Friday, September 12, 2008

జ్యోతి--1976



సంగీతం::చక్రవర్తి
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::సుశీల

రాగం::

ఏడు కొండలపైన ఏలవెలిసావు
ఎవరికీ అందక ఎందుకున్నావు
ఏడు కొండలపైన ఏలవెలిసావు
ఎవరికీ అందక ఎందుకున్నావు
తెలియనివారికి తెలుపర స్వామీ
తెలియనివారికి తెలుపర స్వామీ
కన్నులపొరలను తొలగించవేమి
ఏడుకొండలపైన ఏల వెలిసావు
ఎవరికీ అందక ఎందుకున్నావు

ఎక్కడో ఎవరికో ముడివేసిపెడతావు
ఏముడిని ఎందుకో విడదీసిపోతావూ
ఎక్కడో ఎవరికో ముడివేసిపెడతావు
ఏముడిని ఎందుకో విడదీసిపోతావూ
అస్తవ్యస్తాలుగా కనుపించు నీ లీలలు
ఆ..ఆ..అ..అస్తవ్యస్తాలుగా కనుపించు నీ లీలలు
ఏ అర్థమున్నదో..ఏసత్యమున్నదో
తెలియనివారికి తెలుపర స్వామీ
కన్నులపొరలను తొలగించవేమి
ఏడు కొండలపైన ఏలవెలిసావు
ఎవరికీ అందక ఎందుకున్నావు

పాపిష్టి ధనముకై ఆశపడుతున్నావో
ఏనాటి రుణమునూ తీర్చుకోంటున్నావో..ఓఓ..
పాపిష్టి ధనముకై ఆశపడుతున్నావో
ఏనాటి రుణమునూ తీర్చుకోంటున్నావో
రెండుప్రేమల మధ్య బండగా మారావు
స్వామీ..రెండుప్రేమల మధ్య బండగా మారావు
రేపులేని నీకు దోపిడి ఎందుకో..ఓఓ..
తెలియనివారికి తెలుపర స్వామీ
కన్నులపొరలను తొలగించవేమి
ఏడు కొండలపైన ఏలవెలిసావు
ఎవరికీ అందక ఎందుకున్నావు

జ్యోతి--1976



సంగీతం::చక్రవర్తి
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::SP.బాలు,S.జానకి

నీకూ నాకూ పెళ్ళంట
నింగికి నేలకు కుళ్ళంట
నీకూ నాకూ పెళ్ళంట
నింగికి నేలకు కుళ్ళంట

ఎందుకంటా?
యుగయుగాలుగా ఉంటున్నా
అవి కలిసిందెపుడూ లేదంటా

అలాగా..

నీకూ నాకూ పెళ్ళంట
నదికీ కడలికి పొంగంట
నీకూ నాకూ పెళ్ళంట
నదికీ కడలికి పొంగంట

ఎందుకంటా?
యుగయుగాలుగా వేరైనా
అవి కలవనిదెపుడూ లేదంట


నీకూ నాకూ పెళ్ళంట
నింగికి నేలకు కుళ్ళంట
నదికీ కడలికి పొంగంట


ప్రతి రేయి మనకొక తొలిరేయంట
ఆ…..
తొలిముద్దు పెదవులు విడిపోవంట
ఆ….
జగతికంతటికీ మన జంటే జంట
ఇరు సంధ్యలను ఒకటిగ చేస్తామంట
ఆ..నా కంట నిను చూసుకుంటా
ఆ..నీ చూపు నా రేపు పంట

ఆ…ఆ…

నీకూ నాకూ పెళ్ళంట
నింగికి నేలకు కుళ్ళంట
నీకూ నాకూ పెళ్ళంట
నదికీ కడలికి పొంగంట


మన కోర్కెలన్నీ పసిపాపలంట
ఆ..ఆ…చిగురాకు మనసుల చిరునవ్వులంట
ఆ..ఆ…
వయసు లేనిది మన వలపేనంట
మనజీవితము ఆటాపాటెనంట
ఆ..నాలోన నిను దాచుకుంటా
ఆ..నీ ఊపిరై కాచుగుంట

