సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::కోసరాజు
గానం::ఘంటసాల
సాకీ::
కన్నుమిన్ను కానరాని కాలితెరపు గిత్తరా
పట్టుకుంటే మాసిపోయే పాలపళ్ల గిత్తరా
అరెరెరెరెరెరే..ఒంటిమీద చేయి వేస్తే
ఉలికిపడే గిత్తరా..ఆఆఆఆఆఆఆఆ
పల్లవి::
హాయ్..పొగరుమోతు పోట్లగిత్తరా
ఓరయ్య..దీని చూపే సింగారమౌనురా
ఓరయ్య..దీని రూపే బంగారమౌనురా
పొగరుమోతు పోట్లగిత్తరా
ఓరయ్య..దీని చూపే సింగారమౌనురా
ఓరయ్య..దీని రూపే బంగారమౌనురా
చరణం::1
ముందుకొస్తే ఉరిమి కొమ్ములాడిస్తుంది
ఎనక్కొస్తే ఎగిరి కాలు ఝాడిస్తుంది
ఓహో..ఓ ఓ ఓ ఓ ఓ ఓ హోయ్
విసురుకుంటూ కసురుకుంటూ
ఇటూ అటూ అటూ ఇటూ డిర్‌రరర్‌ర్
కుంకిళ్లు పెడుతుంది కుప్పిగంతులేస్తుంది
పొగరుమోతు..హ్హహ్హా..పోట్లగిత్తరా
ఓరయ్య..దీని చూపే సింగారమౌనురా
ఓరయ్య..దీని రూపే బంగారమౌనురా
చరణం::2
అదిలిస్తే అంకె వేయు బెదురుమోతు గిత్తరాఆఆఅ
అరెరెరెరెరే కదిలిస్తే గంతులేసి కాండ్రుమనే గిత్తరాఆఆ
దీని నడుముతీరు చూస్తుంటే నవ్వు పుట్టుకొస్తోంది
నడక జోరు చూస్తుంటే ఒడలు పులకరిస్తోంది
అహ..
నడుముతీరు చూస్తుంటే నవ్వు పుట్టుకొస్తోంది
నడక జోరు చూస్తుంటే ఒడలు పులకరిస్తోంది
వన్నెచిన్నెల రాణి ఇవ్వాళ మంచిబోణీ డిర్ర్ర్ర్ర్ర్
వన్నెచిన్నెల రాణి ఇవ్వాళ మంచిబోణీ
నిన్నొదిలిపెడితే ఒట్టు ఈ వగలు కట్టిపెట్టు
పొగరుమోతు..హ్హహ్హా..పొగరుమోతు..పోట్లగిత్తరా
ఓరయ్య..దీని చూపే సింగారమౌనురా
ఓరయ్య..దీని రూపే బంగారమౌనురా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పొగరుమోతు...పోట్లగిత్తరా
ఓరయ్య..దీని చూపే సింగారమౌనురా
ఓరయ్య..దీని రూపే బంగారమౌనురా
పొగరుమోతు..పోట్లగిత్తరా
ఓరయ్య..దీని చూపే సింగారమౌనురా
ఓరయ్య..దీని రూపే బంగారమౌనురా..ఓ..హో...