Monday, November 21, 2011

శివరంజనీ--1978

ఈ పాట ఇక్కడ వినండి


సంగీతం::రమేష్‌నాయుడు
గానం::P.సుశీల

సందమామా వచ్చాడమ్మా
తొంగి తొంగీ నిను చూసాడమ్మా

తలుపు తెరచుకో..పిలుపు అందుకో
ముత్యాల ముంగిటలో కలువభామా
విడిదొసగీ విందు చేయి కలువభామా

సందమామా వచ్చాడమ్మా
తొంగి తొంగీ నిను చూసాడమ్మా
నిను చూసాడమ్మా !

ఎన్నెల మిఠాయి తెచ్చాడమ్మా..తెచ్చాడమ్మ
సయ్యాటకు పిలిచాడమ్మా..పిలిచాడమ్మ
పన్నీరు చల్లవే..పాన్పు వెయ్యవే
ముత్యాల ముంగిటలో కలువభామా
విడిదొసగీ విందు చేయి కలువభామా

సందమామా వచ్చాడమ్మా
తొంగి తొంగీ నిను చూసాడమ్మా
నిను చూసాడమ్మా !

పడకగదికి వెళ్ళామ్మా..వెళ్ళాలమ్మ
తాంబూలం ఇవ్వాలమ్మా..ఇవ్వాలమ్మ
తంతు నడుపుకో..చెంత చేరుకో
ముత్యాల ముంగిటలో కలువభామా
విడిదొసగీ విందు చేయి కలువభామా

సందమామా వచ్చాడమ్మా
తొంగి తొంగీ నిను చూసాడమ్మా
తలుపు తెరచుకో..పిలుపు అందుకో
ముత్యాల ముంగిటలో కలువభామా
విడిదొసగీ విందు చేయి కలువభామా

సందమామా వచ్చాడమ్మా
తొంగి తొంగీ నిను చూసాడమ్మా
నిను చూసాడమ్మా

ఒక నారివంద తుపాకులు--1973
























సంగీత::సత్యం
రచన::కొసరాజు రాఘవయ్య
గానం::L.R.ఈశ్వరి
తారాగణం::విజయలలిత,విజయభాను,రాజబాబు,రాజనాల,ప్రభాకరరెడ్డి,రామదాసు   

పల్లవి::

చింతా సెట్టు నీడా వుందిరా..ఓ నాయుడు బావ
సిన్నదానీ....సోకు సూడరా 
సంతాలోన సూసినానురా..ఓ రాయుడు బావ
గంతులేసి....వచ్చీనానురా
సక్కని రంభనురా పక్కన వున్నారా
సైగలు చేశారా..సైయని రావేరా  
చింతా సెట్టు నీడా వుందిరా..ఓ నాయుడుబావ
సిన్నదానీ....సోకు సూడరా 
సంతాలోన సూసినానురా..ఓ రాయుడు బావ
గంతులేసి....వచ్చీనానురా

చరణం::1

మల్లెపూల సెండులోన మజావుందిరా
అది వాడనపుడు వాడుకుంటె వాసనుందిరా  
మల్లెపూల సెండులోన మజావుందిరా
అది వాడనపుడు వాడుకుంటె వాసనుందిరా  
మంచీ బేరమురా..మించిన దొరకదురా
నీవే తెలుసుకో..నేస్తం కలుపుకో   
చింతా సెట్టు నీడా వుందిరా..ఓ నాయుడుబావ
సిన్నదానీ....సోకు సూడరా 
సంతాలోన సూసినానురా..ఓ రాయుడు బావ
గంతులేసి....చ్చీనానురా

చరణం::2

పిట్ట ఎగిరి పోయేనంటె నీకు సిక్కదూ ఆహా
ఎక్కడైన వాలెనంటె నీకు దక్కదూ
పిట్ట ఎగిరి పోయేనంటె నీకు సిక్కదూ ఆహా
ఎక్కడైన వాలెనంటె నీకు దక్కదూ
ముద్దుగ సూసుకో ముచ్చట తీర్చుకో
కన్నుల దాచుకో..కౌగిట చేర్చుకో   
చింతా సెట్టు నీడా వుందిరా..ఓ నాయుడుబావ
సిన్నదానీ....సోకు సూడరా 
సంతాలోన సూసినానురా..ఓ రాయుడు బావ
గంతులేసి....వచ్చీనానురా
సక్కని రంభనురా..పక్కన వున్నారా
సైగలు చేశారా....సైయని రావేరా
చింతా సెట్టు నీడా వుందిరా..ఓ నాయుడుబావ
సిన్నదానీ....సోకు సూడరా 
సంతాలోన సూసినానురా..ఓ రాయుడు బావ
గంతులేసి....వచ్చీనానురా

మనువు మనసు--1973












సంగీత::అశ్వద్థామ
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::ప్రకాశ్.చంద్రకళ, విజయలలిత,కృష్ణకుమారి,చంద్రమోహన్,రమణారెడ్డి,రేలంగి

పల్లవి::

ఆ  ఆ  ఆ  ఆ  ఆ ఆ  ఆ  ఆ  ఆ  ఆ  
మురళీలోలుడు మరులను పొంగించి మోము చూపడాయె 
చేసిన బాసలు రేపిన ఆశలు నీటి రాతలాయె కన్నీటి రాతలాయె 
మురళీలోలుడు మరులను పొంగించి మోము చూపడాయె 

చరణం::1

ఆ యమునానది ఆ బృందావని అడిగెను నన్నే నీ ప్రియుడేడని
ఆ యమునానది ఆ బృందావని అడిగెను నన్నే నీ ప్రియుడేడని 
మదిలో చెలరేగే సుడిగాలులతో..ఆ  ఆ  ఆ  ఆ  ఆ   
మదిలో చెలరేగే సుడిగాలులతో బదులు పలికేను ఏమని..ఏడని 
మురళీలోలుడు మరులను పొంగించి మోము చూపడాయె 

చరణం::2

ఎన్నినాళ్ళని రగిలే గుండెను కన్నీళ్ళమాటున దాచేను 
ఎన్నినాళ్ళని రగిలే గుండెను కన్నీళ్ళమాటున దాచేను 
ఎవరికోసమని ఎందుకోసమని కడుపున కార్చిచ్చు మోసేను
మురళీలోలుడు మరులను పొంగించి మోము చూపడాయె 
చేసిన బాసలు రేపిన ఆశలు నీటి రాతలాయె కన్నీటి రాతలాయె 
మురళీలోలుడు మరులను పొంగించి మోము చూపడాయె