Friday, July 27, 2007

కాలం మారింది--1972




సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::దాశరధి
గానం::ఘంటసాల,P.సుశీల


సాకి::

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ 
తొలకరి మెరుపులా..ఆఆ..తొలివాన చినుకులా
ఏ వేళ వచ్చావు ఎవరికోసం 
ఇంకెవరి కోసం..మ్మ్..
ఏమేమి తెచ్చావు ఈ బావ కోసం

పల్లవి::

సన్నజాజి సొగసుంది జున్నులాంటి వయసుంది
నిన్ను చూస్తే కరిగిపోయే వెన్నలాంటి మనసుంది
ఇంతకు మించి ఏమి లేదురా బావా
ఈ బతుకే ఇంక నీదిరా బావా
ఈ బతుకే ఇంక నీదిరా

సన్నజాజి సొగసుంటే జున్నులాంటి వయసుంటే
నన్ను చూస్తే కరిగిపోయే వెన్నలాంటి మనసుంటే
అంతకు మించి ఏమి వద్దులే పిల్లా
ఆ బతుకే ఎంతో ముద్దులే పిల్ల
ఆ బతుకే ఎంతో ముద్దులే

చరణం::1

బంగారు నగలేవి పెట్టుకోనురా
పట్టంచు చీరలేవి కట్టుకోనురా
గుండెలో మొలకెత్తే గోరువెచ్చని వలపే
గుండెలో మొలకెత్తే గోరువెచ్చని వలపే
పెదవుల భరిణలో పొదిగి ఉంచినానురా
ఇంతకు మించి ఏమి లేదురా బావా
ఈ వలపే ఇంక నీదిరా..ఆ..

మిసమిసలాడే నీ మేనే బంగారం
సిగ్గే కంచి పట్టు చీరకన్న సింగారం
నీ పెదవులు చిలికే తేనియ వలపే
పెదవులు చిలికే తేనియ వలపే
ముద్దుల మూటలో ముడిచి దాచుకుందునే
అంతకు మించి ఏమి వద్దులే పిల్లా
ఆ వలపే ఎంతో ముద్దులే

చరణం::2

రవ్వల మేడలంటే మనసు లేదురా
పువ్వుల పానుపంటే మోజు లేదురా.
పచ్చని చేలలో పైరగాలి జోలలో
పచ్చని చేలలో పైరగాలి జోలలో
ముచ్చటైన గూడు కట్టి వెచ్చగా ఉందాము రా
ఇంతకు మించి ఏమి వద్దులే బావా
ఈ వరమొక్కటే చాలులే

రవ్వలు ఎందుకు నీ నవ్వులు ఉండగా
పూవులు ఎందుకు నీ పులకింతలుండగా
ఆ ఆ ఆ..వీడని బాసలే వాడని తీవెలుగా
వీడని బాసలే వాడని తీవెలుగా
వెన్నెల గూడు కట్టి వేయి జన్మలుందాము
అంతకు మించి ఏమి వద్దులే
ఆ ఆ చల్లని కాపురమే చాలులే
ఆ ఆ చల్లని కాపురమే చాలులే

మిస్సమ్మ--1955




సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
రచన::పింగళి

గానం::P.లీల

కరుణించు మేరిమాత శరణింక మేరిమాత
నీవే శరణింక మేరిమాత
కరుణించు మేరిమాత శరణింక మేరిమాత
నీవే శరణింక మేరిమాత

పరిశుద్దాత్మ మహిమ వర పుత్రుగంటివమ్మ ఆ ఆ
పరిశుద్దాత్మ మహిమ వర పుత్రుగంటివమ్మ
ప్రభు ఏసునాధు కృపచే మా భువికి కలిగే రక్ష ఆ ఆ

కరుణించు మేరిమాత శరణింక మేరిమాత
నీవే శరణింక మేరిమాత

తుది లేని దారిచేరి పరిహాసమాయే బ్రతుకు
తుది లేని దారిచేరి పరిహాసమాయే బ్రతుకు
క్షణమైన శాంతిలేదే దినదినము శోధానాయే

కరుణించు మేరిమాత శరణింక మేరిమాత
నీవే శరణింక మేరిమాత

మిస్సమ్మ--1955::మోహన::రాగం



సంగీతం::సాలూరి రాజేశ్వర రావు
రచన::పింగలి నాగేంద్ర రావు
గానం::A.M.రాజా


రాగం:::మోహన

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తెలుసుకొనవె యువతీ
అలా నడచుకొనవె యువతీ
తెలుసుకొనవె యువతీ
యువకుల శాసించుటకే..ఏ..
యువకుల శాసించుటకే
యువతులవతరించిరని
తెలుసుకొనవె యువతీ
అలా నడచుకొనవె యువతీ

సాధింపులు బెదిరింపులు
ముదితలకిక కూడవనీ..నీ..ఆ..
సాధింపులు బెదిరింపులు
ముదితలకిక కూడవనీ
హృదయమిచ్చి పుచ్చుకొనె
హృదయమిచ్చి పుచ్చుకొనె
చదువేదో నేర్పాలని
తెలుసుకొనవె యువతీ
అలా నడచుకొనవె యువతీ

