహో..లలలా

చరణం::1

ఆఆఆఆఆఆఆ 
హాయ్ పూచిన పూవుల సందేశం..మీటిన గాలుల సంకేతం
లలలలా..లులులులూ..లెరిలెరిలేహే..హాయ్
భావమదేనోయ్ అనురాగం..బావా అదేగా మన రోగం
ఈ జగమే సోయగమై..శోభలతో అలరారే  
జతలేకా జగమందూ..ఒంటిగ ఉంటిని నేనే..ఈఈ

చిరునవ్వుల నవవాసంతం..విరజల్లెను నవనీతం
చిరునవ్వుల నవవాసంతం..

చరణం::2

ఆఆఆఆఆఆఆ..హాయ్
ఆమనిఏ వనమున శోభ..ప్రేమయే జీవనమున శోభా
లలలలా..లులులులూ..లెరిలెరిలేహే..హాయ్    
ఈ తనువే మన ధనమోయీ..ఈ దినమే మన ధనమోయీ
కోరికలే..ఏఏ..తారికలై..పూయుచు నామది లేచే
కోకిలలూ కూయగనే..కోమలి నామది దోచే

చిరునవ్వుల నవవాసంతం..విరజల్లెను నవనీతం
తరుచాయల గిరిలోయల..వినిపించెను మధుగీతం
చిరునవ్వుల నవవాసంతం..
అహహా..ఒహొహో..అహహా..ఒహొహో..లలలా
అహహా..ఒహొహో..అహహా..ఒహొహో..లలలా..లలలా..మ్మ్ హు హు

Pelli Meeda Pelli--1959
Music::Raajan - Naagedra 
Lyrics::G.Krshnamoorti 
Singer::P.B.Sreenivaas,P.Suseela 
Film Directed By::B.Vithalaachaari
Cast::J.V.Ramanamoorti,Krinakumaari,Jayasrii,Meenaakumaari,Chalam,Mikkilineni,Perumaallu.

::::::::::::::::::::::::::::::::::::::::::::::

chirunavvula navavaasantam..virajallenu navaneetam
taruchaayala girilOyala..vinipinchenu madhugeetam
chelarEgenu prEmapataakam..kaliginchenu ati taapam
O prEyasi Ela kasi..kanalEnaa nee roopam
chirunavvula navavaasantam..
ahahaa..ohohO..ahahaa..ohohO..lalalaa

:::::1

aaaaaaaaaaaaaaaaaaaaa 
haay poochina poovula sandESam..meeTina gaalula sankEtam
lalalalaa..lulululuu..lerilerilEhE..haay
bhaavamadEnOy anuraagam..baavaa adEgaa mana rOgam
ii jagamE sOyagamai..SObhalatO alaraarE  
jatalEkaa jagamanduu..onTiga unTini nEnE..eeee

chirunavvula navavaasantam..virajallenu navaneetam
chirunavvula navavaasantam..

::::2

aaaaaaaaaaaaaaaaaaaaa..haay
AmaniE vanamuna SObha..prEmayE jeevanamuna SObhaa
lalalalaa..lulululuu..lerilerilEhE..haay    
ii tanuvE mana dhanamOyii..ii dinamE mana dhanamOyii
kOrikalE..EE..taarikalai..pooyuchu naamadi lEchE
kOkilaloo kooyaganE..kOmali naamadi dOchE

chirunavvula navavaasantam..virajallenu navaneetam
taruchaayala girilOyala..vinipinchenu madhugeetam
chirunavvula navavaasantam..
ahahaa..ohohO..ahahaa..ohohO..lalalaa

ahahaa..ohohO..ahahaa..ohohO..lalalaa..lalalaa..mm hu hu

Monday, November 29, 2010

చిట్టితల్లి--1972




















సంగీత::విజయాకృష్ణమూర్తి
రచన::G.K.మూర్తి
గానం::P.సుశీల
తారాగణం::హరనాధ్,భారతి, బేబి రాణీ,రాజబాబు, రమాప్రభ,త్యాగరాజు,సాక్షి రంగారావు  

పల్లవి::

వెచ్చనీ..ఈ..వెన్నెలనోయీ..వెచ్చనీ..ఈ..వెన్నెలనోయీ 
విచ్చిన మల్లియనోయీ..ఈ..
వచ్చినా..ఆ..నీకయీ..ఈ..వచ్చినా..ఆ..నీకయీ

చరణం::1

కనుపాపల్లో దీపము నీవే..కలలోపల రూపము నీవే 
కనుపాపల్లో దీపము నీవే..కలలోపల రూపము నీవే
నా మధురాల భావము నీవే..నా మదిలోని దైవము నీవే
వచ్చినా..ఆ..నీకయీ..ఈ..వచ్చినా..ఆ..నీకయీ
వెచ్చనీ..ఈ..వెన్నెలనోయీ..విచ్చిన మల్లియనోయీ
వచ్చినా..ఆ..నీకయీ..ఈ..వచ్చినా..ఆ..నీకయీ
ఆహా హా ఆహా హా ఆహా హా ఆ ఆ హా..

