Saturday, August 14, 2010

కృష్ణవేణి--1974





సంగీతం::విజయ భాస్కర్
రచన::దాశరధి
గానం::P.సుశీల


పదునాలుగేండ్లు వనవాసమేగి..
మరలి వచ్చెను సీత
పరమ పావని ఆ మాత
సార్వభౌముడు శ్రీరామచంద్రుని
సన్నిధి కోరెను సీత
అదే పెన్నిధి అన్నది భూజాత
పదునాలుగేండ్లు వనవాసమేగి..
మరలి వచ్చెను సీత
పరమ పావని ఆ మాత


సత్యపరీక్షకు అగ్నిపరీక్షకు సాధ్వి జానకి నిలిచే
అఖిల జగములో సీత పునీతని
అగ్నిదేవుడే పలికే..అగ్నిదేవుడే పలికే
అల్పుని మాటలు ఆలకించెను న్యాయమూర్తి రఘురాముడు
ఆమె కలుషితని అడవికి పంపెను నిర్దయుడా శ్రీరాముడు
రాముని దాచిన సీత మనసులో రగిలెను ఆరని శోకము

పదునాలుగేండ్లు వనవాసమేగి మరలి వచ్చెను సీత
పరమ పావని ఆ మాత
సార్వభౌముడు శ్రీరామచంద్రుని సన్నిధి కోరెను సీత
అదే పెన్నిధి అన్నది భూజాత


పూర్ణగర్భిణికి పుణ్యరూపిణికి ఆశ్రయమొసగెను వాల్మికి
ముని ఆశ్రమమున లవకుశ జననం..
సీతకు శాంతిని కలిగించె..సీతకు శాంతిని కలిగించె
పతి ధూషణలే తలచి తలచి విలపించెను..
ఆ మాత..పిలిచెను భూమాత
తల్లి గర్భమున కలిసెను భూజాత
జనని జానకి జీవితమంతా తీరని వియోగమాయె

పదునాలుగేండ్లు వనవాసమేగి..
మరలి వచ్చెను సీత
పరమ పావని ఆ మాత
సార్వభౌముడు శ్రీరామచంద్రుని సన్నిధి కోరెను సీత
అదే పెన్నిధి అన్నది భూజాత
పదునాలుగేండ్లు వనవాసమేగి మరలి వచ్చెను సీత
పరమ పావని ఆ మాత

కృష్ణవేణి--1974




రచన::C.నారాయణ రెడ్డి
సంగీతం::విజయ భాస్కర్
గానం::P.సుశీల,రామకృష్ణ


ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి
ఎందుకో నిన్ను విడిచి నిమిషమైనా నిలువలేనోయి..2

మనసులోని మమతలన్ని మల్లెపూలై విరిసె నీకై..2
వలపులన్ని పూలమాలై కురులోన కులుకె నీకై
ఎన్ని జన్మాలకైనా నీవు నాదానివేలే
ఇందుకు..సాక్షులు..గిరులు..తరులు..గిరులు..తరులు

ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి
ఎందుకో నిన్ను విడిచి నిమిషమైనా నిలువలేనోయి

నీలికన్నుల ఆలయాన నిన్ను స్వామిగ నిలుపుకోన..2
ఎల్లవేళల జీవితాన నిన్ను దేవిగా కొలుచుకోనా
గౌరిశంకరులకందం మనది విడిపోని బంధం
ఇందుకు..సాక్షులు..సూర్యుడు..చంద్రుడు..సూర్యుడు చంద్రుడు

ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి
ఎందుకో నిన్ను విడిచి నిమిషమైనా నిలువలేనోయి
ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి....

