సంగీతం::చక్రవర్తి
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల
తారాగణం::శోభన్‌బాబు,కృష్ణంరాజు,ప్రభాకర్‌రెడ్డి,పద్మనాభం,మంజుల,చంద్రకళ,రాజబాబు
రావు గోపాలరావు
పల్లవి::
సలామాలేకుం...సలామాలేకుం
నా ఓరచూపులో...కాలిగజ్జెలో
నా ఓరచూపులో కాలిగజ్జెలో లోకమున్నది మీకు
ఈ నిండు కుండలో గుండెలోతులో ఉన్నదేమిటి
చూడలేరు మీరు ఆ జాడ తెలియలేరు
చూడలేరు మీరు ఆ జాడ తెలియలేరు
సలామాలేకుం...సలామాలేకుం
చరణం::1
కన్నెగులాబికి తనతో పుట్టిన ముల్లు లేనిదే రక్షణ లేదు
తేనెను తాగివెళ్ళే తేటికి తీయని బంధం లేనేలేదు
అందాన్ని వెలపోసి కొంటారు మీరు
హృదయాన్ని వెలివేసి వచ్చాను నేను
గొంతు జీరలో అంతు దొరకని మంటలున్నవి
నేను కాలిపోతూ పాటపాడుతున్నా
నేను కాలిపోతూ పాటపాడుతున్నా
సలామాలేకుం...సలామాలేకుం
సలామాలేకుం...సలామాలేకుం
చరణం::2
రాఖీ పండుగ మీకూ కలదని రక్షాబంధం తెచ్చాను
కట్టుకునే చేయివున్నదా కలుపుకునే మనసు వున్నదా
వెలపోసి కొనలేని బంధాన్నికడతా ఈ ఒక్కరోజైన మీ చెల్లినౌతా
ఇన్నినాళ్ళ ఈ చిన్నకోరికను తీర్చుకొందును
అన్నలెవరు లేరా మనసున్నవారు లేరా
అన్నలెవరు లేరా మనసున్నవారు లేరా
సలామాలేకుం...సలామాలేకుం
సలామాలేకుం...సలామాలేకుం
నా ఓరచూపులో...కాలిగజ్జెలో
నా ఓరచూపులో కాలిగజ్జెలో లోకమున్నది మీకు
ఈ నిండు కుండలో గుండెలోతులో ఉన్నదేమిటి
చూడలేరు మీరు ఆ జాడ తెలియలేరు
చూడలేరు మీరు ఆ జాడ తెలియలేరు
సలామాలేకుం...సలామాలేకుం
సలామాలేకుం...సలామాలేకుం