చరణం::2

పిల్లగాలుల అల్లరిసాగే..వల్లెచాటున వలపులు దాగే
పిల్లగాలుల అల్లరిసాగే..వల్లెచాటున వలపులు దాగే
కాలి మువ్వల్లో పిలుపులు మ్రోగే..కొంటె కోరికలూ చెలరేగే
వచ్చినా..ఆ..నీకయీ..ఈ..వచ్చినా..ఆ..నీకయీ
వెచ్చనీ..ఈ..వెన్నెలనోయీ..విచ్చిన మల్లియనోయీ..ఈ
వచ్చినా..ఆ..నీకయీ..ఈ..వచ్చినా..ఆ..నీకయీ

చిట్టితల్లి--1972















సంగీత::విజయాకృష్ణమూర్తి
రచన::G.K.మూర్తి
గానం::S.P.బాలు,జిక్కి 
తారాగణం::హరనాధ్,భారతి, బేబి రాణీ,రాజబాబు, రమాప్రభ,త్యాగరాజు,సాక్షి రంగారావు  

పల్లవి::

ఈ..ఈ..తీయనిరేయి తెలవారుటె మాని..ఈ
యిలా..ఆఆఆ..నిలచి కవ్వించనీ..ఈ
ఈ..ఈ..తీయనిరేయి తెలవారుటె మాని..ఈ
యిలా..ఆఆఆ..నిలచి కవ్వించనీ..ఈ

చరణం::1

నీ లేడి కన్నులలోనా..నీ లెత వన్నెలలోనా
నీ లేడి కన్నులలోనా..నీ లెత వన్నెలలోనా
తీరైన లోకాలన్నీ..తిలకించనీ..ఈ..తిలకించనీ
మరుమల్లె మాలికనోయీ..మరులున్న బాలికనోయీ
మురిపించు మురళిని నేనై వినిపించనీ..ఈ..వినిపించనీ..మ్మ్
ఈ..ఈ..తీయనిరేయి తెలవారుటె మాని..ఈ
యిలా..ఆఆఆ..నిలచి కవ్వించనీ..ఈ

చరణం::2

నీ నడక సొంపులలోనా..లే నడుము ఒంపులలోనా
నీ నడక సొంపులలోనా..లే నడుము ఒంపులలోనా
యెనలేని వయ్యారాలు..కనిపించనీ..ఈ..కనిపించనీ
నీ హృదయ సీమను చేరి..నీ పెదవి నవ్వుగ మారి..మ్మ్
అందాల ఆనందాలు అందించనీ..ఈ..అందించనీ..ఆహా  

ఈ..ఈ..తీయనిరేయి తెలవారుటె మాని..ఈ
యిలా..ఆఆఆ..నిలచి కవ్వించనీ..ఈ



ChittiTalli--1972
Music::Vijayakrishnamoorti
Lyrics::G.Krishnamurthy
Singers::S. P.Balu,Jikki
Cast::Harinath,Bharati,BabyRani,Rajababu,Ramaprabha,Tyagayya,Saakshi Rangarao

:::

Ee..ii..theeyaniraeyi thelavaaruthe maani..ii
yilaa..aaaaaa..nilachi kavvinchanee..ii

Ee..ii..theeyaniraeyi thelavaaruthe maani..ii
yilaa..aaaaaa..nilachi kavvinchanee..ii

::::1

nee ledi kannulalonaa..nee lEta vannelalonaa
nee ledi kannulalonaa..nee lEta vannelalonaa
teeraina lokaalannee tilakinchanee..ii..thilakinchanee
marumalle maalikanoyee..marulunna baalikanoyee
muripinchu muralini nenai vinipinchanee..ii..vinipinchanee..mm

Ee..ii..theeyaniraeyi thelavaaruthe maani..ii
yilaa..aaaaaa..nilachi kavvinchanee..iie

::::2

nee nadaka sompulalonaa..le nadumu ompulalonaa
nee nadaka sompulalonaa..le nadumu ompulalonaa
yenaleni vayyaaraalu kanipinchanee..ii..kanipinchanee
nee hridaya seemanu cheri..nee pedavi navvuga maari..mm
andaala aanandaalu andinchanee..iiandinchanee..aahaa  

Ee..ii..theeyaniraeyi thelavaaruthe maani..ii
yilaa..aaaaaa..nilachi kavvinchanee..ii