Thursday, August 05, 2010

ప్రేమ బంధం--1976

















సంగీతం::K.V.మహాదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
డైరెక్టర్::K.విశ్వనాథ్   
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::శోభంబాబు,వాణిశ్రీ,సత్యనారాయణ,రావికొండలరావు,జయమాలిని,జానకి 

పల్లవి::

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
లలరరలలరరలలరరరా మ్మ్ హుహూ 

చేరేదెటకో తెలిసి..చేరువకాలేమని..తెలిసి
చెరిసగమయినామందుకో.ఓ ఓ ఓ..తెలిసి తెలిసి తెలిసి
కలవని తీరాల నడుమ..కలకల సాగక యమునా
వెనుకకు తిరిగి పోయిందా..మనవు గంగతో మానిందా
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్..  
చేరేదెటకో తెలిసి..చేరువకాలేమని తెలిసి
చెరిసగమయినామందుకే..ఏఏఏ..తెలిసి తెలిసి తెలిసి 

చరణం::1

జరిగిన కథలో బ్రతుకు తెరువులో 
దారికి అడ్డం తగిలావూ..ఊ ఊ
ముగిసిన కథలో మూగ బ్రతుకులో..ఓ 
నా దారివి నీవయి మిగిలావూ..ఊ

పూచి పూయని పున్నమలో 
ఎద దోచి తోడువై పిలిచావు
గుండెలు రగిలే ఎండలలో 
నా నీడవు నీవై నిలిచావు 

ఆ ఆ ఆఅ ఆఅ ఆఅ
చేరేదెటకో తెలిసి చేరువకాలేమని తెలిసి
చెరిసగమయినామందుకే..ఏఏఏ..తెలిసి తెలిసి తెలిసి

చరణం::2 

తూరుపు కొండల తొలి తొలి సంధ్యల 
వేకువ పువ్వు వికసిస్తుందీ..ఈ 
విరిసిన పువ్వూ..ఊ ఊ..కురిసిన తావి..ఈ
విరిసిన పువ్వూ కురిసిన తావి
మన హృదయాలను వెలిగిస్తుంది..ఈ 
చీకటి తెరలు తొలిగిస్తుంది
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్..అహ అహా ఆహ ఆహా..ఆ ఆ

Prema Bandham--1976
Music::K.V.Mahadevan
Lyrics::D.C.Narayana Reddy
Director::K.ViSvanaath   
Singer's::S.P.Baalu,P.Suseela
Cast::Sobhanbabuu,Vvanisree,Satyanarayana,Ravikondalrao,Jayamalini,Janaki 

:::

mm mm mm mm mm mm mm
lalararalalararalalarararaa mm huhoo 

cheredetako telisi cheruvakaalemani telisi
cherisagamayinaamamduko.O O O..telisi telisi telisi
kalavani teeraala naduma..kalakala saagaka yamunaa
venukaku tirigi poyindaa..manavu gangato maanindaa
mm mm mm mm mm..  
cheredetako telisi cheruvakaalemani telisi
cherisagamayinaamandukee..eee..telisi telisi telisi

:::1

jarigina kathalo bratuku teruvulo 
daariki addam tagilaavoo..oo oo
mugisina kathalo mooga bratukulo..o 
naa daarivi neevayi migilaavoo..oo

poochi pooyani punnamalo 
eda dochi tOduvai pilichaavu
gundelu ragile endalalo 
naa needavu neevai nilichaavu 

aa aa aaa aaa aaa
cheredetako telisi cheruvakaalemani telisi
cherisagamayinaamandukee..eee..telisi telisi telisi

:::2 

toorupu konDala toli toli sandhyala 
vekuva puvvu vikasistundee..ee 
virisina puvvoo..oo oo..kurisina taavi..ee
virisina puvvoo kurisina taavi
mana hrudayaalanu veligistundi..ee 
cheekati teralu toligistundi

mm mm mm mm..aha ahaa aaha aahaa..aa aa

అందమైన అనుభవం--1979


సంగీతం::M.S. విశ్వనాథన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల

పల్లవి::

హల్లో నేస్తం బాగున్నావా
హల్లో నేస్తం గుర్తున్నానా
హల్లో నేస్తం బాగున్నావా
హల్లో నేస్తం గుర్తున్నానా

నేనే నువ్వొయ్..నువ్వే నేనోయ్
నెనరు నెయ్యం మనమిద్దరమోయ్
నేనే నువ్వొయ్... నువ్వే నేనోయ్
నెనరు నెయ్యం మనమిద్దరమోయ్
మినిజూగా ఫ్రండ్స్‌ ఇన్‌ మలేషియా
అరౌండ్ ది వరల్డ్ ఫ్రండ్ షిప్ వెల్కంస్ యు
మినిజూగా ఫ్రండ్స్‌ ఇన్‌ మలేషియా
అరౌండ్ ది వరల్డ్ ఫ్రండ్ షిప్ వెల్కంస్ యౌ