ఆ..ఆ…

నీకూ నాకూ పెళ్ళంట
నదికీ కడలికి పొంగంట
యుగయుగాలుగా వేరైనా
అవి కలవనిదెపుడూ లేదం

నీకూ నాకూ పెళ్ళంట
నదికీ కడలికి పొంగంట

జ్యోతి--1976::రాగం::యదుకుల కాంభోజి



సంగీతం::చక్రవర్తి
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::SP.బాలు,జానకి

రాగం::యదుకుల కాంభోజి::

(పహడి)

సిరిమల్లెపూవల్లే నవ్వూ
చినారి పాపల్లే నవ్వూ
చిరకాలముండాలి ఈ నవ్వూ
చిగురిస్తు వుండాలి..ఆ నవ్వూ..ఆ నవ్వూ

సిరిమల్లెపూవల్లే నవ్వూ
చినారి పాపల్లే నవ్వూ..నవ్వూ


పనిసా..అ..హా..హా..
సగమా..అ..హ..హా..గమపా..
నినిపమగమగమపా..ఆ..ఆ..ఆ..ఆఆ..
ఆ..చిరుగాలి తరగల్లే మెలమెల్లగా
సెలయేటి నురగల్లే తెల్ల తెల్లగా..
చిరుగాలి తరగల్లే మెలమెల్లగా
సెలయేటి నురగల్లే తెల్ల తెల్లగా
చిననాటి కలలన్నీ తియతీయగా
ఎన్నెన్నో రాగాలు రవళించగా..రవళించగా
మ్మ్మ్మ్..ఆ..హా..

సిరిమల్లెపూవల్లే నవ్వూ
చినారి పాపల్లే నవ్వూ..నవ్వూ

నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా
ఆ వెలుగులో నేను పయనించగా..ఆ..
నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా
ఆ వెలుగులో నేను పయనించగా
ఆ..ఆ..ఆ..ఆ..ఆఆఆ...
వెలుగుతూ వుంటాను నీ దివ్యగా..ఆ..
వెలుగుతూ వుంటాను నీ దివ్యగా
నే మిగిలి వుంటాను తొలి నవ్వుగా..తొలినవ్వుగా

సిరిమల్లెపూవల్లే నవ్వూ
చినారి పాపల్లే నవ్వూ
చిరకాలముండాలి ఈ నవ్వూ
చిగురిస్తు వుండాలి ఆ నవ్వూ..ఆ నవ్వూ
సిరిమల్లెపూవల్లే నవ్వూ
చినారి పాపల్లే నవ్వూ..నవ్వూ





Jyothi--1976
Music::Chakravarthy
Lyricist::Aacharya Aathreya
Singers::S.P.Balu, S.Janaki

Sirimalle puvalle navvu
chinnari papalle navvu
chirakalamundali nee navvu
chiguristu vundali na nuvvu..na nuvvu 
Sirimalle puvalle navvu
chinnari papalle navvu..nvvu
panisa..hahaha..sagama..hahaha..gamapa..hahaha
ninisapama..gamagamapa..hahaha

Chirugali taragalle mela mellagaa
selayeti nurugalle tela tellagaa
Chirugali taragalle mela mellagaa
selayeti nurugalle tela tellagaa
chinanati kalalalle tiyatiyyagaa
yennenno raagalu ravalinchagaa
ravalinchagaa..

Sirimalle puvalle navvu
chinnari papalle navvu..nvvu

Ne pedavipai navvule kempugaa aa.
Ne kanulalo nuvvu teli merupugaa aa
Chekkillapai navvu nunu siggugaa
Chekkillapai navvu nunu siggugaa
paruvanni vudikinchi vurikinchagaa
urikinchagaa..

Sirimalle puvalle navvu..
chinnari papalle navvu..nvvu

Ne navvu na bratuku veliginchagaa
aa velugulo nenu payaninchagaa
Ne navvu na bratuku veliginchagaa
aa velugulo nenu payaninchagaa
aa..aa..
Velugutu vuntanu ne divvegaa
Velugutu vuntanu ne divvegaa
ne migili vuntanu tholi navvugaa
tholi navvugaa..                   

Sirimalle puvalle navvu
chinnari papalle navvu
chirakalamundali nee navvu
chiguristu vundali na nuvvu..na nuvvu
Sirimalle puvalle navvu..
chinnari papalle navvu..nvvu..