సంగీతం::రమేష్ నాయుడు
రచన::Traditional
గానం::SP.బాలు
జో...లాలీ..ఓ..లాలీ నైనా
ఒకటాయె రెండాయే ఉయ్యాల..
రెండు మూడు మాసాలాయే ఉయ్యాలా
జో...లాలీ..ఓ..లాలీ నైనా
మూడో మాసములోన ఉయ్యాల
ముడికట్లు బిగువాయే ఉయ్యాల
జో...లాలీ..ఓ..లాలీ నైనా
మూడాయే నాలుగాయే ఉయ్యాల
నాల్గు ఐదు మాసములాయె ఉయ్యాల
జో...లాలీ..ఓ..లాలీ నైనా
ఐదాయె ఆరాయె ఉయ్యాల
ఆరు ఏడు మాసములాయె ఉయ్యాల
జో...లాలీ..ఓ..లాలీ
ఏడో మాసములోన ఉయ్యాల నైనా
వేగుళ్ళే..బయళిల్లే..ఉయ్యాల
జో...లాలీ..ఓ..లాలీ నైనా
ఏడాయె ఎనిమిదాయె ఉయ్యాల
ఎనిమిది తొమ్మిది మాసములాయె ఉయ్యాల
జో...లాలీ..ఓ..లాలీ నైనా
తొమ్మిది మాసములోన ఉయ్యాల నైన
శ్రీ కృష్ణ జన్మముర ఉయ్యాల
నైనా శ్రీ కృష్ణ జన్మముర ఉయ్యాల