హల్లో నేస్తం బాగున్నావా
హల్లో నేస్తం గుర్తున్నానా

చరణం::1

ఊగే అలపై సాగే పడవ ఒడ్డు పొడ్డు చేర్చింది
ముచ్చటలన్ని మోసే గాలి దిక్కుదిక్కులను కలిపింది
కలకల పోయే చిలుకల గుంపు వరసా వావి నేర్పింది
నేల పీటగా నింగి పందిరిగా జగతికి పెళ్ళి జరిగింది

సాయా అన్నా సింగపూరా
సాయారుక మలేషియా
సాయారేమో ఇండియా
సాయావాడ చైనా

హల్లో నేస్తం బాగున్నావా
హల్లో నేస్తం గుర్తున్నానా

చరణం::2

ఏ కళ్ళైనా కలిసాయంటే కలిగేదొకటే అనురాగం
ఏ మనసైనా తెరిసాయంటే తెలిపేదొకటే ఆనందం
సరిగమలైనా డొరనిపలైనా స్వరములు ఏడే గానంలో
పడమటనైనా తూరుపునైనా స్పందన ఓకటే హృదయంలో

సాయా అన్నా సింగపూరా
సాయారుక మలేషియా
సాయారేమో ఇండియా
సాయావాడ చైనా
హల్లో నేస్తం బాగున్నావా..హల్లో నేస్తం గుర్తున్నానా

చరణం::3

చైనా ఆట..మలయా మాట..హిందూ పాట..ఒకటేను
నీ నా అన్నది మానాలన్నది నేటి నినాదం కావాలోయ్

సాయా అన్నా సింగపూరా
సాయారుక మలేషియా
సాయారేమో ఇండియా
సాయావాడ చైనా

హల్లో నేస్తం బాగున్నావా..హల్లో నేస్తం గుర్తున్నానా
నేనే నువ్వొయ్..నువ్వే నేనోయ్
నెనరు నెయ్యం మనమిద్దరమోయ్
మినిజూగా ఫ్రండ్స్‌ ఇన్‌ మలేషియా
అరౌండ్ ది వరల్డ్ ఫ్రండ్ షిప్ వెల్కంస్ యు
మినిజూగా ఫ్రండ్స్‌ ఇన్‌ మలేషియా
అరౌండ్ ది వరల్డ్ ఫ్రండ్ షిప్ వెల్కంస్ యు

అందమైన అనుభవం--1979


సంగీతం::M.S. విశ్వనాథన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు

పల్లవి::

శంభో శివ శంభో..శివ శంభో శివ శంభో
వినరా ఓరన్నా..అనెరా వేమన్న
జగమే మాయన్నా..శివ శంభో
నిన్న రాదన్న..రేపూ లేదన్న..నేడే నీదన్న..శివ శంభో

వినరా ఓరన్నా..అనెరా వేమన్న
జగమే మాయన్నా..శివ శంభో..ఓ
నిన్న రాదన్న..రేపూ లేదన్న..నేడే నీదన్న..శివ శంభో..ఓ

చరణం::1

అందాన్ని కాదన్న..ఆనందం లేదన్న
బంధాలు వలదన్న..బ్రతుకంతా చేదన్న
సిరులున్నా..లేకున్నా..చెలితోడు నీకున్నా
అడవిలో నువ్వున్నా..అది నీకు నగరంరా..ఆ..ఆ..ఆ

వినరా ఓరన్నా..అనెరా వేమన్న
జగమే మాయన్నా..శివ శంభో..ఓ..ఓ
నిన్న రాదన్న..రేపూ లేదన్న..నేడే నీదన్న..శివ శంభో..ఓ..ఓ

చరణం::2

ఈ తేటిదీ పువ్వు అని అన్నదెవరన్న
ఏ తేనె తాగిన తీపొకటేకదరన్న
నీదన్న నాదన్న..వాదాలు వలదన్న
ఏదైనా మనదన్న..వేదాన్నే చదువన్న..ఓ..ఓ
ఊరోళ్ళ సొమ్ముతో గుడికట్టి గోపన్న..ఆ
శ్రీరామ భక్తుడై పేరొందెరోరన్న
భక్తైనా రక్తైనా భగవంతుడేనన్న
ఈనాడు సుఖమన్న.. ఎవడబ్బ సొమ్మన్న

వినరా ఓరన్నా..అనెరా వేమన్న
జగమే మాయన్నా..శివ శంభో..ఓ..ఓ
నిన్న రాదన్న..రేపూ లేదన్న..నేడే నీదన్న..శివ శంభో..ఓ..ఓ