Saturday, April 03, 2010

బంగారు పాప--1954























సంగీతం::అద్దెపల్లి
రచన::దేవులపల్లి
గానం::A.M.రాజ,P.సుశీల
తారాగణం::S.V. రంగారావు,జగ్గయ్య,కృష్ణకుమారి,రామశర్మ,రమణారెడ్డి,హేమలత 

పల్లవి::

ఓఓఓ ఓఓఓ ఓఓఓ ఓఓఓ
యవ్వన మధువనిలో వన్నెల పువ్వుల ఉయ్యాల
యవ్వన మధువనిలో వన్నెల పువ్వుల ఉయ్యాల
ఉయ్యాల..జంపాల..ఉయ్యాల..జంపాల

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
జీవన మధువనిలో..పచ్చని తీగల ఉయ్యాల..ఆఆ
జీవన మధువనిలో..పచ్చని తీగల ఉయ్యాల..ఆఆ
ఉయ్యాల..జంపాల..ఉయ్యాల..జంపాల

చరణం::1

బ్రతుకే ఎలమావితోట..మదిలో మకరందపు తేట
బ్రతుకే ఎలమావితోట..మదిలో మకరందపు తేట

అడుగడుగున పువ్వులబాట..అని చాటే కోయిలపాట
ఆఆఆ..ఆఆఆ..ఆఆఆ
అడుగడుగున పువ్వులబాట అని చాటే కోయిలపాట
ఉయ్యాల..జంపాల..ఉయ్యాల..జంపాల

చరణం::2

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అలనల్లన నా మదిలోన..పలికే బంగారు వీణ
అలనల్లన నా మదిలోన..పలికే బంగారు వీణ

నులిమెత్తని అంగుళిహాని..ఈ తీగలు మీటెను గాని 
నులిమెత్తని అంగుళిహాని..ఈ తీగలు మీటెను గాని
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఉయ్యాల..జంపాల..ఉయ్యాల..జంపాల

భాగ్య చక్రం--1968















సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు 
రచన::పింగళి 
గానం::ఘంటసాల,P.సుశీల
Film Directed By::Kadiri Venkata Reddy
తారాగణం::N.T.రామారావు, B. సరోజాదేవి, రాజనాల, గీతాంజలి, పద్మనాభం, ముక్కామల  

పల్లవి::

అతడు::-

నీవు లేక నిముసమైన నిలువ జాలనే

ఆమె::- 

నీవు లేక నిముసమైన నిలువ జాలనే

అతడు::-

నీవే కాదా ప్రేమ నాలో విరియ జేసినదీ

ఆమె::- 

నీవే కాదా ప్రేమ నాలో విరియ జేసినదీ

అతడు::-

ఈ..ఈ..ఈ..విరియ జేసినదీ

ఆమె::- 

ఈ..ఈ..ఈ..విరియ జేసినదీ
నీవు లేక నిముసమైన నిలువ జాలనే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

చరణం::1

అతడు::-

లోకమంతా నీవు గానే నాకు తోచెనుగా

ఆమె::- 

లోకమంతా నీవు గానే నాకు తోచెనుగా

అతడు::-

మరువరానీ మమతలేవో మదిని పూసెనుగా

ఆమె::- 

మరువరానీ మమతలేవో మదిని పూసెనుగా
ఆ..మదిని పూసెనుగా

నీవు లేక నిముసమైన నిలువ జాలనే

చరణం::2

అతడు::-

ఒకరి కోసం ఒకరిమనినా ఊహ తెలిసెనుగా

ఆమె::- 

ఒకరి కోసం ఒకరిమనినా ఊహ తెలిసెనుగా

అతడు::-

వీడిపోని నీడ ఓలె కూడి ఉందుముగా

ఆమె::- 

వీడిపోని నీడ ఓలె కూడి ఉందుముగా
ఆ..ఆ..కూడి ఉందుముగా..

నీవు లేక నిముసమైన నిలువ జాలనే
నీవే కాదా ప్రేమ నాలో విరియ జేసినదీ
ఈ..ఈ..విరియ జేసినదీ

భాగ్య చక్రం--1968
























సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు 
రచన::పింగళి 
గానం::P.సుశీల
తారాగణం::N.T.రామారావు, B. సరోజాదేవి, రాజనాల, గీతాంజలి, పద్మనాభం, ముక్కామల  

పల్లవి::

