Sunday, May 08, 2011

త్రిశూలం--1982





















సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు  , P.సుశీల 
Film Directed By::K.Raghavendra Rao

తారాగణం::కృష్ణంరాజు,శ్రీదేవి,జయసుధ,రాధిక,చలపతిరావు

పల్లవి::

రాయిని ఆడది చేసిన రాముడివా
గంగను తలపై మోసే శివుడివా
రాయిని ఆడది చేసిన రాముడివా
గంగను తలపై మోసే శివుడివా
ఏమనుకోనూ నిన్నేమనుకోనూ
ఏమనుకోనూ నిన్నేమనుకోనూ

నువు రాయివి కావూ గంగవు కావూ
నే రాముడు శివుడూ కానే కానూ
నువు రాయివి కావూ గంగవు కావూ
నే రాముడు శివుడూ కానే కానూ
తోడనుకో నీ వాడనుకో
తోడనుకో నీ వాడనుకో

చరణం::1

నేనేంటి..నాకింతటి విలువేంటి 
నీ అంతటి మనిషితోటి పెళ్ళేంటి 
నీకేంటి.. నువు చేసిన తప్పేంటి 
ముల్లునొదిలి అరిటాకుకు శిక్షేంటి 

తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా
నిప్పు లాంటి సీతనైన తప్పు చెప్పకుందా
తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా
నిప్పు లాంటి సీతనైన తప్పు చెప్పకుందా

అది కధే కదా మన కధ నిజం కాదా
అది కధే కదా మన కధ నిజం కాదా

రాయిని ఆడది చేసిన రాముడివా
గంగను తలపై మోసే శివుడివా
ఏమనుకోనూ నిన్నేమనుకోనూ
తోడనుకో నీ వాడనుకో

చరణం::2

ఈ ఇల్లు తోడొచ్చిన నీ కాళ్ళు
నాకెన్నెన్నో జన్మలకూ కోవెల్లు
కోవెల్లు కోవెలలో దివ్వెల్లు
కన్నీళ్ళతో వెలిగించే హృదయాలు

హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు
ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు
హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు
ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడూ

అది నువ్వే కదా నేను నువ్వే కదా
అది నువ్వే కదా నేను నువ్వే కదా

నువు రాయివి కావూ గంగవు కావూ
నే రాముడు శివుడూ కానే కానూ
ఏమనుకోనూ నిన్నేమనుకోనూ
తోడనుకో నీ వాడనుకో



Trishoolam--1982
Music::K.V.Mahadevan
Lyricist::Aathreya
Singers::S.P.Balu , P.Suseela

Rayini adadhi chesina ramudiva
Ganganu thalapai mose sivudiva
Rayini adadhi chesina ramudiva
Ganganu thalapai mose sivudiva
Yemi anukonu ninnu emi anukonu
Yemi anukonu ninnu emi anukonu

Nuvvu rayivi gangavu kaavu
Ne ramudu sivudu kaane kaanu
Nuvvu rayivi gangavu kaavu
Ne ramudu sivudu kaane kaanu
Thodu anuko nee vadu anuko
Thodu anuko nee vadu anuko

Nenenti naaku inthati viluvuenti
Nee anthati manishi tho pelli enti
Neekenti nuvvu chesina thappu enti
Mulluni vodhili arti aaku ki siksha enti

Thappu naadu kadhu ante lokam oppu thunda
Nippu lanti sitanaina thaapu chepakundhaa
Thappu naadu kadhu ante lokam oppu thunda
Nippu lanti sitanaina thaapu chepakundhaa

Adi kade kadha..Mana kadha nijamu kadha
Adi kade kadha..Mana kadha nijamu kadha

Rayani adadhi chesina ramudiva
Ganganu thalapai mose sivudiva
Yemi anukonu ninnu emi anukonu
Thodu anuko nee vadu anuko

Ee illu roju vachina nee kallu
Naaku eneno janmalu ko kovilu
Kovilu kovelalo niruvillu
Kaneela tho veluginche hrudiyalu

Hrudiyaluni veluginche manishi kada devudu
Aa devudiki varasudu mamulu manavudu
Hrudiyaluni veluginche manishi kada devudu
Aa devudiki varasudu mamulu manavudu

Adi nuvve kada..Nenu nuvve kaada
Adi nuvve kada..Nenu nuvve kaada

Nuvvu rayivi kaavu gangavu kaavu
Ne ramudu sivudu kane kaanu
Yemi anukonu ninnu emi anukonu
Thodu anuko nee vadu anuko

స్వర్గం-నరకం-1975


సంగీతం::సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.జానకి
తారాగణం::ఈశ్వరరావు,మోహన్ బాబు,దాసరి నారాయణరావు,అన్నపూర్ణ,జయలక్ష్మి,రాజేశ్వరి.