కృష్ణవేణి--1974





సంగీతం::విజయ భాస్కర్
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల


సంగీతం మధుర సంగీతం
సంగీతం మధుర సంగీతం
తల్లిపిల్లల హృదయ సంకేతం
సంగీతం మధుర సంగీతం

ముద్దుల కూనల తీయని పిలుపే తల్లికి కోకిల గానం
లలల..లలల లలల..లలల..లలల..లలల
అహహ..అహహ..ఉహుహుహు..
ముద్దుల కూనల తీయని పిలుపే తల్లికి కోకిల గానం
మదిలో మమతలే మంజుల రవళిగ మ్రోగును మోహనరాగం
సంగీతం మధుర సంగీతం
బాలపాపల ఆటలపాటలే అమ్మకు కమ్మని గీతం
ఆకశవీధుల సాగే గువ్వలు తెచ్చే ప్రేమసందేశం

సంగీతం మధుర సంగీతం
తల్లిపిల్లల హృదయ సంకేతం
సంగీతం మధుర సంగీతం

ఎన్నో నోముల పంటలు పండే ముచ్చటగొలుపు సంతానం
లలల..లలల లలల..లలల..లలల..లలల
అహహ..అహహ..ఉహుహుహుహు..
ఎన్నో నోముల పంటలు పండే ముచ్చటగొలుపు సంతానం
ఆశాఫలముల రాశులు ఎదలో చేసెను రాగసంతానం

సంగీతం మధుర సంగీతం
శోభల జీవన దీపావళిలో వెలిగెను పావన తేజం
తనివీ తీరా తనయులు చేర తల్లికి తరగని భాగ్యం

సంగీతం మధుర సంగీతం
తల్లిపిల్లల హృదయ సంకేతం
సంగీతం మధుర సంగీతం


కృష్ణవేణి--974







సంగీతం::విజయ భాస్కర్
రచన::C.నారాయణ రెడ్డి
గానం::
 P.B.శ్రీనివాస్ (సాకీ), రామకృష్ణ, P.సుశీల 

సాకీ::
అతడు:::హే..జననీ కృష్ణవేణీ..
భ్రాజిత తరంగవాణీ..
పంచపాతక హారిణీ పరమ మంగళకారిణీ
దక్షిణోర్వి దివ్యవాహినీ
అక్షీణ భాగ్యప్రదాయినీ
శ్రీశైలమల్లికార్జున దివ్యచరణ సంసేవినీ
కనకదుర్గా భవ్యకరుణాకటాక్ష సంవర్ధినీ
కనకదుర్గా భవ్యకరుణాకటాక్ష సంవర్ధినీ
కృష్ణవేణీ..కృష్ణవేణీ..
మమప్రశీద..మమప్రశీద..  

కృష్ణవేణీ..కృష్ణవేణీ..
మమప్రసీదా..మమప్రసీదా..

కృష్ణవేణీ..కృష్ణవేణీ..కృష్ణవేణీ..కృష్ణవేణీ..
కృష్ణవేణీ..తెలుగింటి విరిబోణీ..కృష్ణవేణి..నా ఇంటి అలివేణి
కృష్ణవేణీ..తెలుగింటి విరిబోణీ..కృష్ణవేణి..నా ఇంటి అలివేణి

శ్రీగిరిలోయల సాగేజాడల..2
విద్యుల్లతలు కోటి వికసింప చేసేవు..
లావణ్యలతవై నను చేరు వేళ..2
శతకోటి చంద్రికలు వెలిగించు కృష్ణవేణి..ఆ..ఆ..
కృష్ణవేణీ..తెలుగింటి విరిబోణీ..కృష్ణవేణి..నా ఇంటి అలివేణి

నాగార్జునగిరి కౌగిట ఆగి..2
బీళ్ళను బంగారు చేలగా మార్చేవు..
ఆంధ్రావనికే అన్నపూర్ణవై..
కరువులు బాపేవు బ్రతుకులు నిలిపేవు..
నాజీవ నదివై యదలోన ఒదిగి..2
పచ్చని వలపులు పండించు కృష్ణవేణి..ఆ.ఆ...
కృష్ణవేణీ..తెలుగింటి విరిబోణీ..కృష్ణవేణి..నా ఇంటి అలివేణి

అమరావతి గుడి అడుగుల నడయాడి..2
రాళ్ళను అందాల రమణులుగ తీర్చేవు..
ఏ శిల్ప రమణులు ఏ దివ్య లలనలు..2
నోచని అందాలు దాచిన కృష్ణవేణి..ఆ..ఆ..

