Wednesday, December 01, 2010

మానవుడు దానవుడు--1972

















సంగీత::అశ్వద్ధామ
రచన::ఉషః శ్రీ
గానం::L.R.ఈశ్వరి,పిఠాపురం నాగేశ్వరరావు
తారాగణం::శోభన్ బాబు,సత్యనారాయణ,శారద, కృష్ణకుమారి,జ్యోతిలక్ష్మి,ముక్కామల,రాజబాబు

పల్లవి::
ఆహా హా హా హా..మావా 
కొప్పుచూడు కొప్పందం చూడు
కొప్పున వున్న పూలను చూడు
కొప్పుచూడు కొప్పందం చూడు
కొప్పున వున్న పూలను చూడు
మగడా నే మునుపటి వలెనే లేనా..ఓ ఓ 
మగడా నే మునుపటి వలెనే లేనా 

అహా..అలాగా
కొప్పులో పూలెక్కడివే?
నీ కొప్పులో పూలెక్కడివే?
ఆహా హా..ఏయ్..హా...అవా
ఆ..అవే..
కట్టెలకోస మెళితే నే కట్టెలకోసమెళితే
కొమ్మతగిలి కొప్పు నిండింది మావా
ఆ ఆ ఆ ఆ..
కొమ్మతగిలి కొప్పు నిండింది మావా

ముక్కు చూడు ముక్కందంచూడు
ముక్కున వున్న ముక్కెరచూడు
హ్హా..ముక్కు చూడు ముక్కందంచూడు
ముక్కున వున్న ముక్కెరచూడు
మగడా నే మునుపటివలెనే లేనా..ఓ ఓ ఓ 
మగడా నే మునుపటివలెనే లేనా..ఆ..ఆహా

బుగ్గమీద గాటెక్కడిదే..నీ బుగ్గమీద గాటెక్కదిదే?
ఆహా హా..ఏయ్..హా..దా..ఆ అదే

కోమటింటికెళితే నే బెల్లం తూయమంటే
కోమటింటికెళితే నే బెల్లం తూయమంటే
తక్కెట్లో రాయొచ్చి తగిలింది మావా
ఆ ఆ ఆ ఆ..
తక్కెట్లో రాయొచ్చి తగిలింది మావా

నడుముచూడు నడుమందంచూడు
నడుమునవున్న బిగువునుచూడు
నడుముచూడు నడుమందంచూడు
నడుమునవున్న బిగువునుచూడు
మగడా నే మునుపటివలెనే లేనా
 ఓ ఓ ఓ ఓ ఓ..
మగడా నే మునుపటివలెనే లేనా..ఆ..అదిసరే 
గంపకింద వాడెవడే..యీ గంపకింద వాడెవడే
ఆహా హా హా..ఏయ్..వాడా..ఆ వాడే 
పక్కింటి పోరగాడు..పెట్టాను పట్టబోయి 
కోడిపెట్టాను...పట్టబోయి
గంపకింద నక్కి నక్కి కూకున్నాడు మావా
ఈ గంపకింద నక్కి నక్కి కూకున్నాడు మావా