Tuesday, September 17, 2013

పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం--1960

 


సంగీతం::.G.లింగప్ప

రచన::సముద్రాల

గానం::జానకి

Directed by::B.R.Pantulu   

తారాగణం::శివాజిగణేషన్ B.R..పంతులు,M.V.రాజమ్మా,రాజనాల,రమణారెడ్డి,కాంచన.


పల్లవి::


ఆఆఅ ఆఆఆఆ ఆఆఅ 

నగవు చిలుకుమా..ఆఆ 

నగవు చిలుకుమా..నగవు చిలుకుమా

చిన్నారి రాజా..నా మది చల్లగా

నగవు చిలుకుమా..ఆఆఆ 


చరణం::1


రాతి బొమ్మలా..నిలవ కారణమేమో

నీదు సిరులన్నీ..నిలువు దోపులాయెనా

రాతి బొమ్మలా..నిలవ కారణమేమో

నీదు సిరులన్నీ..నిలువు దోపులాయెనా

అలుకా మౌన యోగమా..అభినవ రాజ ఠీవియా

అలుకా మౌన యోగమా..అభినవ రాజ ఠీవియా

తరితీపి విరితేనె..విందులు సేతురా

నగవు చిలుకుమా..ఆఅఆఆఆఅ 

నగవు చిలుకుమా..ఆఆఅ


చరణం::2


నవ్విన ముత్యాలు..ధరను రాలునా

చివురు కెమ్మోవి..చిలుక కొరికి వేయునా

నవ్విన ముత్యాలు..ధరను రాలునా

చివురు కెమ్మోవి..చిలుక కొరికి వేయునా

తరుగని ఉదర శూలయో..ననుగని పగలు పోయెదో

తరుగని ఉదర శూలయో..ననుగని పగలు పోయెదో

అంజూర దానిమ్మ..కానుక సేతురా


నగవు చిలుకుమా..ఆఅ..నగవు చిలుకుమా

నగవు చిలుకుమా..చిన్నారి రాజా

నా మది చల్లగా..నగవు చిలుకుమా