అభిసారికవై..హంసలదీవిలో..
సాగర హృదయాన..సంగమించేవూ..
నా మేని సగమై..నా ప్రాణసుధవై..
నిఖిలము నీవై..నిలిచిన కృష్ణవేణి..
కృష్ణవేణీ..తెలుగింటి విరిబోణీ..కృష్ణవేణి..నా ఇంటి అలివే
ణి


Krishnaveni--1974
Music::Vijaya Bhaskar
Lyricis::C.Narayana Reddy
Singer's::Ramakrishna,P.Susheela

he..janani krishnaveni
raajita taranga vaani
pancha paataka haarini
parama mangala kaarini
dakshinorvi divya vaahini
aksheena bhagya pradaayini
shrishaila mallikhaarjuna divya charana samsevini
kanakadurgaa bhavya karunaa kataaksha samvardhini
krishnaveni..krishnaveni..mama praseeda mama praseeda

krishnavenee..krishnavenee..krishnavenee..krishnavenee
krishnavenee teluginti viriboni
krishnavenee na inti aliveni..(2)

srigiri loyala saage jaadala(2)
vidyullatalu koti vikasimpajesevu
laavanya latavai nanu cheru vela(2)
shatakoti chandrikalu veliginchu krishnaveni
krishnaveni

nagarjuna giri kougita aagi(2)
beellanu bangaaru cheluga marchevu
andhraavanike annapurnavai
karuvunu mapevu bratukunu nilipevu
na jeeva nadivai yedaloni odigi(2)
pachani valapulu pandinchu krishnaveni
krishnaveni

amaraavati gudi adugula nadayaadi(2)
raallanu andaala ramanuluga teerchevu
ye shilpa ramanulu ye divya lalanalu
nochani andaalu daachina krishaveni
abhisarikavai hamsala deevilo
saagara hrudayana sangaminchevu
na meni sagamai na prana sudhavai(2)

nikhilamu neevai nilichina krishnaveni

కృష్ణవేణి--1974






సంగీతం::విజయ భాస్కర్
రచన::C.నారాయణ రెడ్డి
గానం::P.సుశీ


శ్రీశైలా మల్లయ్య..శ్రీశైలా మల్లయ్య దైవమే నీవయ్య
శ్రీ భ్రమరాంబతో వెలసిన జంగమయ్యా..
శ్రీశైలా మల్లయ్య.. దైవమే నీవయ్య..

ఇదియే దక్షిణ కైలాసము..ఇది నాగార్జున నివాసం
ఇదియే దక్షిణ కైలాసము..ఇది నాగార్జున నివాసం
ఇందున్న శిలలే
ఇందున్న శిలలే శివలింగాలు..సెలయేళ్ళన్ని దివ్యతీర్థాలు
శ్రీశైలా మల్లయ్య.. దైవమే నీవయ్య..

వరుస వేదుల రాశి ప్రత్యక్ష కాశీ..పాతాళ గంగకు కాణాచి
వరుస వేదుల రాశి ప్రత్యక్ష కాశీ..పాతాళ గంగకు కాణాచి
ఈ శిఖర దర్శనమే
ఈ శిఖర దర్శనమే పాపహారము..భక్త కోటికి జన్మ పావనము
శ్రీశైలా మల్లయ్య

పర్వతుడు నిను గొల్చి మెప్పించగా..చంద్రవతి మల్లెపూల పూజింపగా
పర్వతుడు నిను గొల్చి మెప్పించగా..చంద్రవతి మల్లెపూల పూజింపగా
మల్లిఖార్జున రూపమై
మల్లిఖార్జున రూపమై నిలిచావులే..తెలుగు గడ్డకు ముక్తి నిచ్చావులే

శ్రీశైలా మల్లయ్య..శ్రీశైలా మల్లయ్య దైవమే నీవయ్య
శ్రీ భ్రమరాంబతో వెలసిన జంగమయ్యా
శ్రీశైలా మల్లయ్య.. దైవమే నీవయ్య...