పల్లవి::

ఆ లలలలలలా..మ్మ్ లలలలలా

ఆ యీది కుర్రోడు..ఈ యీది కొచ్చాడు 
ఆ యీది కుర్రోడు..ఈ యీది కొచ్చాడు
నన్ను రమ్మన్నాడే..నిన్ను రమ్మన్నాడే 
యిద్దరి రమ్మని..యిద్దరి రమ్మని
ఇరుకున పడ్డాడే..తారం తారం
అబ్బ అబ్బ..తారం తారం..మ్మ్

చరణం::1

చీకటి పడ్డాక చెరువు గట్టు కాడ..నువ్వే రావాలన్నాడే
చెంపమీద చిటికేసి చెవిలో ఊదేసి..చేతిలో ఏదో రాశాడే
తీరావస్తే..అటు నువు ఇటు నేనూ మద్దెలో సోగ్గాడు 
మద్దెలో సోగ్గాడు..మ్యామ్మే అన్నాడే      
తారం తారం..అబ్బ అబ్బ తారం తారం
అబ్బ అబ్బ తారం తారం..మ్మ్..ఆ

నేరం నాదికాదు ఆకలిది--1976



సంగీతం::సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::N.T.రామారావు,మంజుల,లత,మురళీమోహన్, గుమ్మడి

పల్లవి::

చెకుముకి రవ్వ చినబోయింది ఓయమ్మా
అది గుప్పున మండీ నిప్పైరగిలే దెపుడమ్మా  
చెకుముకి రవ్వ చినబోయింది ఓయమ్మా
అది గుప్పున మండీ నిప్పైరగిలే దెపుడమ్మా  
అది గుప్పున మండీ నిప్పైరగిలే దెపుడమ్మా
ఎపుడమ్మా...ఎపుడమ్మా  

చరణం::1

నేడుగాకున్న రేపైనా వసంతం రానే వస్తుంది
ఆహా ఓహో...అహా ఓహో
మోడుగావున్న జీవితమే పూలతో ముస్తాబవుతుంది
ఆహా ఓహో...అహా ఓహో
నేడుగాకున్న రేపైనా వసంతం రానే వస్తుంది
మోడుగావున్న జీవితమే పూలతో ముస్తాబవుతుంది
గాలిలా సాగిపోతేనే గమ్యము ఎదురౌతుందమ్మా
ఏరులా పొంగిపోతేనే సాగరం చేరువౌనమ్మా
అయ్యో రామా..చెకుముకి రవ్వ చినబోయింది ఓయమ్మా
అది గుప్పున మండీ నిప్పైరగిలే దెపుడమ్మా  
అది గుప్పున మండీ నిప్పైరగిలే దెపుడమ్మా..ఎపుడమ్మా  

చరణం::2

అహా ఓహో
మెత్తగా ఉంటే ఈ లోకం నెత్తిపై కాళ్ళు పెడుతుంది
ఆహా ఓహో...అహా ఓహో
ఆ కత్తిలా వున్నవాడంటే గులామై కాళ్ళుపడుతుంది
ఆహా ఓహో...ఆహా ఓహో
మెత్తగా వుంటే ఈ లోకం నెత్తిపై కాళ్ళు పెడుతుంది
కత్తిలా వున్నవాడంటే గులామై కాళ్ళుపడుతుంది
విత్తనం నేలలో ఉంటే దానికి విలువే లేదమ్మా
మొక్కలా చీల్చుకొస్తేనే దానికీ ఫలితం ఉందమ్మా 
అయ్యో రామా..చెకుముకి రవ్వ చినబోయింది ఓయమ్మా
అది గుప్పున మండీ నిప్పైరగిలే దెపుడమ్మా  
అది గుప్పున మండీ నిప్పైరగిలే దెపుడమ్మా..ఎపుడమ్మా  

చరణం::3

పచ్చని తీగ పందిరికై వింతగా పరుగులు తీస్తుంది
ఆహా ఓహో...ఆహా ఓహో
వెచ్చని పరువం జతకోసం అంతగా ముచ్చట పడుతుంది
ఆహా ఓహో...ఆహా ఓహో
పచ్చని తీగ పందిరికై వింతగా పరుగులు తీస్తుంది
వెచ్చని పరువం జతకోసం అంతగా ముచ్చట పడుతుంది
కుమిలిపోతున్న గుండెల్లో తేనెలు కురిపించాలమ్మా
చీకటి కమ్మిన కళ్ళల్లో వెన్నెల చిలికించాలమ్మా
అయ్యో రామా..చెకుముకి రవ్వ చినబోయింది ఓయమ్మా
అది గుప్పున మండీ నిప్పైరగిలే దెపుడమ్మా  
అది గుప్పున మండీ నిప్పైరగిలే దెపుడమ్మా..ఎపుడమ్మా