సంగీతం::చక్రవర్తి
రచన::సినారె
గానం::P.సుశీల
పల్లవి::
మీటి చూడు నీ హృదయాన్నీ..పలుకుతుంది ఒక రాగం
మీటి చూడు నీ హృదయాన్నీ..పలుకుతుంది ఒక రాగం
తరచి చూడు నీ గతాన్నీ మెదులుతుంది ఒక రూపం
ఆ రూపం ఎవ్వరిదో..ఆ రాగం ఎక్కడిదో
తెలుసుకొంటే చాలును..నీ కలత తీరి పోవును
చరణం::1
పూడిపోయిన గొంతులా..ఓడిపోయిన గుండెలా
పూడిపోయిన గొంతులా..ఓడిపోయిన గుండెలా
నీలో..ఊపిరాడక ఉన్నదీ...
హృదయమే అర్పించుకొన్నదీ..హృదయమే అర్పించుకొన్నదీ
ఆ రూపం ఎవ్వరిదో..ఆ రాగం ఎక్కడిదో
తెలుసుకొంటే చాలును..నీ కలత తీరి పోవును
చరణం::2
పూవులోని పిందెలా..పిందలోని తీపిలా
పూవులోని పిందెలా..పిందలోని తీపిలా
నీలో..లీనమైనది..కానరానిదీ
నీ పదము తానై మూగపోయినదీ..మూగపోయినదీ
ఆ రూపం ఎవ్వరిదో..ఆ రాగం ఎక్కడిదో
తెలుసుకొంటే చాలును..నీ కలత తీరి పోవును
చరణం::3
మనసు మూలలు వెతికి చూడూ..మరుగు పొరలను తీసి చూడు
మనసు మూలలు వెతికి చూడూ..మరుగు పొరలను తీసి చూడు
ఏదో ..మబ్బుమూసి..మసక కమ్మి..
మమత మాయక ఉన్నది..నీ మమత మాయక ఉన్నదీ
మీటి చూడు నీ హృదయాన్నీ..పలుకుతుంది ఒక రాగం
మీటి చూడు నీ హృదయాన్నీ..పలుకుతుంది ఒక రాగం
తరచి చూడు నీ గతాన్నీ మెదులుతుంది ఒక రూపం
ఆ రూపం ఎవ్వరిదో..ఆ రాగం ఎక్కడిదో
తెలుసుకొంటే చాలును..నీ కలత తీరి పోవును
No comments:
Post a Comment