సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::ఆరుద్ర
గానం::V.రామకృష్ణ,P.సుశీల
పల్లవి::
సంధ్యకెంజాయలో..ఓ..ఓ..
సరసాల సరసి దరినీ...
కలిసినవి..ఇరుకన్నులూ..మెరిసినవి
పలు వన్నెలు..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
హరివిల్లు దివినుండి దిగివచ్చేనేమో
హరివిల్లు దివినుండి దిగివచ్చేనేమో
ప్రణయాల విరిజల్లు కురిపించెనేమో
మురిపించెనేమో..మైమరపించేనేమో
హరివిల్లు దివినుండి దిగివచ్చేనేమో
చరణం::1
విరియని విరిజాజులు..నా వలపులా లేతలుపులు
విరియని విరిజాజులు..నా వలపులా లేతలుపులు
పెదవుల ధరహాసమూ..నే దాచితీ నీ కోసమూ
నీ కథలు విన్నాను..చిననాటి నుంచి
నీ కలలు కన్నాను..అనురాగమెంచి
హరివిల్లు దివినుండి దిగివచ్చెనేమో
ప్రణయాల విరిజల్లు..కురిపించెనేమో
మురిపించెనేమో..మైమరపించెనేమో
చరణం::2
నునుసిగ్గు చెలరేగి..పులకింతలాయే
తొలిప్రేమ మురిపాలు..చిగురింతలాయే
హరివిల్లు దివినుండి దిగివచ్చెనేమో
ప్రణయాల విరిజల్లు..కురిపించెనేమో
మురిపించెనేమో..మైమరపించెనేమో
హరివిల్లు దివినుండి దిగివచ్చెనేమో