Wednesday, May 14, 2008

భార్యాబిడ్డలు--1972::నటభైరవి::రాగం





సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::P.సుశీల

నటభైరవి::రాగం
(అసావేరీ~హిందుస్తానీ)

చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ
నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ

చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ
నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ

చరణం::1

మొన్న పున్నమి రాతిరి నీవొడిని నిద్దురపోతిమి
మొన్న పున్నమి రాతిరి నీవొడిని నిద్దురపోతిమి
తెల్లవారి లేచి చూచి తెల్లబోయ్యామూ..గొల్లుమన్నాము

చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ
నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ

చరణం::2

మబ్బు మబ్బు మాటున ఈ మసక చీకటి చాటున
మబ్బు మబ్బు మాటున ఈ మసక చీకటి చాటున
బిక్కు బిక్కున దిక్కులన్నీ తిరుగుతున్నామూ..
వెతుకుతున్నామూ........

చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ
నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ

చరణం::3

దారి తప్పి పోతివో నీ వారి సంగతి మరచినావో
దారి తప్పి పోతివో నీ వారి సంగతి మరచినావో
ఏ రాణి వాసములోన చేరి రాజువై నావో..
రాలేకవున్నావో...

చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ
నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ

భార్యాబిడ్డలు--1972








సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల


అందమైన తీగకు..పందిరుంటే చాలును
పైకి పైకి పాకుతుంది చినదానా
పరవశించి సాగుతుంది చినదానా..

అందమైన తీగకు..పందిరుంటే చాలును
పైకి పైకి పాకుతుంది చినదానా
పరవశించి సాగుతుంది చినదానా..

చరణం::1

గువ్వకెగిరే కోరికుంటే..రెక్కలొస్తాయీ
తప్పటడుగులే ముందు ముందు నడకలౌతాయీ
ఆశౌంటే మోడుకూడ చిగురు వేస్తుందీ
అందమునకానందమపుడే తోడువస్తుంది

అందమైన తీగకు పందిరుంటే చాలునూ
పైకి పైకి పాకుతుంది చినదానా
పరవశించి సాగుతుంది చినదానా

చరణం::2

పాదులోని తీగవంటిది పడుచుచిన్నది
పరువమొస్తే చిగురువేసి వగలు బోతుంది
మొగ్గతొడిగి మురిసిపోతూ సిగ్గుపడుతుంది
తగ్గ జతకై కళ్ళుతోనే వెతుకుతుంటుంది

అందమైన తీగకు పందిరుంటే చాలునూ
పైకి పైకి పాకుతుంది చినదానా
పరవశించి సాగుతుంది చినదానా

చరణం::3

కళ్ళు కళ్ళు కలిసినప్పుడు కలలు వస్తాయి
కన్నెపిల్ల కలలకెపుడో కాళ్ళువస్తాయి
అడుగులోన అడుగువేస్తూ అందమొస్తుంది
నడవలేని నడకలే ఒక నాట్యమౌతుంది

అందమైన తీగకు పందిరుంటే చాలునూ
పైకి పైకి పాకుతుంది చినదానా
పరవశించి సాగుతుంది చినదానా

భార్యాబిడ్డలు--1972




Chal Mohana Ranga - ANR Super Hits by Cinecurry




సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల


పల్లవి::

ఓ..ఓ..ఓ...చల్ మోహనరంగా
ఓ...చల్చల్ మోహనరంగా

రెక్కలొచ్చి రివ్వురివ్వున
ఎగిరిపోవాలి
నా రాణి కౌగిట జివ్వుజివ్వున
కరిగిపోవాలి..కరువు తీరాలి
చల్ మోహనరంగా..ఓ..ఓ..చల్ చల్ మోహనరంగా

చరణం::1

గడపలోనే నిలిచి నాకు..ఎదురొస్తుంది
ఆ కచ్చిబోతు కళ్లతోనే మింగేస్తుంది
గడపలోనే నిలిచి నాకు..ఎదురొస్తుంది
ఆ కచ్చిబోతు కళ్లతోనే మింగేస్తుంది

ఉన్నవాణ్ణి ఉన్నట్టే ఒడిలో చేర్చి
ఊపిరాడని ఊసులెన్నో..చెబుతానంటుంది
చల్ మోహనరంగా..ఓ..ఓ..చల్ చల్ మోహనరంగా

చరణం::2

పగలు ఇంకా తరగలేదని
విసుగు పడుతుంది
పొద్దుగుంకక ముందే
దీపం వెలిగిస్తుంది

పగలు ఇంకా తరగలేదని
విసుగు పడుతుంది
పొద్దుగుంకక ముందే
దీపం వెలిగిస్తుంది

పడకటింటి పాలు తానే
మరగ కాస్తుంది
ఆ పాలలో తన వలపుపాలు
కలిపేస్తుంది
చల్ మోహనరంగా..ఓ..ఓ..చల్ చల్ మోహనరంగా

చరణం::3

తలుపు మూయకే గదిలోకొచ్చి
బులిపిస్తుంది
నా తపన చూసి చిలిపినవ్వు
నవ్వుకుంటుంది

తలుపు మూయకే గదిలోకొచ్చి
బులిపిస్తుంది
నా తపన చూసి చిలిపినవ్వు
నవ్వుకుంటుంది

ఇంతసేపూ పడ్డ తొందర..ఏమయ్యిందో
చేయి పట్టుకుంటే చాలులెండని..బెట్టు చేస్తుంది
చల్ మోహనరంగా..ఓ..ఓ..చల్ చల్ మోహనరంగా
ఓహో..ఓఓఓ..ఓహో..ఓఓఓ..ఓహో..ఓఓఓ

ఇద్దరు అమ్మాయిలు--1970



ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
సంగీతం::K.V.మహాదేవన్
రచన::దాశరథిగానం::P.సుశీల
Film Directed By::S.R.Puttanna 
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,శోభన్‌బాబు,ఎస్.వి.రంగారావు,నాగయ్య,రేలంగి,సూర్యకాంతం,అల్లురామలింగయ్య,
రాజబాబు,రమాప్రభ,రుక్మిణి.

