సంగీతం::జోసెప్,క్రిష్ణమూర్తి
రచన::C.నారాయణ రెడ్డి
గానం::P.సుశీల
నారాయణ రెడ్డి కలం నుండి వెలువడిన
మరో రొమాంటిక్ హిట్
మదనా సుందర నాదోరా..
ఓ..మదనా సుందర నాదోరా..
నామది నిన్ను గనిపొంగినదిరా వన్నెదురావో
ఓ..మదనా సుందర నాదోరా....
చిన్నదానను నేను వన్నేకాడవు నీవు
చిన్నదానను నేను వన్నేకాడవు నీవు
నాకూ నీకూ జోడు....
నాకూ నీకూ జోడు..రాకాచంద్రులతోడు
మదనా సుందర నాదోరా..
మిసిమి వన్నెలలోన పసిడితిన్నెలపైన
మిసిమి వన్నెలలోన పసిడితిన్నెలపైన
రసకేళి తేళీ....
రసకేళి తేలి పరవశమౌదమీవేళ
మదనా సుందర నాదోరా....
గిలిగింతలిడ ఇంక పులకింత లేదేమి
గిలిగింతలిడ ఇంక పులకింత లేదేమి
వుడికించకింకా....
వుడికించకింకా చూడొకమారు నా వంక
మదనా సుందరనాదోరా....
మరులుసైపగలేను విరహామోపగలేను
మరులుసైపగలేను విరహామోపగలేను
మగరాయడా రారా....
మగరాయడా రారా బిగికౌగిలీచేర
మదనా సుందర నాదోరా..
నామది నిన్ను గనిపొంగినదిరా వన్నెదురావో
ఓ..మదనా సుందర నాదోరా..