Friday, January 11, 2013

దసరాబుల్లోడు--1971

సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆత్రేయ 
గానం::S.జానకి, P.సుశీల, ఘంటసాల  
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,చంద్రకళ,S.V.రంగారావు,సూర్యకాంతం,గుమ్మడి 

పల్లవి::

నల్లవాడే..అమ్మమ్మొ అల్లరి పిల్లవాడే
చిన్నవాడే..అయ్యయ్యో మన చేత చిక్కినాడే
నల్లవాడే..అమ్మమ్మొ అల్లరి పిల్లవాడే
చిన్నవాడే..అయ్యయ్యో మన చేత చిక్కినాడే

ఒలమ్మీ..చిన్న వాడనుకొని చేరదీస్తే
చిన్న వాడనుకొని..చేరదీస్తే
ముంచుతాడే..కొంప ముంచుతాడే

చరణం::1

సున్నమైన వెన్నలా మింగుతాడే
సద్ది నీళ్ళైనా చల్లలా తాగుతాడే
సున్నమైన వెన్నలా మింగుతాడే
సద్ది నీళ్ళైనా చల్లలా తాగుతాడే

వెన్న ముద్దకని ఎనకెనక వస్తాడే
వెన్న ముద్దకని ఎనకెనక వస్తాడే
వచ్చాడే వచ్చాడే వచ్చాడే
ఇచ్చాడే ఇచ్చాడే ఇచ్చాడే
వెచ్చగా ఒక్కటిచ్చి వెక్కిరించి పోతాడే
నల్లవాడే..అమ్మమ్మొ అల్లరి పిల్లవాడే
చిన్నవాడే..అయ్యయ్యో మన చేత చిక్కినాడే

చరణం::2

నెమలి ఈక పెట్టవే..డుడుం డుడుం డుం
మురళి చేతి కివ్వవే..టింగ్ టొంగ్ టింగ్ టొంగ్
అబ్బొ వాయిస్తాడిప్పుడూ..ఉండవే 
అబ్బొ వాయిస్తాడిప్పుడూ..ఉండవే
వదగొడతాడు తుప్పులు..చూడు..చూడు..చూడవే
నల్లవాడే..అమ్మమ్మొ అల్లరి పిల్లవాడే
చిన్నవాడే..అయ్యయ్యో మన చేత చిక్కినాడే


చరణం::3

ఆ ముద్దు కృష్ణుడే..ఈ మొద్దు గుమ్మడే
ఆలమంద ఎక్కడే..కోతి మూక ఉన్నదే
హహహహ...డుర్ డుర్ డుర్
ఆ ముద్దు కృష్ణుడే..ఈ మొద్దు గుమ్మడే
ఆలమంద ఎక్కడే..కోతి మూక ఉన్నదే
ఆనాడు నాకున్న ఆరువేల భామల్లో మీరిద్దరెవ్వరూ
మీలో నా ముద్దుగుమ్మ...ఎవ్వరూ
ఆనాడు నాకున్న ఆరువేల భామల్లో మీరిద్దరెవ్వరూ
మీలో నా ముద్దుగుమ్మ...ఎవ్వరూ

నువ్వా నా ముద్దుగుమ్మా..ఆ
ఐతే ఒక ముద్దు ఇమ్మా..ఆహా
నువ్వా నా ముద్దుగుమ్మా..ఆ
ఐతే ఒక ముద్దు ఇమ్మా..ఆహా
ఇవ్వనా..ఇవ్వనా..ఇచ్చింది చాలునా
ఓహోహో..కృష్ణుడు ఓ ముద్దు గుమ్మడు

నల్లవాడే..అమ్మమ్మొ అల్లరి పిల్లవాడే
చిన్నవాడే..అయ్యయ్యో మన చేత చిక్కినాడే
ఒలమ్మీ..చిన్న వాడనుకొని చేరదీస్తే
చిన్న వాడనుకొని...చేరదీస్తే 
ముంచుతాడే..కొంప ముంచుతాడే