సంగీతం::K.V.మహదేవన్ రచన::ఆచార్య ఆత్రేయ గానం::ఘంటసాల , బృందం తారాగణం::N.T. రామారావు, అంజలీదేవి,నాగయ్య, రాజబాబు, కృష్ణంరాజు పల్లవి:: భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు ఆసేతుహిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు ఆసేతుహిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు చరణం::1 త్రివేణి సంగమ పవిత్రభూమి నాల్గు వేదములు పుట్టిన భూమి నాల్గు వేదములు పుట్టిన భూమి త్రివేణి సంగమ పవిత్రభూమి నాల్గు వేదములు పుట్టిన భూమి గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి పంచశీల బోధించిన భూమి భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు చరణం::2 శాంతిదూతగా వెలసిన బాపూ జాతి రత్నమై వెలిగిన వెహ్రూ శాంతిదూతగా వెలసిన బాపూ జాతి రత్నమై వెలిగిన వెహ్రూ విప్లవ వీరులు..వీర మాతలు విప్లవ వీరులు..వీర మాతలు ముద్దుబిడ్డలై మురిసే భూమి భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు చరణం::3 సహజీవనము సమభావనము సమతా వాదము వేదముగా సమతా వాదము వేదముగా సహజీవనము సమభావనము సమతా వాదము వేదముగా ప్రజా క్షేమము ప్రగతి మార్గము..లక్ష్యములైన విలక్షణ భూమి లక్ష్యములైన విలక్షణ భూమి భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
సంగీతం::K.V.మహదేవన్ రచన::ఆచార్య ఆత్రేయ గానం::ఘంటసాల తారాగణం::N.T రామారావు, అంజలీదేవి,నాగయ్య, రాజబాబు, కృష్ణంరాజు పల్లవి:: ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు తోడు నీడగా వుండే వయసున గూడు విడిచి వేరైనారు గూడు విడిచి వేరైనారు ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు చరణం::1 జంటను వీడిన ఒంటరి బ్రతుకై జాలిగ కుమిలేరు జంటను వీడిన ఒంటరి బ్రతుకై జాలిగ కుమిలేరు ఎదలోదాగిన మూగ వేదన ఎవరికి చెప్పేరు..ఎలా భరించేరు ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు చరణం::2 ఒకే తనువుగ ఒకే మనువుగా ఆ దంపతులు జీవించారు ఒకే తనువుగ ఒకే మనువుగ ఆ దంపతులు జీవించారు ఆస్తిపాస్తివలె అన్నదమ్ములు ఆ తలిదండ్రుల పంచారు ఆ తలిదండ్రుల పంచారు ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు
సంగీతం::పెండ్యాల నాగేశ్వర రావు రచన::దేవులపల్లి కృష్ణ శాస్త్రీ గానం::S.P.బాలు,P.సుశీల Film Directed By::N.T.Rama Rao తారాగణం::N.T.రామారావు,జయప్రద,జయసుద,సత్యనారాయణ,అంజలీ దేవి,గుమ్మడి,జయచిత్ర పల్లవి:: ఇది నా..హృదయం ఇది నీ..నిలయం ఇది సురముని యోగీశ్వరుల చూపులకు అందని..ఆనందాలయం ఇది నా..హృదయం ఇది నీ..నిలయం ఇది సురమునియోగీశ్వరుల చూపులకు అందని ఆనందాలయం..ఇది నా హృదయం చరణం::1 ఇది నా "శ్రీ" నివాసం..ఆ ఆ ఆ ఆ ఆ ఇది..నీ రాణి వాసం..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ ఇది నా "శ్రీ" నివాసం..మ్మ్ ఇది నీ రాణి వాసం..మ్మ్ నాపై నీకింత అనురాగమా? నా పై మీకింత ఆదరమా? ఇది నీ ప్రణయ డోళ ఇది నా ప్రభువుని లీలా..ఆ..ఆ..ఆ..ఆ ఇది నా..హృదయం..మ్మ్ ఇది నీ..నిలయం..మ్మ్ ఇది సురమునియోగీశ్వరుల చూపులకు అందని ఆనందాలయం..ఇది నా హృదయం చరణం::2 ఎల్లలోకముల ఏలేవారికి ఈడా..జోడా ఈ సిరి?..మ్మ్ ఊ వికుంఠపురిలో విభువక్షస్థలి విడిది చేయు నా దేవేరి ఇది నా...భాగ్యం ఇది మన...భోగం ఇది నా..హృదయం ఇది నీ..నిలయం ఇది సురముని యోగీశ్వరుల చూపులకు అందని ఆనందాలయం..