సంగీతం::సత్యం
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::కృష్ణ,నాగభూషణం,పద్మనాభం,మంజుల,జయమాలిని,మోహన్‌బాబు,త్యాగరాజు,మిక్కిలినేని
:::
అందమైనా చిన్నవాడు అలిగినా అందమే
అందమైన చిన్నవాడు..అలిగినా అందమే
పిలిచిన కొలది బిగుసుకుపోయే బింకాలింక చాలు
నంగనాచి ఆడపిల్లా..బొంకినా చెల్లులే
కాటుక కన్నుల కవ్విస్తావు..నాటకమింకా చాలు
నంగనాచి ఆడపిల్లా...బొంకినా చెల్లు ...లే..ఏ
ఆహా..ఏహే..
హే..ప్రేమ వలలోన..ప్రియుడు పడగానె..అలుసు చేస్తారు అమ్మాయిలూ..ఊ..
ఆ..ఏదొ సరదాకు..మాట అంటేను..బెట్టు చేస్తారు అబ్బాయిలూ
మారాము గారాము చాలించు
నీ మారాము గారాము చాలించూ..ఊ
నంగనాచి..ఆహా..ఆడపిల్ల..ఓహో..బొంకినా చెల్లులే
హా..ఏమి కావాలో..నీకు ఇస్తాను..మనసు నీ సొమ్ము చేసానులే
ఆ..నువ్వు కావాలి..నవ్వు కావాలి..ఇపుడె నాలోన కలవాలిలే..
నా ముద్దు ఈ పొద్దు తీరాలే
ఊ..నా ముద్దు ఈ పొద్దు తీరాలీ
అందమైన ఊ..చిన్నవాడు..ఆ..అలిగినా అందమే
కాటుక కన్నుల కవ్విస్తావు..నాటకమింకా చాలు
నంగనాచి..ఆహా..ఆడపిల్ల..ఆహా..బొంకినా చెల్లులే
ఆ..ఆహహాహా..లా ల లాలా లలలలాలలా
లాలా ఆ..లలల లలలా
లాల లాలా..లల లాలా...