Friday, January 28, 2011

హారతి--1974

సంగీతం::చక్రవర్తి
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::కృష్ణం రాజు,జగ్గయ్య,రాజబాబు,పద్మనాభం,శారద,భారతి,రమాప్రభ,నిర్మల,హలం 

పల్లవి::

ఎప్పుడూ నిన్నే ఇలాగే చూడాలి ఇలాగే చూడాలి
ఎప్పుడూ నిన్నే ఇలాగే చూడాలి ఇలాగే చూడాలి
చప్పుడు చేయని నీ కనురెప్పల సరిగమలే వినాలి..వినాలి ఆహాహా
ఎప్పుడూ నిన్నే ఇలాగే చూడాలి ఇలాగే..ఏఏఏ..చూడాలి

చరణం::1
              
ఒకే..ఏ..అడుగులో ఇద్దరి అడుగులు ఒద్దికగా ఇమడాలి
ఒకే..ఏ..గొంతులో ఇద్దరి మనసులు ఊసులాడుకొవాలి
బాస చేసుకోవాలి..ఆహా..ఓహో..మ్మ్ మ్మ్ మ్మ్ హూ     
చప్పుడు చేయని నీ కనురెప్పల సరిగమలే వినాలి..వినాలి   
ఎప్పుడూ నిన్నే ఇలాగే చూడాలి ఇలాగే..ఏఏఏ..చూడాలి

చరణం::2
                 
తెలుగులోని తేనెలన్నీ నీ జీలుగు పెదవులు అందివ్వాలి 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ  
తెలుగులోని తేనెలన్నీ నీ జీలుగు పెదవులు అందివ్వాలి
చైత్ర పూర్ణిమల కళలన్నీ..ఈ..మ్మ్..నీ చిరునవ్వులలో 
విరబూయాలి..విరబూయాలి..ఆహా..ఆహా..ఆహా..హ్హా..హా 
చప్పుడు చేయని నీ కనురెప్పల సరిగమలే వినాలి..వినాలి   
ఎప్పుడూ నిన్నే ఇలాగే చూడాలి ఇలాగే..ఏఏఏ..చూడాలి