సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు
తారాగణం::S.V. రంగారావు,కృష్ణ, కృష్ణంరాజు,చంద్రమోహన్,రాజబాబు,విజయనిర్మల,రాజశ్రీ,విజయ లలిత
పల్లవి::
ఇంతలేసి కళ్ళతో..అంతలేత మనసుతో
ఇంతలేసి కళ్ళతో..అంతలేత మనసుతో
చేస్తున్నా వింత వింతగారడి రోజూ చూస్తున్నా
కొత్తగానె వున్నది హాయ్ కొత్తగానె వున్నది
ఇంతలేసి కళ్ళతో అంతలేత మనసుతో
చేస్తున్నా వింత వింతగారడి రోజూ చూస్తున్నా
కొత్తగానె వున్నది హాయ్ కొత్తగానె వున్నది
చరణం::1
మెరుపువంటి చూపుల్లో మిసమిసలూ చూస్తుంటే
తడి పెదవులు తళతళమని తడబడుతూ పిలుస్తాయి
మెరుపువంటి చూపుల్లో మిసమిసలూ చూస్తుంటే
తడి పెదవులు తళతళమని తడబడుతూ పిలుస్తాయి
కదలాడే పెదవులాడు కబురులేవో వినబోతే
కదలాడే పెదవులాడు కబురులేవో వినబోతే
చెక్కిలిపై నొక్కువచ్చి చిదిమి చూడమంటుంది
ఇంతలేసి కళ్ళతో అంతలేత మనసుతో
చేస్తున్నా వింత వింతగారడి రోజూ చూస్తున్నా
కొత్తగానె వున్నది ఆహా కొత్తగానె వున్నది
చరణం::2
ముందరున్న అందాన్ని మోజుతీర చూస్తుంటే
వెనుకనున్న విరజాజులు విరిసి గుప్పుమంటాయి
ముందరున్న అందాన్ని మోజుతీర చూస్తుంటే
వెనుకనున్న విరజాజులు విరిసి గుప్పుమంటాయి
వెనుకముందు లాడుతు నే వెర్రెత్తి పోతూంటే
మిడిసిపడే పడుచుదనం గడుసునవ్వు నవ్వుతుంది
ఇంతలేసి కళ్ళతో అంతలేత మనసుతో
చేస్తున్నా వింత వింతగారడి రోజూ చూస్తున్నా
కొత్తగానె వున్నది హాయ్ రోజూ కొత్తగానె వున్నది