మూతి బిగింపులు అలకలు
పాతబడిన విద్యలనీ..నీ..ఆ..
మూతి బిగింపులు అలకలు
పాతబడిన విద్యలనీ
మగువలెపుడు మగవారిని
మగువలెపుడు మగవారిని
చిరునవ్వుల గెలవాలని
తెలుసుకొనవె యువతీ
అలా నడచుకొనవె యువతీ

మిస్సమ్మ--1955




సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
రచన::పింగళి

గానం::A.M.రాజా

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఈ నవనవాభ్యుదయ విశాల సృష్టిలో ఓ ఓ
ఈ నవనవాభ్యుదయ విశాల సృష్టిలో చిత్రములన్నీ నావేలే
కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే
కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తలుకు తలుకుమని తారలు మెరిసే
నీలాకాశము నాదేలే
ఎల్లరి వనమున కలవర పరిచే
జిలిబిలి జాబిలి నాదేలే

కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే
కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ప్రశాంత జగమును హుషారు చేసే
వసంత ఋతువు నాదేలే ఏ ఏ ఏ
పూవుల ఘుమ ఘుమ చల్లగ విసిరే ఏ
మలయమారుతము నాదేలే ఏ ఏ

కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే
కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే

భలే రంగడు--1969



సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::పిఠాపురం,L.R.ఈశ్వరీ  
Film Directed By::Taatineni RaamaaRao
తారాగణం::అక్కినేనినాగేశ్వరరావు,గుమ్మడి,పద్మనాభం,నాగభూషణం,K.సత్యనారాయణ,అల్లురామలింగయ్య,ధుళిపాళ,రావికొండలరావు,సాక్షిరంగారావు,K.V.చలం,విజయలలిత,సూర్యకాంతం,పుష్పకుమారి,వాణిశ్రీ.

పల్లవి::

అబ్బబ్బబ్బో..చలి
అహ..ఉహు..అహ..ఉహు..గిలి
నీ ప్రేమకు నే బలీ..బలి బలి బలి బలీ
ఈ దెబ్బతో నువ్..ఖాళి ఖాళి ఖాళి ఖళీ

అబ్బబ్బబ్బో..చలి
అహ..ఉహు..అహ..ఉహు..గిలి

చరణం::1 

నిండు ప్రేమలో..పడ్డాను
నిట్ట నిలువునా..తడిసాను
నిండు ప్రేమలో..పడ్డాను
నిట్ట నిలువునా..తడిసాను
తడిసీ తడిసీ..దారి గానకా
నీ కౌగిలిలో..తేలాను

నీతో నేను..తడిసాను
నీపై జాలి..తలిచాను
నీతో నేను..తడిసాను
నీపై జాలి..తలిచాను 
ఈ భాగ్యానికే వణుకుతు ఉంటే
చేయీ చేయీ..కలిపాను

అబ్బబ్బబ్బో..చలి
అహ..ఉహు..అహ..ఉహు..గిలి
ఈ దెబ్బతో నువ్..ఖాళి ఖాళి ఖాళి ఖళీ
అబ్బబ్బబ్బో..చలి
అహ..ఉహు..అహ..ఉహు..గిలి

చరణం::2

గంగీ నీపై..నాకుంది
అందుకె ఊపిరి..నిలిచింది
గంగీ నీపై..నాకుంది
అందుకె ఊపిరి..నిలిచింది 
కొంగు బట్టుకొని..నీతో ఉంటే
వెచ్చ వెచ్చగా..ఉంటుందీ

ఒళ్ళు చల్లబడి..పోయిందా..ఆ
వేడి వేడి అని..అంటుందా..ఊ 
ఒళ్ళు చల్లబడి..పోయిందా 
వేడి వేడి అని..అంటుందా
ఒంటిగ కూర్చొని..మంట వేసుకొని
యింట్లో ఉంటే..సరిపోదా

అబ్బబ్బబ్బో..చలి
అహ..ఉహు..అహ..ఉహు..గిలి
ఈ దెబ్బతో నువ్..ఖాళి ఖాళి ఖాళి ఖళీ
అబ్బబ్బబ్బో..చలి
అహ..ఉహు..అహ..ఉహు..గిలి

చరణం::3 

దివానుకే మస్క..వేసాను
బంగారపు నగ..కొట్టేసాను..ఎట్టా..ఆ
దివానుకే మస్క..వేసాను
బంగారపు నగ..కొట్టేసాను 
రంగుగ నీ మెడలో..తగిలించి
రంజు రంజు గా..చూస్తాను

బంగారపు..నగలొద్దయ్యో..ఆహా!
సింగారం పని..లేదయ్యో..ఏం
బంగారపు..నగలొద్దయ్యో  
సింగారం పని..లేదయ్యో 
బొంగారమ్ములావున్న..నీవే
నా హంగుకు..సరిపోతావయ్యో 

అబ్బబ్బబ్బో..చలి
అహ..అహ..అహ..అహా..గిలి
నీ ప్రేమకు నే బలీ..బలి బలి బలి బలీ
అబ్బబ్బబ్బో..చలి
అహ..ఉహు..అహ..ఉహు..గిలి 
అహ..అహ..అహ..అహా..
అహ..అహ..అహ..అహా..

