సంగీతం::ఘంటసాల
రచన::మల్లాది
గానం::ఘంటసాల,P.సుశీల
Film Director By::Vedantam Raghavaiah
తారాగణం::అక్కినేని నాగేశ్వరరావు,కృష్ణకుమారి,C.H..నారాయణరావు,S.V.రంగారావు,
B.సరోజాదేవి,గుమ్మడి,రమణారెడ్డి,G.వరలక్ష్మి,రాజశ్రీ,కృష్ణకుమారి,కాంతారావు,చిత్తూరునాగయ్య.
పల్లవి::
ఉన్నదిలే..దాగున్నదిలే..నీ కన్నుల ఏదో ఉన్నదిలే
అది నన్నే కోరుతున్నదిలే..ఈ వెన్నెలలో సై అన్నదిలే

చరణం::1
కన్నెపూల వన్నెలేవో..కన్ను గీటుతున్నవీ
కన్నెపూల వన్నెలేవో..కన్ను గీటు తున్నవి
మేనిలోన ఊహలేవో..వీణ మీటుచున్నవి
వీణ మీటుచున్నవి
ఉన్నదిలే..దాగున్నదిలే..నీ కన్నుల ఏదో ఉన్నదిలే
అది నన్నే కోరుతున్నదిలే..ఈ వెన్నెలలో సై అన్నదిలే
చరణం::2
గుండెలోన కోరికలేవో..దండలల్లుకున్నవి..ఈ..ఈ..
గుండెలోన కోరికలేవో..దండలల్లుకున్నవి
అందరాని పోంగులేవో..తొందరించుచున్నవి
తొందరించుచున్నవి
ఉన్నదిలే..దాగున్నదిలే..నీ కన్నుల ఏదో ఉన్నదిలే
అది నన్నే కోరుతున్నదిలే..ఈ వెన్నెలలో సై అన్నదిలే
చరణం::3
ఇన్నినాళ్ళ పుణ్యమంతా..ఎదుటనిలిచి ఉన్నది
ఇన్నినాళ్ళ పుణ్యమంతా..ఎదుటనిలిచి ఉన్నది
యుగయుగాల ప్రేమగాధ..చిగురువేయుచున్నది
చిగురువేయుచున్నది