సంగీతం::T.చలపతి రావు
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు
పల్లవి::
అహా..ఏహే..ఓహో..అబ్బబ్బబ్బా
ఆకాశం నుండి..నాకోసం వచ్చావా
పొంగే అందాల మిఠాయి..పొట్లం తెచ్చావా
ఆకాశం నుండి..నాకోసం వచ్చావా
పొంగే అందాల మిఠాయి..పొట్లం తెచ్చావా
నువు పక్కపక్కగా వుంటే..నే స్వర్గం దున్నేస్తా
నువు పక్కపక్కగా వుంటే..నే స్వర్గం దున్నేస్తా
నువు కనపడకుండా పోతే..ఏ..బాల్చీ తన్నేస్తా
ఆకాశం నుండి..నాకోసం వచ్చావా
పొంగే అందాల మిఠాయి..పొట్లం తెచ్చావా
చరణం::1
నీ జడపిన్ను నా తలరాతకు పెన్ను
నీ సిగపువ్వు..అదేవిటమ్మా.. ఆబుజ బుజ రేకుల లవ్వు
నీ చిలిపి బిడియం అమృతంలో..ఊరిన వడియం
నీ పెదవులు రెండు..నా ముక్కుకు దొండపండ్లు
ఓహో..ఓ..రోజా..తెగ ఉక్కిరిబిక్కిరి ఔతున్నాడీ..రాజా
ఆకాశం నుండి..నాకోసం వచ్చావా
పొంగే అందాల మిఠాయి..పొట్లం తెచ్చావా
చరణం::2
నీ లేడికళ్ళు నాకు..వేస్తాయి సంకెళ్లు
నీ లేత ఒళ్లు చూస్తే..నాకు ఎక్కిళ్లు
నీకు నేను ముద్దులబందీ..నన్ను పెట్టకే ఇబ్బంది
నీకు నేను ముద్దులబందీ..నన్ను పెట్టకే ఇబ్బంది
ఆ..అహా..
నీకంతా చెలగాటం..నాకెంతో ఇరకాటం
నీకంతా చెలగాటం..నాకెంతో ఇరకాటం
ఓహో..రోజా..ఓ..తెగ ఉక్కిరిబిక్కిరి ఔతున్నాడీ..రాజా
చరణం::3
అందాల ఓ రామచిలక..నేనౌతున్నా నెందుకే తికమక
ఈ దేవదాసు లైలా వేనా..హాయ్..లైలా
ఈ మజునూ పార్వతి వేనా..ఓ పారూ
అయ్యో బుల్ బుల్..నాకెందుకే ఈ ట్రబుల్…