Bhale Rangadu--1969
Music::K.V.Mahaadevan
Lyrics::kOsaraaju 
Singer's::Pithaapuram,L.R.Iswari
Film Directed By::Taatineni RaamaaRao
Cast::AkkineniNageswaraRao,Gummadi,Padmanaabham,Naagabhooshanam,K.Satyanaaraayana,Alluraamalingayya,Dhulipaala,RaavikondalaRao,SaakshiRangaaRao,K.V.Chalam,Vaanisree,Vijayalalita.

::::::::::::::::::::::::::::::::::::::::::

abbabbabbO..chali
aha..uhu..aha..uhu..gili
nee prEmaku nE balii..bali bali bali balii
ii debbatO nuv..khaaLi khaaLi khaaLi khaLii

abbabbabbO..chali
aha..uhu..aha..uhu..gili

::::1 

ninDu prEmalO..paDDaanu
niTTa niluvunaa..taDisaanu
ninDu prEmalO..paDDaanu
niTTa niluvunaa..taDisaanu
taDisii taDisii..daari gaanakaa
nee kougililO..tElaanu

neetO nEnu..taDisaanu
neepai jaali..talichaanu
neetO nEnu..taDisaanu
neepai jaali..talichaanu 
ii bhaagyaanikE vaNukutu unTE
chEyii chEyii..kalipaanu

abbabbabbO..chali
aha..uhu..aha..uhu..gili
ii debbatO nuv..khaaLi khaaLi khaaLi khaLii
abbabbabbO..chali
aha..uhu..aha..uhu..gili

:::2

gangee neepai..naakundi
anduke Upiri..nilichindi
gangee neepai..naakundi
anduke Upiri..nilichindi 
kongu baTTukoni..neetO unTE
vechcha vechchagaa..unTundii

oLLu challabaDi..pOyindaa..aa
vEDi vEDi ani..anTundaa..uu 
oLLu challabaDi..pOyindaa 
vEDi vEDi ani..anTundaa
onTiga koorchoni..manTa vEsukoni
yinTlO unTE..saripOdaa

abbabbabbO..chali
aha..uhu..aha..uhu..gili
ii debbatO nuv..khaaLi khaaLi khaaLi khaLii
abbabbabbO..chali
aha..uhu..aha..uhu..gili

::::3 

divaanukE maska..vEsaanu
bangaarapu naga..koTTEsaanu..eTTaa..aa
divaanukE maska..vEsaanu
bangaarapu naga..koTTEsaanu 
ranguga nee meDalO..tagilinchi
ranju ranju gaa..choostaanu

bangaarapu..nagaloddayyO..aahaa!
singaaram pani..lEdayyO..Em
bangaarapu..nagaloddayyO  
singaaram pani..lEdayyO 
bongaarammulaavunna..neevE
naa hanguku..saripOtaavayyO 

abbabbabbO..chali
aha..aha..aha..ahaa..gili
nee prEmaku nE balii..bali bali bali balii
abbabbabbO..chali
aha..uhu..aha..uhu..gili 
aha..aha..aha..ahaa..
aha..aha..aha..ahaa..

భలే రాముడు--1956::అభేరి ::రాగం





సంగీతం::S.రాజేశ్వరరావ్
రచన::సదాశివబ్రహ్మం
గానం::ఘంటసాల,P.సుశీల


అభేరి ::: రాగం


ఓహో మేఘమలా..ఆ..ఆ..ఆ

నీలాల మేఘమాలా
ఓహో మేఘమలా
నీలాల మేఘమాలా

చల్లగ రావేలా మెల్లగ రావేలా
చల్లగ రావేలా మెల్లగ రావేలా
వినీలా మేఘమాలా
వినీలా మేఘమాలా

నిదురపోయే రామచిలుకా
నిదురపోయే రామచిలుకా
బెదరిపోతుంది కల చెదిరిపోతుంది

చల్లగ రావేలా మెల్లగ రావేలా

ప్రేమసీమలలో చరించే బాటసారీ ఆగవోయీ
ప్రేమసీమలలో చరించే బాటసారీ ఆగవోయీ
పరవశంతో ప్రేమగీతం పాడబోకోయీ
పరవశంతో ప్రేమగీతం పాడబోకోయీ..
యెం..నిదురపోయే రామచిలుకా
నిదురపోయే రామచిలుకా
బెదరిపోతుంది కల చెదిరిపోతుంది

చల్లగ రావేలా మెల్లగ రావేలా!!

ఓహో .....
ఓహో .....
ఆశలన్నీ తారకలుగా హరమొనరించి
ఆశలన్నీ తారకలుగా హరమొనరించి
అలంకారమొనరించి
మాయ చేసి మనసు దోచి
పారి పోతావా..దొంగా..పారిపోతావా

చల్లగ రావేలా మెల్లగ రావేలా
చల్లగ రావేలా మెల్లగ రావేలా