పల్లవి::

అమ్మా..ఆ 
పూవులో..గువ్వలో
వాగులో..తీగలో..
అంతట నీవేనమ్మా
అన్నిట నీవేనమ్మా
నీ వడిలో..నన్ను దాచుకోవమ్మా
నీ పాపగా నన్ను చూసుకోవమ్మా
..

పూవులో..గువ్వలో
వాగులో..తీగలో
అంతట నీవేనమ్మా
అన్నిట నీవేనమ్మా
నీ వడిలో..నన్ను దాచుకోవమ్మా
నీ పాపగా నన్ను చూసుకోవమ్మా..


చరణం::1


కొమ్మ కొమ్మపై..కుసుమములో..
కమ్మని తేనేవు నీవే నీవే..
జాలి గుండెతో..జలజలపారే
సెలఏరువూ..నీవే..
నింగిలో..నేలలో..రంగు రంగులా
హరివిల్లులో..అంతట నీవే నమ్మా
అన్నిట నీవే నమ్మా..నీవడిలో..
నన్ను దాచుకోవమ్మా..నీ పాపగా..
నన్ను చూసుకోవమ్మా...అమ్మా...

చరణం::2


సీతాకోకా చిలుకలతో
చేరి వసంతాలాడేవూ..
బంగరువన్నెల జింకలతో
చెంగు చెంగున ఎగిరేవు..
కొండలో..కోనలో..తోటలో..బాటలో..
అంతట నీవే నమ్మా
అన్నిట నీవే నమ్మా..నీవడిలో..
నన్ను దాచుకోవమ్మా..నీ పాపగా..
నన్ను చూసుకోవమ్మా


నీ చల్లని నీడే నా ఇల్లు
ఈ మూగజీవులే నావాళ్ళూ
అంతులేని నీ అందాలలోకం
అంతులేని నీ అందాల లోకం
అంతా నాదేనమ్మా...
మనసులో..మమతలో..
కనులలో..నా కలలలో..
అంతట నీవేనమ్మా..అన్నిట నీవేనమ్మా
నీ వడిలో నన్ను దాచుకోవమ్మ..
నీ పాపగా నన్ను చూసుకోవమ్మా..అమ్మా.
.

ఇద్దరు అమ్మాయిలు--1970



ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
సంగీతం::K.V.మహాదేవన్
రచన::దాశరథి
గానం::P.సుశీల
Film Directed By::S.R.Puttanna 

తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,శోభన్‌బాబు,S.V.రంగారావు,నాగయ్య,రేలంగి,సూర్యకాంతం,అల్లురామలింగయ్య,
రాజబాబు,రమాప్రభ,రుక్మిణి.

పల్లవి::

ఈ చల్లని లోగిలిలో ఈ బంగరు కోవెలలో
ఆనందం నిండాలి…అనురాగం పండాలి
అనురాగం పండాలీ...
ఈ చల్లని లోగిలిలో ఈ బంగరు కోవెలలో
ఆనందం నిండాలీ అనురాగం పండాలీ
అనురాగం పండాలీ
ఈ చల్లని లోగిలిలో

చరణం::1


పిల్లల పాపల అల్లరితో ఈ ఇల్లంతా విలసిల్లాలి
పిల్లల పాపల అల్లరితో ఈ ఇల్లంతా విలసిల్లాలి
పసుపు కుంకుమ కొల్లలుగా పసుపు కుంకుమ కొల్లలుగా
ఈ పచ్చని ముంగిట కురవాలి ఈ పచ్చని ముంగిట కురవాలి
ఈ చల్లని లోగిలిలో

చరణం::2


శుభములొసగే మందిరము
శాంతికి నిలయం కావాలీ..
శుభములొసగే మందిరము
శాంతికి నిలయం కావాలీ..
లక్ష్మీ సరస్వతి పొందికగా..ఆ..
లక్ష్మీ సరస్వతి పొందికగా
ఈ ఇంటను కాపురం వుండాలీ..
ఈ ఇంటను కాపురం వుండాలీ
ఈ చల్లని లోగిలిలో

చరణం::3


ఇల్లాలే శ్రీ అన్నపూర్ణగా ప్రతి రోజు ఒక పండుగగా
ఇల్లాలే శ్రీ అన్నపూర్ణగా ప్రతి రోజు ఒక పండుగగా
వచ్చే పోయే అతిధులతో..వచ్చే పోయే అతిధులతో
మీ వాకిలి కళకళలాడాలీ మీ వాకిలి కళకళలాడాలీ..
ఈ చల్లని లోగిలిలో ఈ బంగరు కోవెలలో
ఆనందం నిండాలి…అనురాగం పండాలి
అనురాగం పండాలీ...