Thursday, March 26, 2009
*~*~*!~ అందరికీ హాపీ ఉగాది ~*~*~*~
!! virodhi nAma samvatsara ugAdi SubhAkAnkshalu !!
~*~*~* Ugadi Shubhakankshalu *~*~*~
!! ఉగాది ప్రాముఖ్యత !!
ఈ పండుగ తెలుగు వారికి తెలుగు సంవత్సరము ప్రకారముగా తొలి పండుగ.
ఈ పండుగ ప్రతి సంవత్సరము చైత్ర శుద్ధ పాడ్యమి రోజున వస్తుంది.
చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు.
అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది.
అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు.
!! ఉగాది పచ్చడి మహిమ ఏమిటీ? !!
ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనం -తీపి,పులుపు,కారం,ఉప్పు,వగరు,చేదు
అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు.
సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను,
కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సండేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది.
ఈ పచ్చడి కొరకు చెరకు,అరటి పళ్ళు,మామిడి కాయలు,వేప పువ్వు,
చింతపండు,జామకాయలు,బెల్లం మొదలగునవి వాడుతుంటారు.
ఉగాది పచ్చడికి మనశాస్త్రాలలో "నింబ కుసుమ భక్షణం" మరియు
"అశోకకళికా ప్రాశనం " అని వ్యవహరించే వారు.
ఋతు మార్పు కారణంగా వచ్చే కఫ ,వాత,పిత్త, దోషాలను హరించే
ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది.
ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో
ఉప్పు'వేపపువ్వు,చింతపండు,బెల్లం,పచ్చిమిరప కాయలు,మామిడి చిగుళ్ళు
మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు.
ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
!! త్వామష్ఠ శోక నరాభీష్ట
మధుమాస సముద్భవ
నిబామి శోక సంతప్తాం
మమ శోకం సదా కురు !!
ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి.
ఉగాది పచ్చడి చేసే ఆచారం ఆహారం లో ఉండే ఔషధ గుణాన్ని,వృక్షసంరక్షణ అవసరాన్ని
ఆయుర్వేదానికి ఆహారానికి గల సంభందాన్ని చెప్పాడమే కాక హిందూ పండుగలకు,
ఆచారాలకు సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటిచెప్తుంది
ఉగాది రోజున దేవునికి నైవేద్యం పెట్టవలసిన ప్రసాదంలో ముఖ్యంగా పానకం ,వడపప్పు చోటు చేసుకుంటాయి.
ఉగాదితో వేసవి ఆరంభం అవుతుంది కనుక వేసవి తాపం తట్టుకోవడానికి పానకం లాంటి
నీరాహారం తినడం ఆవసరాన్నిఇది గుర్తు చేస్తుంది అలాగే వడపప్పు కూడా
వడ పప్పు లో వాడే పెసరపప్పు చలవచేస్తుంది
కనుక వేసవిలో కలిగే అవస్థ లను ఇది కొంత తగ్గిస్తుంది.ఇలాంటి ఆహారాన్ని ఉగాది రోజునే చేసుకోవడం ప్రారంభమైనది.
ముందు కాలంలో ఈ పండుగ రోజు విసనకర్రలు
పంచడం ఆనవాయితి.వేసవి తాపాన్ని తట్టుకొనేందుకు ఇవి ఉపయోగ పడేవి
ప్రస్థుత కాలంలో ఉన్న పంఖా లాంటి,ఏసీ మరియు ఎయిర్ కూలరు లాంటి వసతులు లేనికాలంలో
వేసవిలో సంభవించే గాలి లేమిని విసనకర్రాలు కొంత తీరుస్తాయి కనుక ఈ ఆచారం ఉగాదితో ప్రారంభం అవుతుంది.
Labels:
అందరికీ హాపీ ఉగాది
Subscribe to:
Posts (Atom)