ఇది నా హృదయం Sri Tirupati Venkateswara Kalyanam--1979 Music::Pendyala Nageswara Rao Lyrics::Devulapalli Krishna Sastrii Singer's::S.P.Baalu,P.Suseela Film Directed By::N.T.Rama Rao Cast::N.T.Rama Rao,Jayaprada,Jayasudha,Jayachitra, Kaikala Satyanarayana,Anjalidevi,Gummadi. ::::::::::::::: idi naa..hRdayam idi nee..nilayam idi suramuni yOgeeSvarula choopulaku andani..aanandaalayam idi naa..hRdayam idi nee..nilayam idi suramuniyOgeeSvarula choopulaku andani aanandaalayam..idi naa hRdayam ::::1 idi naa "Sree" nivaasam..aa aa aa aa aa idi..nee raaNi vaasam..mm^ mm^ mm^ mm^ idi naa "Sree" nivaasam..mm^ idi nee raaNi vaasam..mm^ naapai neekinta anuraagamaa? naa pai meekinta aadaramaa? idi nee praNaya DOLa idi naa prabhuvuni leelaa..aa..aa..aa..aa idi naa..hRdayam..mm idi nee..nilayam..mm idi suramuniyOgeeSvarula choopulaku andani aanandaalayam..idi naa hRdayam ::::2 ellalOkamula ElEvaariki eeDaa..jODaa ee siri?..mm oo vikunThapurilO vibhuvakshasthali viDidi chEyu naa dEvEri idi naa...bhaagyam idi mana...bhOgam idi naa..hRdayam idi nee..nilayam idi suramuni yOgeeSvarula choopulaku andani aanandaalayam..idi naa hRdayam
సంగీతం::K.V.మహదేవన్ రచన::ఆరుద్ర గానం::P.సుశీల పల్లవి:: మహబలిపురం మహబలిపురం మహబలిపురం భారతీయ కళాజగతికి ఇది గొప్ప గోపురం కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు మహబలిపురం మహబలిపురం మహబలిపురం భారతీయ కళాజగతికి ఇది గొప్ప గోపురం కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు మహబలిపురం మహబలిపురం మహబలిపురం చరణం::1 కంచి రాజధానిగా పాలించాడు ఇది మంచిరేవు పట్నంగా కట్టించాడు కంచి రాజధానిగా పాలించాడు ఇది మంచిరేవు పట్నం గా కట్టించాడు తెలుగుసీమ శిల్పులుని రప్పించాడు తెలుగుసీమ శిల్పులుని రప్పించాడు పెద్ద శిలలన్ని శిల్పాలుగా మార్పించాడు మహబలిపురం మహబలిపురం మహబలిపురం చరణం::2 పాండవుల రథాలని పేరుపడ్డవి ఏకాండి శిలలనుండి మలచపడ్డవి పాండవుల రథాలని పేరు పడ్డవి ఏకాండి శిలలనుండి మలచపడ్డవి వీటిమీద బొమ్మలన్ని వాటమైనవి వీటిమీద బొమ్మలన్ని వాటమైనవి తాము సాటిలేని వాటిమంటు చాటుతున్నవి తాము సాటిలేని వాటిమంటు చాటుతున్నవి మహబలిపురం మహబలిపురం మహబలిపురం మహిషాసురమర్ధనం..గోవర్ధనమెత్తడం మహిషాసురమర్ధనం..గోవర్ధనమెత్తడం మహావిష్ణు వరాహంగా అవతారం దాల్చటం మహావిష్ణు వరాహంగా అవతారం దాల్చటం పురాణాల ఘట్టాలు పొందుపర్చిరి పురాణాల ఘట్టాలు పొందుపర్చిరి ముచ్చటగా కన్నులకు విందునిచ్చిరి మహబలిపురం మహబలిపురం మహబలిపురం చరణం::3 పాశుపతం కోరెను పార్ధుని మనసు పరమశివుని కోసము చేసెను తపస్సు పాశుపతం కోరెను పార్ధుని మనసు పరమశివుని కోసము చేసెను తపస్సు సృష్టంతా కదలి వచ్చి చూడసాగెను సృష్టంతా కదలి వచ్చి చూడసాగెను ప్రతి సృష్టి ఈ శిల్పమని పేరు వచ్చెను ప్రతి సృష్టి ఈ శిల్పమని పేరు వచ్చెను మహబలిపురం మహబలిపురం మహబలిపురం సంద్రంలో కలసినవి కలసిపోయేను ఒంటరిగా ఈ కోవెల మిగిలిపొయేను సంద్రంలో కలసినవి కలసిపోయేను ఒంటరిగా ఈ కోవెల మిగిలిపొయేను దేవుని పాదాలను కెరటాలు కడుగును నిత్యం పాదాలను కెరటాలు కడుగును నిత్యం మనుషుల పాపాలు ఇది చూడ తొలగను సత్యం సత్యం పాపాలు ఇది చూడ తొలగను సత్యం సత్యం మహబలిపురం మహబలిపురం మహబలిపురం భారతీయ కళాజగతికి ఇది గొప్ప గోపురం కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు మహబలిపురం మహబలిపురం మహబలిపురం