వాన కాదు వాన కాదు వరదా రాజా
పూల వాన కురియాలి వరదరాజా

హోయ్ వాన కాదు వాన కాదు వరదా రాజా
పూల వాన కురియాలి వరదరాజా

చరణం::1

వనమునేలు బాలరాణి ఎవరో అంటూ
నగరునేలు బాల రాజు చూడరాగా
వనమునేలు బాలరాణి ఎవరో అంటూ
నగరునేలు బాల రాజు చూడరాగా
కోకిలమ్మ పాట పాడా నెలిమి పిట్ట ఆటలాడా
సందడించి నా గుండె ఝల్లు ఝల్లు ఝల్లుమనగా
వాన కాదు వాన కాదు వరదా రాజా
పూల వాన కురియాలి వరద రాజా

చరణం::2

కొండలోన కోనలోనా తిరిగే వేళా
అండదండ నీకు నేనే ఉండాలంటూ 
కొండలోన కోనలోనా తిరిగే వేళా
అండదండ నీకు నేనే ఉండాలంటూ 
పండు వంటి చిన్నవాడు నిండు గుండె వన్నెకాడు
చేర రాగ కాలి అందె ఘల్లు ఘల్లు ఘల్లు మనగా

వాన కాదు వాన కాదు వరదా రాజా
పూల వాన కురియాలి వరదరాజా

చరణం::3

కొండపైన నల్ల మబ్బు పందిరి కాగా
కోనలోన మెరుపూ తీగే తోరణ కాగా
కొండపైన నల్ల మబ్బు పందిరి కాగా
కోనలోన మెరుపూ తీగే తోరణ కాగా
మల్లెపూల తేరు పైన పెళ్లికొడుకు రాగానే
వాణ్ణి చూసి నా మనసు వళ్లె వళ్లే వళ్లే యనగా

వాన కాదు వాన కాదు వరదా రాజా
పూల వాన కురియాలి వరదరాజా

జయసుధ--1982
















సంగీతం::రమేశ్ నాయుడు
రచన::దాసరి నారాయణరావు   
గానం::K.J.ఏసుదాస్, P. సుశీల
Film Directed By::K.V.Nandana Rao
Film Producer By::Taraka Harihara Prabhu
Cast::Jayasudha,Murali Mohan,Dasari Naryana Rao,Mohan Babu.

పల్లవి::

కనురెప్ప పాడిందీ..కనుసైగ..పాటా 
కనుసైగ..పాటా
కనుపాప నవ్వింది..కనులున్న..చోట
కలగన్న చోట..అవి కలగన్న..చోట
కనురెప్ప పాడిందీ..కనుసైగ..పాటా 
కనుసైగ..పాటా


చరణం::1

కలలూరు వేళ..కనుమూత..పడగా
కనుముందు నీ..నీడ..కదలాడిరాగా
కలలూరు వేళ..కనుమూత..పడగా
కనుముందు..నీ..నీడ..కదలాడిరాగా
కనులెందుకు?..ఈ..కనులెందుకు?
కలలు చెరిగేందుకు..చెరిగి పోయేందుకు

కనుల కనుల..కలయికలో
కలయికల..కలవరింతలలో
కలిగే..కరిగే..కదిలే
కదలికలే..ఆ కలలూ
ఆ కలల వెలుగులే..ఈ కనులు
ఆ కలల వెలుగులే..ఈ కనులు

కనురెప్ప పాడిందీ..కనుసైగ..పాటా 
కనుసైగ..పాటా
కనుపాప నవ్వింది..కనులున్న.చోట
కలగన్న..చోట..అవి..కలగన్న..చోట
కనురెప్ప పాడిందీ..కనుసైగ..పాటా 
కనుసైగ..పాటా

చరణం::2

తెలవారు వేళ..కనురెప్ప..విడగా
కనుముందు..నీ..రూపు కనిపించిపోగా
తెలవారు వేళ..కనురెప్ప విడగా
కనుముందు..నీ..రూపు కనిపించిపోగా
కలలెందుకు?..ఆ..కలలెందుకు?
కధలు మిగిలేందుకు..మిగిలి నిలిచేందుకు

మనసు మనసు..ఊహలలో
మరపురాని..ఊసులలో
విరిసే..కురిసే..మెరిసే
మెరుపులవే..ఈ కలలు
ఆ కలల వెలుగులే..ఈ కనులు
ఆ కలల వెలుగులే..ఈ కనులు

కనురెప్ప పాడిందీ..కనుసైగ..పాటా 
కనుసైగ..పాటా
కనుపాప నవ్వింది..కనులున్న..చోట
కలగన్న..చోట..అవి..కలగన్న..చోట
కనురెప్ప పాడిందీ..కనుసైగ..పాటా 
కనుసైగ..పాటా