Wednesday, November 25, 2009

రౌడీలకు రౌడీలు--1971సంగీత::సత్యం
రచన::ఆరుద్ర
గానం::L.R.ఈశ్వరి
తారాగణం::రామకృష్ణ,సత్యనారాయణ,ప్రభాకర రెడ్డి,రాజబాబు, విజయలలిత,జ్యోతిలక్ష్మి,రమాప్రభ

పల్లవి::


తీస్కో కొకక్కోలా..ఏస్కో రమ్ముసారా
చూస్తే మజా...గుటకేస్తే నిషా
కలిపి కొట్టు మొనగాడా..ఆఆఆ ఓవ్ 
తీస్కో కొకక్కోలా...ఏస్కో రమ్ముసారా
చూస్తే మజా...గుటకేస్తే నిషా
కలిపి కొట్టు మొనగాడా..ఆఆఆ ఓవ్ 
తీస్కో...కొకక్కోలా....ఆవ్  

చరణం::1

మతి చెడితే..హ..మందుందీ మనసైతే..హా..నేనున్నా
మతి చెడితే మందుందీ..మనసైతే..నేనున్నా
రెండూ..ఊ..కైపిస్తే..రేయీ..ఈ..బలే..హాయీ
హోయ్..మగాడా నువ్ బిగించూ నీ సగం సగం 
తెగింపులో సుఖం లేదు రా..ఆ..ఈఈఈఈయ్య  
తీస్కో కొకక్కోలా..ఏస్కో రమ్ముసారా
చూస్తే మజా గుటకేస్తే నిషా..కలిపి కొట్టు మొనగాడా..ఆ
తీస్కో...కొకక్కోలా..ఆ 

చరణం::2

ఊరించే ఒంపులూ..ఉడుకెత్తే సొగసులూ
ఊరించే హా..ఒంపులూ..ఉడుకెత్తే హో..సొగసులూ
జతగా..ఆ..నేనుంటా..జలసా చేయిస్తా..ఆ
కులాస ఒక తమాష ఈ ఉమర్ ఖయాం 
సరాగమే పసందని రా..ఆఆఈఈఇయ్య 
తీస్కో కొకక్కోలా..ఏస్కో రమ్ముసారా
చూస్తే మజా గుటకేస్తే నిషా..కలిపి కొట్టు మొనగాడా..ఆ
తీస్కో..కొకక్కోలా..ఆవ్